Pawan Kalyan | పవన్ ప్రచారంతో బీజేపీకి పెరిగిన ఓటు షేర్ | Eeroju news

పవన్ ప్రచారంతో బీజేపీకి పెరిగిన ఓటు షేర్

పవన్ ప్రచారంతో బీజేపీకి పెరిగిన ఓటు షేర్

విజయవాడ, నవంబర్ 25, (న్యూస్ పల్స్)

Pawan Kalyan

మహారాష్ట్రలో పవన్ కల్యాణ్ ప్రచారం చేసిన చోట్ల విజయం ఎవరిదంటే.. | Times Now Teluguమహారాష్ట్ర ఎన్నికల్లో మహా యూటీ కూటమి ఘనవిజయం సాధించింది. బిజెపి నేతృత్వంలోని ఆ కూటమి 230 సీట్లు సాధించి రికార్డు విజయాన్ని సొంతం చేసుకుంది. బిజెపి సొంతంగా 132 సీట్లు గెలుచుకోగా..శివసేన 57 స్థానాలు..ఎన్సీపీ 41 సీట్లు సాధించింది. కాంగ్రెస్ నేతృత్వంలోని మహా వికాస్ అఘాడి ఘోర పరాజయం చవిచూసింది. ఉద్ధవ్ ఠాక్రే శివసేన 20 చోట్ల, కాంగ్రెస్ 16 చోట్ల, శరద్ పవర్ నేతృత్వంలోని ఎన్సిపి పది చోట్ల విజయం సాధించాయి. అయితే ఈ ఎన్నికల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన కేకే సర్వే అంచనాలు నిజమయ్యాయి. ఆ సంస్థ వెల్లడించిన ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ గా నిలిచాయి. ఈ సంస్థ అధినేత కిరణ్ కొండేటి ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

మహారాష్ట్ర ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ ప్రచారం ప్రభావం పై మాట్లాడరు కూడా.మహారాష్ట్ర ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ప్రచారం చేశారు. ఐదు చోట్ల ప్రచార ర్యాలీలో, బహిరంగ సభల్లో మాట్లాడారు. జగన్ ని గట్టిగా టార్గెట్.... పవన్ మాస్టర్ ప్లాన్ వెనక ? | Pawan Kalyan Strong Counter In Jagan Mohan Reddyబల్లార్ పూర్, చంద్రపూర్, పూణే కంటోన్మెంట్, హార్డ్ సర్ పూర్, కస్బపేట్, డెగ్లూర్, లాతూర్,సోలాపూర్నియోజకవర్గాల్లో ఆయన ప్రచారం చేశారు. పవన్ ప్రచారం చేసిన ప్రాంతాల్లో బిజెపి కూటమి ఘన విజయం సాధించింది. మహారాష్ట్ర ఎన్నికల్లో పవన్ ప్రభావం స్పష్టంగా కనిపించిందని కేకే సర్వే అధినేత కిరణ్ కొండేటి చెప్పారు.

మహారాష్ట్రలో నివసిస్తున్న తెలుగు ప్రజలు పవన్ పిలుపునకు స్పందించారని.. బిజెపి కూటమిని ఆదరించాలని చెప్పుకొచ్చారు. పవన్ ప్రచారంతో బిజెపికి ఒకటి రెండు శాతం ఓటింగ్ పెరిగి ఉండొచ్చని కూడా అంచనా వేశారు. బిజెపికి ఇన్నాళ్లకు బలమైన ప్రజా ఆకర్షణకు ఉన్న పవన్ కళ్యాణ్ దొరికాడని తెలిపారు. బిజెపి మిత్రుడిగా పవన్ మరింత ఎదిగే అవకాశం ఉందని కూడా అంచనా వేశారు. ఏపీలో కూడా కేకే సర్వే అంచనాలకు అనుగుణంగా ఎన్నికల ఫలితాలు వచ్చాయి.

ఏపీవ్యాప్తంగా 175 స్థానాలకు గాను టిడిపి కూటమికి 161, వైసీపీ 14 చోట్ల విజయం సాధిస్తుందని సర్వే పేర్కొంది. దానికి దగ్గరగానే ఈ ఫలితాలు వచ్చాయి. ఇప్పుడు మహారాష్ట్ర ఎన్నికల్లో సైతం బిజెపి కూటమి 225 సీట్లలో విజయం సాధిస్తుందని కేకే సర్వే తెలిపింది. కానీ ఆ కూటమికి 230 స్థానాలు వచ్చాయి. కేకే సర్వే వెల్లడించిన మాదిరిగానే సీట్లు రావడంతో ఆ సంస్థ పేరు జాతీయస్థాయిలో మార్మోగిపోతోంది.

పవన్ ప్రచారంతో బీజేపీకి పెరిగిన ఓటు షేర్

Pawan Kalyan Says Jai Telangana | మరాఠా గడ్డపై పవన్ కల్యాణ్ నోట ‘జై తెలంగాణ’ | FBTV NEWS

Related posts

Leave a Comment