Power reservoir in Illendu | ఇల్లెందులో పవర్ రిజర్వాయర్ | Eeroju news

Power reservoir in Illendu

ఇల్లెందులో పవర్ రిజర్వాయర్

ఖమ్మం, జూలై 11  (న్యూస్ పల్స్)

Power reservoir in Illendu

తెలంగాణలో అతిపెద్ద ప్రభుత్వరంగ సంస్థ సింగరేణి. బొగ్గు ఉత్పత్తితోపాటు థర్మల్, సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తితో మహారత్న కంపెనీలకు దీటుగా లాభాలు గడిస్తోంది. తాజాగా వినూత్న ఆలోచనతో తెలంగాణలో పవర్‌ రిజర్వాయర్‌ నిర్మాణానికి సిద్ధమవుతోంది. సంస్థతోపాటు రాష్ట్ర విద్యుత్‌ అవసరాలు తీర్చడంలో భాగస్వామి కావాలని భావిస్తోంది.సాధారణంగా రిజర్వాయర్‌ అంటే.. మనకు ఆనకట్టలు, డ్యాంలు గుర్తొస్తాయి. కానీ, పవర్‌ రిజర్వాయర్‌ పేరుతో సింగరేణి కొత్తరకంగా విద్యుత్‌ ఉత్పత్తికి ప్రణాళిక రూపొందిస్తోంది. ఇందుకు బొగ్గు నిల్వలు పూర్తయిన గనిని ఉపయోగించుకోవాలని భావిస్తోంది. ఇందులో పీఎస్పీపీ(పంప్డ్‌ స్టోరేజీ పవర్‌ ప్లాంట్‌) నిర్మించబోతోంది.

దిగువన ఒక రిజర్వాయర్, పైన ఒక రిజర్వాయర్‌ నిర్మించి విద్యుత్‌ డిమాండ్‌ తక్కువగా(ఆఫ్‌ పీక్‌ అవర్స్‌) ఉన్నప్పుడు కింది రిజర్వాయర్‌ నుంచి నీటిని పైకి తోడిపోస్తారు. పవర్‌ డిమాండ్‌ (పీక్‌ అవర్స్‌) ఉన్నవేళల్లో ఆ రిజర్వాయర్‌ నుంచి కిందకు పంపిస్తూ జలవిద్యుత్తు ఉత్పత్తి చేస్తారు. ఇక నీటిని ఎత్తిపోయడానికి సౌర విద్యుత్‌ వినియోగించేలా సింగరేణి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ పద్ధతిలో విద్యుత్‌ ఉత్పత్తిని హైబ్రీడ్‌ పవర్‌ జనరేషన్‌ అని కూడా అంటారు. ప్రైవేటు రంగంలో ఇలాంటి ప్లాంట్లు వస్తున్నాయి. ప్రభుత్వ యాజమాన్యంలోని సింగరేణి ఆ దిశగా ఆలోచన చేయడం శుభ పరిణామం.ఈ హైబ్రిడ్‌ పవర్‌ జనరేషన్‌ సింగరేణికి చాలా ఈజీ. భూగర్భ గనులు అయినా, ఓపెన్‌కాస్ట్‌ గనులు అయినా కిలోమీటర్లకొద్దీ తవ్వుతారు.

ఓసీపీల్లో బొగ్గు నిల్వలు పూర్తయిన వాటిని హైబ్రిడ్‌ పవర్‌ జనరేషన్‌కు ఉపయోగించుకోవాలని సింగరేణి భావిస్తోంది. వాటిలో పంప్డ్‌ స్టోరేజీ పవర్‌ ప్లాంటు నిర్మాణాలు చేపట్టాలని ప్లాన్‌చేస్తోంది.సింగరేణి యాజమాన్యం ఆలోచన వెనుక రెండు లాభాలు ఉన్నాయి. ఒకటి సంస్థకు అవసరమైన విద్యుత్‌ను స్వయంగా ఉత్పత్తి చేసుకోవడం. తర్వాత కమర్షియల్‌గా సంస్థకు అదనపు లాభాలు చేకూర్చడం. ఇక థర్మల్‌ విద్యుత్‌ ఉత్పత్తితో పెరుగుతన్న కాలుష్యం నియంత్రించే ఆలోచన. ఇలా అన్నిరకాల ప్రయోజనాల కోసం సింగరేణి హైబ్రిడ్‌ విద్యుత్‌ ఉత్పత్తి వెనుక ఉన్నాయి.

సంప్రదాయేతర విద్యుత్‌ ఉత్పత్తి దిశలో అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అవి దేశంలో పెరగాల్సిన అవసరం ఉంది. ఈ మేరకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీంతో థర్మల్‌ ప్లాంట్లపై ఆధారపడే అవసరం ఉండదు. ఈ క్రమంలోనే తెలంగాణలో సింగరేణి వినూత్న ఆలోచన చేసింది.ప్రస్తుతం సింగరేణి సంస్థ ఇల్లెందులో 100 మెగావాట్ల పీఎస్పీపీతో పవర్‌ రిజర్వాయర్ నిర్మించాలని భావిస్తోంది. ఇందుకు రూ.6 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేస్తోంది. తద్వారా నిరుపయోగంగా ఉండిపోయే గని ప్రాంతాన్ని తిరిగి వినియోగంలోకి తీసుకురావచ్చు. అని సింగరేణి ఈ దిశగా అడుగులు వేస్తోంది.

 

Power reservoir in Illendu

 

Politics revolving around coal | బొగ్గు చుట్టూ తిరుగుతున్న రాజకీయం | Eeroju news

Related posts

Leave a Comment