ప్రజావాణి దరఖాస్తులను సత్వరంగా పరిష్కరించాలి
సిద్దిపేట
Prajavani applications should be dealt with expeditiously
ప్రజావాణి కార్యక్రమంలో భాగంగావచ్చిన దరఖాస్తులను సత్వరంగా పరిష్కరించేందుకు సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఎం. మను చౌదరి అన్నారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయం లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి తమ సమస్యల జిల్లా అదనపు కలెక్టర్లు గరిమా అగ్రవాల్, శ్రీనివాస్ రెడ్డి లతో కలిసి జిల్లా కలెక్టర్ వినతులను స్వీకరించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు తమ సమస్యలు పరిష్కారం అవుతాయని నమ్మకంతో ప్రజావాణి కార్యక్రమానికి వచ్చేసి అందజేసిన ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించి అర్హతల మేరకు వెంటనే పరిష్కరించే దిశగా అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులకు సూచించారు. జిల్లాలో పరిష్కారం కోసం వచ్చేసిన ప్రజల నుండి మొత్తం 31 దరఖాస్తులు తీసుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ నాగ రాజమ్మ, డిఆర్డిఎ పిడి జయదేవ్ ఆర్యా మరియు ఇతర జిల్లా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Padi Kaushik Reddy Black Book sensation in Telangana | తెలంగాణలో బ్లాక్ బుక్ సంచలనం | Eeroju news