వేగం పెరిగిన పోలవరం
ఏలూరు, నవంబర్ 28, (న్యూస్ పల్స్)
Polavaram
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో వేగం పెంచిన రాష్ట్ర ప్రభుత్వం ఈసారి ఎట్టిపరిస్థితుల్లోనూ ఈ ఐదేళ్ల పాలనా కాలంలోనే ప్రాజెక్టును పూర్తి చేయాలని గట్టి పట్టుదలగా ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రాజెక్టుకు సంబంధించిన కీలక పనులను పట్టాలమీదకు ఎక్కిస్తోంది. ఇప్పటికే ప్రాజెక్టు సైట్ లో అనేక పనులు పరుగులు పెడుతుండగా.. ఇప్పుడు డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి ముందు చేపట్టాల్సిన ముఖ్యమైన నిర్మాణాల్ని చేపట్టింది.
అందులో భాగంగా.. డయాఫ్రమ్ వాల్ ప్లాట్ ఫారమ్ పనులకు శ్రీకారం చూట్టింది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన సమయం నుంచి పోలవరం చుట్టూ ఏపీ రాజకీయం తిరుగుతుంది. ఆ రాష్ట్రాలోని వేల ఎకరాలకు సాగు అందించడంతో పాటు పుష్కలంగా త్రాగు అందించే పొలవరాన్ని మేము పూర్తి చేస్తామంటే మేము పూర్తి చేస్తామంటూ హామిలు ఇచ్చారు.
ఇప్పటి వరకు రెండు ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో పరిపాలన పూర్తి చేసుకుని.. ఇప్పుడు మూడో ప్రభుత్వం ఏర్పడినా ప్రాజెక్టు మాత్రం అనుకున్న మేర పురోగతిలో లేదు. అందుకే.. ఈ సారి తన పాలనలోనే ఎలాగైనా పొలవరాన్ని పూర్తి చేయాలని గట్టి సంకల్పంతో ఉన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.వర్షాకాలంలో పెద్ద ఎత్తున నీటి ప్రవాహం ఉండే పొలవరంలో నిర్మాణాలకు అనేక పద్దతుల్ని వినియోగిస్తున్నారు. వాటిలో డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చాలా ముఖ్యమైంది అంటూ చాలా సార్లు అధికారులు, ముఖ్యమంత్రులు ప్రకటనలు చేశారు. కానీ.. ఇంతవరకు దాని నిర్మాణాన్ని మాత్రం పూర్తి చేయలేదు. ఒక్కొక్కరు ఒక్కో కారణం చూపుతూ డయాఫ్రమ్ వాల్ నిర్మాణాన్ని పూర్తి చేయలేకపోయారు.
ముఖ్యంగా జగన్ హయంలో డయాఫ్రమ్ వాల్ రక్షణకు, మిగతా పనుల పూర్తికి చర్యలు చేపట్టలేదంటూ చంద్రబాబు ఇప్పటికే అనేక సార్లు విమర్శించారు. ఈ కారణంగానే.. చంద్రబాబు నిర్మించిన వాల్ చాలా వరకు దెబ్బతిన్నది అని ఇటీవల వెల్లడించారు.అప్పట్లో రూ.400 కోట్లతో పూర్తయిన డయాఫమ్ వాల్ నిర్మాణం చాలా వరకు దెబ్బతినడంతో ఇప్పుడు మళ్లీ తిరిగి నిర్మించాల్సి వస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఇందుకోసం ఏకంగా రూ.900 కోట్లకు పైగానే ఖర్చు చేయాల్ని వస్తుందని తెలిపారు. కాగా.. ఈ నిర్మాణానికి సంబంధించిన కీలక ముందస్తు పనులు ప్రారంభించారు.
ప్రభుత్వం ప్రాథామ్యాల మేరకు.. ఈ పరిపాలనా కాలంలోనే పోలవరాన్ని పూర్తి చేయాలని సంకల్పించడంతో.. కీలకమైన డయాఫ్రమ్ వాల్ ప్లాట్ ఫారమ్ పనులు చేపట్టారు. వచ్చే ఏడాది మొదటి నెలలో డయాఫ్రమ్ వాల్ నిర్మాణం తిరిగి చేపట్టనున్నారు. అందుకే.. ముందస్తు సపోర్టింగ్ నిర్మాణాలు వేగంగా చేపడుతున్నారు.ఎగువ, దిగువ కాఫర్ డ్యాంలకు మధ్య పాత డయాఫ్రమ్ వాల్ నిర్మిస్తుండగా.. వాటికి సమీపంలో ఈ ప్లాట్ ఫారమ్ ను కడుతున్నారు. డయాఫ్రం వాల్ వెడల్పు 1.5 మీటర్లు మందంగా ఉంటుందని అధికారులు తెలిపారు. కాగా.. ఈ నిర్మాణాన్ని ప్లాస్టిక్ కాంక్రీట్ అనే ప్రత్యేకమైన మిశ్రమంతో చేపట్టినట్లు అధికారులు వెల్లడిస్తున్నారు.
Polavaram | పోలవరం పూర్తయితే మారనున్న రూపురేఖలు | Eeroju news