Pithapuram:మురికి కాలువతో నరకయాతన:పిఠాపురం పట్టణంలోని కత్తులగూడెం ప్రాంతంలో ఉన్న ఒకప్పటి పంటకాలువ, కొన్నేళ్ళుగా మురికికాలువై పోయిన గుర్రాలకాలువలో చెత్తాచెదారంతో పేరుకుపోయి ఆ ప్రాంత ప్రజలను విషజ్వరాలతో ఆసుపత్రుల బారిన పడేస్తూ నరకయాతన కలిగిస్తోంది.
మురికి కాలువతో నరకయాతన
పిఠాపురం
పిఠాపురం పట్టణంలోని కత్తులగూడెం ప్రాంతంలో ఉన్న ఒకప్పటి పంటకాలువ, కొన్నేళ్ళుగా మురికికాలువై పోయిన గుర్రాలకాలువలో చెత్తాచెదారంతో పేరుకుపోయి ఆ ప్రాంత ప్రజలను విషజ్వరాలతో ఆసుపత్రుల బారిన పడేస్తూ నరకయాతన కలిగిస్తోంది. కత్తులగూడెం ఎగువన మూడు వార్డులనుంచి మురికికాలువలన్నీ ఇక్కడి గుర్రాలకాలువలోకి కలుస్తూండడంతో చెత్తాచెదారం పేరుకుపోయి మురుగునీరు ఆ పేటలోకి వచ్చి పడుతూండడం,నిల్వ ఉండిపోవడంతో విపరీతమైన దోమలు,దుర్గంధాలతో ఆ ప్రాంతవాసులు,ముఖ్యంగా చంటిపిల్లలు,వృద్ధులు తరచూ రోగాలు,వ్యాధులు బారిన పడుతూ ఆస్పత్రులపాలవుతూన్నారు.ఆ ప్రాంత ప్రజలు పడుతున్న నరకయాతనను పిఠాపురం మున్సిపల్ అధికారుల దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్ళినా కనీసం ఇక్కడికి వచ్చి సమస్యను చూసిపోయింది కూడా లేదని ఆ వార్డు కౌన్సిలర్ చెల్లూరి లోవరాజు ఆవేదన చెందారు.
అయితే.,ఈ సమస్యపై బర్నింగ్ టూల్ మినిస్ట్రీస్ స్పందించింది.కత్తులగూడెం ప్రాంత ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని స్వచ్ఛందంగా ఆ మురికికాలువలో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని ప్రొక్లైనరుతో తీయించే కార్యక్రమాన్ని మినిస్ట్రీస్ చర్చ్ పాస్టర్ కే.ఎలీషా,వార్డు కౌన్సిలర్ చెల్లూరి లోవరాజు,ఆ ప్రాంత పెద్దలు,యువకుల పర్యవేక్షణలో చేపట్టారు.ఈ సందర్భంగా పాస్టర్ కే.ఎలీషా,కౌన్సిలర్ చెల్లూరి లోవరాజు మీడియాతో మాట్లాడుతూ.,ఈ మురికికాలువకు ఇక్కడ్నుంచి అవుట్ లెట్ లేకపోవడం వలనే మొత్తం నాలుగు వార్డుల మురికినీరంతా చెత్తాచెదారంతో ఇక్కడే నిల్వ ఉండిపోతోందని,ఈ కాలువకు అవుట్ లెట్ ఏర్పాటుచేసి శాశ్వత పరిష్కారం చూపాలని స్థానిక ఎమ్మెల్యే,డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కల్యాణ్ను వారు వేడుకుంటున్నారు.కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది విజయ్ తదితరులు పాల్గొన్నారు..
Read more:Mumbai:న్యూజిలాండ్ వర్సెస్ ఇండియా.. టోర్నీ ఫైనల్ ఖరారు