Perni nani:అడ్డంగా బుక్కైన పేర్ని నాని

perni nani

మాజీ మంత్రి పేర్ని నాని చుట్టూ ఉచ్చు బిగిస్తోంది. రేషన్ బియ్యం పక్కదారిపై పోలీసులకు కీలక ఆధారాలు లభించినట్లు సమాచారం. మచిలీపట్నంలోపౌరసరఫరాల శాఖకు సంబంధించి గోదాములు దాదాపు 7వేల బస్తాల బియ్యం మాయమైన సంగతి తెలిసిందే. ఆ గోదాములు పేర్ని నాని భార్య జయసుధ పేరిట ఉన్నాయి. ఈ నేపథ్యంలో పౌరసరఫరాల శాఖ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

అడ్డంగా బుక్కైన పేర్ని నాని

విజయవాడ, జనవరి 10
మాజీ మంత్రి పేర్ని నాని చుట్టూ ఉచ్చు బిగిస్తోంది. రేషన్ బియ్యం పక్కదారిపై పోలీసులకు కీలక ఆధారాలు లభించినట్లు సమాచారం. మచిలీపట్నంలోపౌరసరఫరాల శాఖకు సంబంధించి గోదాములు దాదాపు 7వేల బస్తాల బియ్యం మాయమైన సంగతి తెలిసిందే. ఆ గోదాములు పేర్ని నాని భార్య జయసుధ పేరిట ఉన్నాయి. ఈ నేపథ్యంలో పౌరసరఫరాల శాఖ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పేర్ని నాని భార్యతో పాటు గోదాము మేనేజర్ మానస్ తేజ కు సైతం నోటీసులు జారీ చేశారు. అటు పేర్ని నాని భార్య పోలీస్ విచారణకు సైతం హాజరయ్యారు. ఇంకోవైపు నానికి సైతం పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ తరుణంలో ఈ కేసులో కీలక ఆధారాలు పోలీసులకు పట్టుబడినట్లు సమాచారం. మార్చిలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అధికారులు ఎన్నికల విధుల్లో ఉండగా.. బియ్యం పక్కదారి పట్టించినట్లు అనుమానిస్తున్నారు. ఇందుకోసం మినీ వ్యానులను వాడినట్లు తెలుస్తోంది.పేర్ని నాని భార్య జయసుధ పేరిట ఇక్కడ గోదాములు ఉన్నాయి. వైసిపి హయాంలో పౌరసరఫరాల శాఖకు ఈ గోదాములను అద్దెకు ఇచ్చారు. రేషన్ బియ్యం ఈ గోదాముల్లో నిల్వ చేస్తుంటారు. వీటికి మేనేజర్ గా మానస తేజ్ ఉన్నారు. ఆయన నెలవారి జీతం 12 వేల రూపాయలు. అయితే ఒకేసారి మానస తేజ అకౌంట్ నుంచి పేరుని నాని ఎకౌంటుకు లక్ష 75 వేల రూపాయలు బదిలీ చేయడంపై అనుమానాలు ఉన్నాయి.

తన యజమాని భర్తకు అంత మొత్తంలో మేనేజర్ పంపడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మానస తేజ అకౌంట్లో సుమారు 25 లక్షల మేర లావాదేవీలు జరిగినట్లు కూడా గుర్తించారు. అందులో ఆయన వ్యక్తిగత అవసరాల కోసం ఏడు లక్షల రూపాయలు ఖర్చు చేసినట్లు కూడా పోలీస్ విచారణలో తేలినట్లు తెలుస్తోంది. తక్కువ జీతానికి పనిచేస్తున్న మానస తేజకు అంత మొత్తంలో డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని పోలీసులు విచారణ చేపడుతున్నారు. పోలీసులకు కీలక ఆధారాలు లభించడంతో.. కోర్టు అనుమతితో ఒకరోజు కస్టడీలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఈ బ్యాంకులో నగదు లావాదేవీల విషయంపై ప్రశ్నించినట్లు సమాచారం. మేనేజర్ మానస తేజ తో పాటు డ్రైవర్ మంగారావు, మిల్లర్ ఆంజనేయులను పోలీసులు విచారించారు. అయితే మేనేజర్ పోలీస్ విచారణకు సహకరించలేదని తెలుస్తోంది. దీంతో నిందితులను మరో ఐదు రోజులు కష్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. మంత్రిగా ఉంటూ పేర్ని నాని అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు ఆయన చుట్టూ ఈ కేసు తిరుగుతోంది. అయితే నిందితులు పేర్ని నాని పేరు ఎక్కడ బయట పెట్టడం లేదు. రేషన్ బియ్యం తరలించడంలో మాజీమంత్రి నానికి సంబంధం లేదని.. తామే విక్రయించామని వారు పోలీసులకు చెబుతున్నారు. ఇంతటి భారీ మొత్తంలో బియ్యం తరలించడం అక్కడ పనిచేసే వారితో సాధ్యం కాదని.. కచ్చితంగా నాని హస్తం ఉందని అనుమానిస్తున్నారు. అందుకే ఆయన చుట్టూ ఉచ్చు బిగిస్తున్నారు. మొత్తానికైతే ఈ రేషన్ బియ్యం పంపిణీ వ్యవహారంలో మాజీ మంత్రి పేర్ని నానిని అరెస్టు చేసేందుకు సిద్ధపడుతున్నట్లు సమాచారం. మరి అందులో ఎంత వాస్తవం ఉందో తెలియాలి.

Read;Kakinada:పార్టీలో నేతలు చెరో దారి

Related posts

Leave a Comment