తెలంగాణలో రాగల మూడురోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు
హైదరాబాద్ అక్టోబర్ 14
Rains in Telangana
తెలంగాణలో రాగల మూడురోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని.. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడే అవకాశాలున్నాయని వాతావరణశాఖ హెచ్చరించింది. ఈ క్రమంలో ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. బుధవారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, కొత్తగూడెం, ఖమ్మం, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ వానలుపడుతాయని చెప్పింది.
గురువారం ఉమ్మడి ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, సిద్దిపేట, నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వానలు కురిసేందుకు అవకాశాలున్నాయని వాతావరణశాఖ హెచ్చరించింది.
అలాగే, శుక్రవారం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాలో వర్షాలు కురిసేందుకు అవకాశాలున్నాయని హెచ్చరించింది.
Telangana Rains | రాష్ట్రంలో మరో మూడురోజులు వర్షాలు | Eeroju news