మోడీ ప్రభుత్వం మైనార్టీలో ఉందనే ప్రచారం
ఎంపీలను కాపాడుకొనే ఎత్తు గడ ..ఆత్మ రక్షణలో కాంగ్రెస్ పార్టీ …
న్యూ డిల్లీ జూన్ 18
Propaganda that Modi government is in minority :
కేంద్రంలో వరుసగా మూడోసారి ఎన్డీయే ప్రభుత్వం కొలువుదీరింది. ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టారు. ఎన్డీయే మిత్రపక్షాలకు 292 మంది ఎంపీల బలం ఉంది. బీజేపీ సొంతంగా 240 మంది ఎంపీలున్నారు. ఎన్నికలకు ముందే బీజేపీ మరికొన్ని పార్టీలతో కలిసి ఎన్డీయే కూటమిగా బరిలోకి దిగింది. ఎన్డీయే కూటమి ప్రభుత్వాన్ని గెలిపించాలని ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సొంతంగా తమకు 300కు పైగా సీట్లు వస్తాయని బీజేపీ ఆశించింది. కానీ ఫలితం భిన్నంగా వచ్చింది. కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సంఖ్యాబలం బీజేపీకి రాకపోయినప్పటికీ.. ఎన్డీయే ప్రభుత్వం కేంద్రంలో ఉండాలని ప్రజలు తీర్పునిచ్చారు. ప్రధానమంత్రిగా మోదీ అభ్యర్థిత్వానికి ఎన్డీయే భాగస్వామ్యపక్షాలు ఓకే చెప్పాయి. దీంతో మోదీ వరుసగా మూడోసారి ప్రధాని అయ్యారు.
మరోవైపు కాంగ్రెస్ మాత్రం బీజేపీకి ప్రభుత్వ ఏర్పాటుకు సంఖ్యాబలం లేదని.. మోదీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించడం అనైతికమంటూ కాంగ్రెస్‌తో పాటు ఇండియా కూటమిలోని భాగస్వామ్యపక్షాలు రాజకీయ విమర్శలు చేస్తున్నాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఓ అడుగు ముందుకేసి మోదీ ప్రభుత్వం మైనార్టీలో ఉందని.. ఎప్పుడైనా కూలిపోవచ్చన్నారు. అదే సమయంలో ఈ ప్రభుత్వం కూలిపోవాలని తాము కోరుకోవడం లేదంటూ మరో వ్యాఖ్య చేశారు. వాస్తవానికి మోదీ ప్రభుత్వం మైనార్టీలో ఉందా.. తగిన సంఖ్యా బలంతో ప్రభుత్వం ఏర్పాటుచేసిందా అనే విషయంలో ఎటువంటి అనుమానాలు అవసరం లేదు. ఎందుకంటే ఎన్నికలకు ముందే ఎన్డీయే కూటమిగా ఏర్పడి ప్రజల ముందుకెళ్లడంతో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజార్టీ సీట్లు కూటమికి వచ్చాయి. దీంతో ఎన్డీయే సర్కార్ ఏర్పడింది. కానీ ఇండియా కూటమి విమర్శల వెనుక అసలు కారణంపై రాజకీయ విశ్లేషకులు పలు రకాల విశ్లేషణలు చేస్తున్నారు.కాంగ్రెస్ ఆరోపిస్తున్నట్లు మోదీ ప్రభుత్వం మైనార్టీలో లేదు.
టీడీపీ, జేడీయూతో పాటు మరికొన్ని ఎన్డీయే భాగస్వామ్యపక్షాల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు తమ మద్దతును ఉపసంహరించుకుంటే కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కూలిపోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ఎన్నికలకు ముందే పొత్తు పెట్టుకున్న కారణంగా ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు ఇప్పటికిప్పుడు మద్దతు ఉపసంహరించుకునే అవకాశాలు లేవని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. ఎన్డీయే కూటమిలో బీజేపీకి 240 మంది ఎంపీలు ఉన్నారు. ఇండియా కూటమిలో అతిపెద్ద పార్టీగా ఉన్న కాంగ్రెస్‌కు 99 మంది ఎంపీలు ఉండగా.. మహారాష్ట్రకు చెందిన కాంగ్రెస్ రెబల్ ఎంపీ ఒకరు ఆ పార్టీలో చేరడంతో కాంగ్రెస్ బలం వందకు చేరింది. అధికారం చేపట్టాలంటే కాంగ్రెస్‌కు మరో 172 మంది ఎంపీల బలం అవసరం.
ఎన్డీయే కూటమిలో ఉన్న పార్టీల మద్దతు లేకుండా కాంగ్రెస్ అధికారం చేపట్టడం కష్టం. ఇండియా కూటమి అధికారంలోకి రావాలంటే ఆ పార్టీలో ఇప్పుడున్న భాగస్వామ్య పక్షాలకు కలిపి 233 మంది ఎంపీల బలం ఉంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే మరో 39 మంది ఎంపీల మద్దతు అవసరం. టీడీపీ, జేడీయూకు చెందిన ఎంపీల సంఖ్య కలిపినా ఇండియా కూటమి సంఖ్య 261కి చేరుతుంది. ఇంకా 12 మంది ఎంపీల మద్దతు అవసరం. అంటే సుమారు మరో మూడు నుంచి నాలుగు పార్టీలకు చెందిన మద్దతు ఇండియా కూటమికి అవసరం. ఇన్ని పార్టీల కలయికతో ప్రభుత్వం ఏర్పడినా ఎన్నిరోజులు పాలన కొనసాగిస్తుందనే విషయం అనుమానేమనంటున్నారు రాజకీయ పండితులు. ఈ క్రమంలో మోదీ ప్రభుత్వానికి ప్రస్తుతం వచ్చిన నష్టం ఏమి లేదని.. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వానికి అవసరమైన మెజార్టీ ఉందనే విషయాన్ని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.
మోదీ వరుసగా మూడోసారి ప్రధానమంత్రి బాధ్యతలు చేపట్టారు. మరో ఐదేళ్లు కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఉండే అవకవాశం ఉంది. దీంతో ఇండియా కూటమికి చెందిన కొందరు ఎంపీలను బీజేపీ ఆకర్షించే అవకాశం ఉందనే అనుమానంతోనే కాంగ్రెస్ నేతలు మోదీ ప్రభుత్వం త్వరలోనే కూలిపోతుందని.. మైనార్టీలో ఉందనే ప్రచారం చేస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కాంగ్రెస్ పార్టీతో పాటు ఇండియా కూటమిలోని పార్టీలు తమ ఎంపీలు పార్టీ మారకుండా ఉండేందుకు ఈ ప్రచారానికి కాంగ్రెస్ తెరలేపిందనే చర్చ నడుస్తోంది. తమ పార్టీలకు చెందిన పార్లమెంట్ సభ్యులు చేజారిపోకుండా ఉండేందుకు ఎన్డీయే ప్రభుత్వం ఎక్కువ కాలం ఉండదని.. ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందనే ఆశ కల్పించడం ద్వారా పార్టీ నాయకులను కాపాడుకునేందుకు వేసిన ఎత్తుగడగా తెలుస్తోంది. కాంగ్రెస్ తన వ్యూహంతో ఎంపీలను కాపాడుకోగలదా లేదా అనేది భవిష్యత్తులో తేలనుంది.
ఇక 4 వైపుల నుంచి నారాయణుడి దర్శనం | Darshan of Narayan from 4 sides | Eeroju news