Pension for house to house | ఇంటింటికి పెన్షన్ | Eeroju news

Pension for house to house

ఇంటింటికి పెన్షన్

కదిలిన అధికారగణం, ప్రజా ప్రతినిధులు

విజయవాడ

Pension for house to house

సోమవారం నాడు  రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 65.18 లక్షల మందికి 1.27 లక్షల గ్రామ/ వార్డు సచివాలయం ఉద్యోగులు  ఇంటింటికీ వెళ్ళి మొదటి సారిగా పెన్షన్ పంపిణీ చేసారు.  మొదటి రోజే 95% పంపిణీ చేయాలని, ఇందులో ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం ఉండకూడదని సీఎస్ ఆదేశంఇచ్చిన సంగతి తెలిసిందే.  పింఛన్ల పంపిణీకి రూ. 4,399.89 కోట్లు విడుదల చేసారు.  ఏ సిబ్బంది కూడా సచివాలయం దగ్గర ఇవ్వకూడదు/ పిలువకూడదు.., లబ్ధిదారుల ఇంటికే నేరుగా వెళ్లి ఇవ్వాలి. ఇందులో వాలంటీర్లు ప్రమేయం ఉండకూడదు.  లబ్ధిదారునికి పింఛను డబ్బులతో పాటు, రశీదు, సీఎం చంద్రబాబురు రాసిన లేఖ ప్రతులను కూడ అందజేయాలని ఆదేశించారు.

పింఛన్ల పంపిణీపై ప్రతి రెండు సచివాలయాలకు ఒక ప్రత్యేక అధికారిని ప్రభుత్వ నియమించింది.  వృద్ధాప్య, వితంతు, ఒంటరి మహిళలు, ట్రాన్స్ జెండర్లు, గీత కార్మికులు, మత్స్యకారులకు రూ.4వేలు,  దివ్యాంగుల పింఛన్ రూ.6 వేలకు పెంచారు. . పూర్తిస్థాయిలో వైకల్యానికి గురైన వారికి నెలకు రూ.15 వేలు పింఛన్ ఇస్తారు. . కిడ్నీ తలసీమియా వంటి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు నెలకు రూ.10 వేలు పింఛన్ ఇస్తారు.

 

Pension for house to house

 

AP CM Chandrababu’s open letter to pensioners | పింఛన్ దారులకు ఏపీ సీఎం చంద్రబాబు బహిరంగ లేఖ | Eeroju news

Related posts

Leave a Comment