Raj Tarun, Mannara Chopra, AS Ravikumar Chaudhary, Suraksh Entertainment Radhabhai Song Release from ‘Thiragabadarasamy’ | రాజ్ తరుణ్, మన్నారా చోప్రా, ఎ ఎస్ రవికుమార్ చౌదరి, సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ ‘తిరగబడరసామీ’ నుంచి రాధాభాయ్ సాంగ్ రిలీజ్ | Eeroju news

'Thiragabadarasamy'

రాజ్ తరుణ్, మన్నారా చోప్రా, ఎ ఎస్ రవికుమార్ చౌదరి, సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ ‘తిరగబడరసామీ’ నుంచి రాధాభాయ్ సాంగ్ రిలీజ్

Raj Tarun, Mannara Chopra, AS Ravikumar Chaudhary, Suraksh Entertainment Radhabhai Song Release from ‘Thiragabadarasamy’ :

యంగ్ అండ్ ప్రామెసింగ్ హీరో రాజ్ తరుణ్ హీరోగా, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ ఎ ఎస్ రవికుమార్ చౌదరి దర్శకత్వంలో రూపొందుతున్న హోల్సమ్ ఎంటర్‌టైనర్ ‘తిరగబడరసామీ‘. మాల్వి మల్హోత్రా కథానాయికగా నటిస్తోంది. సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ మీడియా బ్యానర్ పై మల్కాపురం శివకుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  యూత్ ఆకట్టుకునే రోమాన్స్ తో పాటు ఫ్యామిలీని ఆకర్షించే సెంటిమెంట్, మాస్ ని అలరించే హై వోల్టేజ్ యాక్షన్, ఎమోషనల్ ఎలిమెంట్స్ తో ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.సెన్సేషనల్ బ్యూటీ మన్నారా చోప్రా ఈ చిత్రంలో ఓ డిఫరెంట్ క్యారెక్టర్ తో పాటు ఒక స్పెషల్ సాంగ్ లో అలరించబోతుంది.

తాజాగా మేకర్స్ మన్నారా పై చిత్రీకరించిన రాధాభాయ్ లిరికల్ సాంగ్ ని విడుదల చేశారు. భోలే షావలి ఈ పాటని క్యాచి మాస్ నెంబర్ గా కంపోజ్ చేశారు. భోలే షావలి లిరిక్స్ అందించిన ఈ పాటని శ్రావణ భార్గవి హైలీ ఎనర్జిటిక్ గా ఆలపించారు. ఈ పాటలో మన్నారా చోప్రా మాస్ డ్యాన్స్ మూమెంట్స్ విశేషంగా ఆకట్టుకున్నాయి.ఈ చిత్రంలో మకరంద్ దేశ్‌పాండే, జాన్ విజయ్, రఘు బాబు, అంకిత ఠాకూర్, పృధ్వి, ప్రగతి, రాజా రవీంద్ర, బిత్తిరి సత్తి ఇతర కీలక పాత్రలు పోషించారు.ఈ చిత్రానికి జవహర్ రెడ్డి కెమరామెన్ గా పని చేస్తున్నారు. బస్వా పైడిరెడ్డి ఎడిటర్, రవికుమార్ గుర్రం ఆర్ట్ డైరెక్టర్.
తారాగణం: రాజ్ తరుణ్ , మాల్వీ మల్హోత్రా, మన్నారా చోప్రా, మకరంద్ దేశ్‌పాండే, రఘు బాబు, జాన్ విజయ్, అంకిత ఠాకూర్, పృధ్వి, ప్రగతి, రాజా రవీంద్ర, బిత్తిరి సత్తి

 

'Thiragabadarasamy'

 

హీరో విశ్వక్‌ సేన్ చేతుల మీదగా విడుదలైన పద్మవ్యూహంలో చక్రధారి మూవీ ట్రైలర్ | Padmavyuhamlo Chakradhari movie trailer released by hero Vishwak Sen | Eeroju news

 

Related posts

Leave a Comment