పుష్ప 2 సినిమా రిలీజ్ రోజున సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందింది. అయితే ఈ విషయం మీద చాలామంది సినీ రాజకీయ ప్రముఖులు సైతం రకరకాలుగా స్పందిస్తూ వస్తున్నారు. ఇక ఈ ఘటనలో అల్లు అర్జున్ మీద కేసు నమోదైంది. మరి ఏది ఏమైనా కూడా ఈ విషయంలో ఆయన జైలుకు వెళ్తాడా అంటూ కొంతమంది కొన్ని రకాల కామెంట్లు అయితే చేస్తున్నారు.
పోలీసులు కేసు విత్ డ్రాదిశగా అడుగులు
హైదరాబాద్, డిసెంబర్ 30
పుష్ప 2 సినిమా రిలీజ్ రోజున సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందింది. అయితే ఈ విషయం మీద చాలామంది సినీ రాజకీయ ప్రముఖులు సైతం రకరకాలుగా స్పందిస్తూ వస్తున్నారు. ఇక ఈ ఘటనలో అల్లు అర్జున్ మీద కేసు నమోదైంది. మరి ఏది ఏమైనా కూడా ఈ విషయంలో ఆయన జైలుకు వెళ్తాడా అంటూ కొంతమంది కొన్ని రకాల కామెంట్లు అయితే చేస్తున్నారు. ప్రస్తుతం మధ్యంతర బేయిల్ మీద బయట తిరుగుతున్న ఆయన ఆ గడువు ముగిసింది. కాబట్టి జనవరి 10వ తేదీన హైకోర్టులో హాజరు కాబోతున్నట్టుగా తెలుస్తోంది. మరి ఆ ఆరోజు అల్లు అర్జున్ కనక దోషిగా తేలితే ఆయనకు ఎన్ని రోజుల శిక్ష పడబోతుందనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మరి ఈ క్రమంలోనే అతని మీద కేసు పెట్టిన పోలీసులు ఆ కేసు ను విత్ డ్రా చేసుకునే అవకాశం ఏమైనా ఉందా అనే ధోరణిలో కూడా అల్లు అర్జున్ లాయర్ అయిన నిరంజన్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక వాళ్లతో కూడా సంప్రదింపులు జరిపిన తర్వాత వాళ్లు దృఢ నిశ్చయంతో ముందుకు సాగాలని చూస్తున్నారు. విత్ డ్రా విషయంలో వాళ్ళు ఎలాంటి స్పందనను తెలియజేయడం లేదట.వాళ్ళు కేసు విత్ డ్రా చేసుకోవడం కొంతవరకు కష్టమనే విషయం అయితే స్పష్టం గా తెలుస్తోంది. మరి ఇలాంటి సందర్భంలో ఇప్పుడు తప్పు ఎవరిది అనేది తేలితే మాత్రం కోర్టులో వాళ్లకు తప్పకుండా శిక్ష అయితే పడుతుంది. మరి ఒకవేళ అల్లు అర్జున్ కనుక తప్పు చేశాడు అని తెలిస్తే మాత్రం కోర్టు అతన్ని శిక్షిస్తుందా?ఈ కేసు ఎక్కడి వరకు వెళ్లబోతుంది అనేది కూడా తెలియాల్సిన అవసరమైతే ఉంది. ఇక ఏది ఏమైనా కూడా అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరో ప్రస్తుతం పుష్ప 2 సినిమాతో పెను ప్రభంజనాన్ని క్రియేట్ చేస్తున్న నేపధ్యం లో ఆయనకు ఏ మాత్రం సంతోషం లేకుండా పోతుంది. ఇక ఈ కేసు విషయం అతన్ని తీవ్రమైన దిగ్భ్రాంతికి గురిచేస్తుందనే చెప్పాలి.మరి దీని వల్ల ఆయన ఫ్యూచర్ లో ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కోబోతున్నాడు. తన స్టార్ డమ్ కూడా తగ్గిపోబోతుందా అనేది తెలియాల్సి ఉంది. మరి ఏది ఏమైనా ఇప్పుడు అల్లు అర్జున్ కి చాలా కష్ట కాలం నడుస్తుందనే చెప్పాలి. మరి అతన్ని ఈ కేసు నుంచి ఎవరు సేవ్ చేయబోతున్నారనేది తెలియాల్సి ఉంది…
Read:Hyderabad:బోర్డర్ లో కనిపించని వ్యాపారాలు