ఆర్ఎంపి వైద్యం వికటించి మహిళ మృతి
రాజన్న సిరిసిల్ల
జిల్లాలో ఆర్.ఎం.పి వైద్యుల విచ్చలవిడి వైద్యం ఒక ప్రాణాన్ని బలి తీసుకుంది. . ఎల్లారెడ్డిపేట మండలం తిమ్మాపూర్ లో ఆర్.ఎం.పి. వైద్యం వికటించి గంభీరావుపేట మండలం సముద్రలింగాపూర్ కు చెందిన ఖాసింబీ మహిళ మృతి చెందింది. సాధారణ జ్వరంతో వెళ్ళిన మహిళకు ఆర్.ఎం.పి.దేవేందర్ రక్త పరీక్షలు జరిపించి సెలైన్ ఎక్కించాడు. కాసేపటికే మహిళ అపస్మారక స్థితిలోకి వెళ్ళింది. వెంటనే ఆర్ఎంపి ఆమెను తన కారులో ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి ఫరారైయాడు. ఖాసింబీ ఆరోగ్యం క్షీణించి శనివారం తెల్లవారు జామున మృతి చెందింది. పోస్ట్ మార్టమ్ కొరకు సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి మృతదేహం తరలించారు. ఆర్ఎంపి ఇచ్చిన ఇంజెక్షన్ వికటించి మృతిచెందిందని బంధువులు ఆందోళనకు దిగారు. గతంలో కూడా ఆర్.ఎం.పి వైద్యం వికటించిన ఘటనలు ఉన్నాయని స్థానికులు అంటున్నారు.