Rajahmundry:ఈ చెట్టు 33 లక్షలట:దేశ విదేశాలకు చెందిన విభిన్న మొక్కలతో కనువిందు చేసే కడియం నర్సరీలో ఏదో ఓ ప్రత్యేకత కనిపిస్తూనే ఉంటుంది.. అందుకే భారత కుబేరుడు ముఖేష్ అంబానీ అంతటి వాడే నేరుగా తన వారిని కడియం పంపించి తాను గుజరాత్లో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన పార్కులో ఇక్కడి నుంచే లక్షల రూపాయలు వెచ్చించి మొక్కలను తీసుకెళ్లారు… ఒకప్పడు దేశీయ జాతులకు చెందిన మొక్కలను అభివృద్ధి చేసే పద్దతి నుంచి మరికొన్నాళ్లకు విదేశీజాతుల మొక్కలను కడయం నర్సరీల్లోనే అభివృద్ధి చేసే స్థాయికి చేరుకున్నారు ఇక్కడి రైతులు.
ఈ చెట్టు 33 లక్షలట..
రాజమండ్రి, ఫిబ్రవరి 21
దేశ విదేశాలకు చెందిన విభిన్న మొక్కలతో కనువిందు చేసే కడియం నర్సరీలో ఏదో ఓ ప్రత్యేకత కనిపిస్తూనే ఉంటుంది.. అందుకే భారత కుబేరుడు ముఖేష్ అంబానీ అంతటి వాడే నేరుగా తన వారిని కడియం పంపించి తాను గుజరాత్లో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన పార్కులో ఇక్కడి నుంచే లక్షల రూపాయలు వెచ్చించి మొక్కలను తీసుకెళ్లారు.. ఒకప్పడు దేశీయ జాతులకు చెందిన మొక్కలను అభివృద్ధి చేసే పద్దతి నుంచి మరికొన్నాళ్లకు విదేశీజాతుల మొక్కలను కడయం నర్సరీల్లోనే అభివృద్ధి చేసే స్థాయికి చేరుకున్నారు ఇక్కడి రైతులు. విభిన్నంగా ఆలోచించి ఏకంగా విదేశాల్లో వందేళ్ల వయసున్న మొక్కలను ప్రత్యేక కంటైనర్లు ద్వారా ఇక్కడికి రప్పించి అంతర్జాతీయ స్థాయి నర్సరీ మార్కెట్తో పోటీపడుతున్నారు.. ఇదిలా ఉంటే కడియం నర్సరీలో ఇప్పడు ఓ అరుదైన ఏళ్లనాటి చెట్టు అందరినీ ప్రత్యేకంగా ఆకర్షిస్తోంది.. ఎన్నో వెరైటీ బోన్సాయ్ మొక్కలను అభివృద్ధి చేసి నర్సరీల నిండానింపిన అనుభవం ఉన్న కడియం నర్సరీ రైతులు తాజాగా తీసుకువచ్చిన భారీ ఆకారంగల బోన్సాయ్ చెట్లతో వృక్ష ప్రేమికులను అమితంగా ఆకర్షిస్తున్నారు.
తూర్పుగోదావరి జిల్లాలోని కడియంలో శ్రీ శివాంజనేయ నర్సరీ రైతు మల్లు పోలరాజు మూడు రోజుల క్రితం విదేశాల నుంచి వీటిని తీసుకొచ్చిన చెట్లు ఇప్పడు అందరినీ ప్రత్యేకంగా ఆకర్షిస్తోంది.. భారీ ఆకారంలో కలసాన్ని పోలి ఉన్న ఈ భారీ వృక్షాలు అందర్నీ అబ్బుర పరుస్తున్నాయి. ఈ చెట్టును “సిల్క్ ప్లోస్ ట్రీ అని పిలిచే దీని శాస్త్రీయ నామం. వీటిని ప్రత్యేక కంటైనర్ ఉంచి 75 రోజుల క్రితం షిప్ లో వేస్తే చెన్నై నుంచి ఇక్కడికి తీసుకువచ్చారు. దక్షిణ అమెరికా దేశంలో విరివిగా ఉండే ఈ మొక్కలను స్పెయిన్, థాయిలాండ్ వంటి దేశాల్లో విక్రయాలు చేపడుతున్నారు. పెద్దపెద్ద పార్కులు, హోటల్స్, ధనవంతుల గార్డెన్స్ లోనూ వీటిని ప్రత్యేక ఆకర్షణ కోసం పెంచుకుంటుంటారని నర్సరీ యజమాని తెలిపారు. ఈ చెట్టు వయసు వంద నుంచి నూట ఇరవై ఏళ్లు ఉంటుందని చెప్పారు.. కడియం నర్సరీలో ఉన్న ఈ చెట్లు ఇటీవలే హైదరాబాద్లోని చిలుకూరు సమీపంలో నిర్మించిన ఎక్స్పీరియం లో ఉన్నాయట.. సాధారణంగా బోన్సాయ్ మొక్కలు అంటేనే చాలా ఖరీదైనవిగా చెబుతుంటారు. ఇంత ఖరీదు ఎందుకు అంటే ఏళ్ల తరబడి వీటిని ఓ ప్రత్యేక రూపంలోకి మళ్లించేందుకు చాలా ప్రయాస పడుతుంటారు. అంతేకాకుండా కొన్ని ప్రత్యేక వాతావరణంలో కూడా వీటిని కాపాడుకోవాల్సి ఉంటుంది.. కావాల్సిన ఆకృతిలోకి మళిచేందుకు చాలా కష్టపడాల్సి వస్తుంది.. అయితే ఇప్పడు కడియం నర్సరీలో దర్శనమిస్తున్న ఈ అరుదైన వృక్షం సొంతం చేసుకోవాలంటే మాత్రం కళ్లు బైర్లు కమ్మాల్సిందే.. ఈ అరుదైన చెట్లు విషయానికి వస్తే ఒక్కొక్కటి రూ.35 నుంచి 40 లక్షలు ఉంటాయి.కాగా, నర్సరీలో ఉన్న ఈ చెట్టు ధర రూ.33 లక్షలు అని నర్సరీ యజమాని తెలిపారు. ప్రస్తుతం మోడులుగా కనిపిస్తున్న వీటికి చిన్నచిన్న కొమ్మలు వచ్చి రంగురంగుల పువ్వులు పూస్తాయి. అప్పుడు మరింత శోభాయమానంగా నీ మొక్కలు సందర్శకులను అలరిస్తాయి. ప్రపంచ నర్సిరీ రంగంలో ఏమాత్రం తీసి పోమని చాటి చెప్పడానికే వీటిని ఇక్కడకు తీసుకొచ్చినట్లు నర్సరీ రైతు మల్లు పోలరాజు తెలిపారు.
Read more:Andhra Pradesh:ఇక ఫుల్ టైమ్ పాలిటిక్సేనా