ధరణి… ఇక భూమాత
హైదరాబాద్, ఆగస్టు 3, (న్యూస్ పల్స్)
Ponguleti Srinivasa Reddy
ధరణి పోర్టల్ పేరును భూమాతగా మారుస్తూ రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ధరణి పోర్టల్ సమస్యలపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అసెంబ్లీలో మాట్లాడారు. ధరణీతో రైతులు తీవ్రంగా నష్టపోయారని …ధరణీ చట్టం మూడు తలలతో మొదలై.. 33 తలలతో అవతరించిందన్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు భట్టి విక్రమార్క గారు ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు పాదయాత్ర చేసిన సమయంలో ఎక్కడికి వెళ్లినా ధరణీ సమస్యల గురించే ప్రజలు ఆయనకు వివరించారన్నారు. ధరణీని బంగాళఖాతంలో వేస్తామని రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో చెప్పారని గుర్తు చేసారు. ధరణి చట్టం ఇద్దరు వ్యక్తులు కూర్చుని చర్చించుకుని తెచ్చిన చట్టమని.. ధరణీతో సామాన్యులు అవస్థలు పడ్డారని పొంగులేటి తెలిపారు. ధరణీ వచ్చిన తరువాత ప్రతీ గ్రామంలో సమస్యలే ఉన్నాయన్నారు. అప్పటి సర్కార్ పెద్దలు ధరణీ పేరుతో ప్రజలకు దగా చేశారన్నది ముమ్మాటికి నిజమన్నారు. ధరణీ సమస్యలతో రైతులు రోడ్డున పడ్డారు. చెప్పులు అరిగేలా ఆఫీసుల చుట్టూ తిరిగినా సమస్యలు పరిష్కారం కాలేదని గుర్తు చేసారు. సాదా బైనామాలకు నోటిఫికేషన్ ఇచ్చి ధరణీలో ఆ కాలమే పెట్టలేదని మండిపడ్డారు. 18 లక్షల ఎకరాల భూమిని పక్కకు పెట్టారని అలా ఎందుకు చేయాల్సి వచ్చిందని ఆయన ప్రశ్నించారు. 2014 లో కేసీఆర్ ధరణి తెచ్చారు అప్పట్నుంచి కొండ నాలుక కి మందు వేస్తే…ఉన్న నాలిక పోయినట్టు ఉంద్నారు. భూసంస్కరణలకు నాటి ప్రధాని ఇందిరాగాంధీ శ్రీకారం చుట్టారని భూ సంస్కరణలతో అనేక విషయాలు అనుసంధానమై ఉన్నాయన్నారు. ప్రధానిగా ఉన్నప్పుడు పీవీ కూడా భూ సంస్కరణలు చేపట్టారని గుర్తు చేశారు. ధరణి నీ ఐఎల్ ఎఫ్ కంపెనీకి అప్పగించారంచారని.. అది దివాలా తీసిన కంపెనీ అన్నారు. ఆ కంపెనీ సింగపూర్ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకున్నారని.. సింగపూర్ కంపెనీ కి తెలంగాణ భూములు తాకట్టు పెట్టారని పొంగులేటి ఆరోపించారు. ధరణి తో గుంట భూమి కూడా అమ్ముకోలేని పరిస్థితి వచ్చిందని ఆరోపించారు. ధరణి పోర్టల్ రద్దు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీ. అధికారంలో రాగానే ధరణి సమస్యలపై అధ్యయనం కోసం కమిటీనీ ఏర్పాటు చేసింది. ఆ కమిటీ ఇటీవల కొన్ని సిఫారసులు చేసినట్లుగా తెలుస్తోంది. ఆ సిఫారసుల మేరకు.. ధరణి పోర్టల్ భూమాతగా మార్చి.. సమస్యలన్నింటినీ పరిష్కరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
8,274 thousand acres for financial purposes | ఆర్ధిక అవసరాల కోసం 8,274 వేల ఎకరాలు | Eeroju news