Pawan Kalyan పవన్ టార్గెట్ కాకినాడ…రీజనేంటీ

Pawan Kalyan

Pawan Kalyan పవన్ టార్గెట్ కాకినాడ…రీజనేంటీ

 

Pawan Kalyan

విజయవాడ, డిసెంబర్ 2, (న్యూస్ పల్స్)
ప్రస్తుతం ఏపీలో కాకినాడ పోర్టు ఇష్యూ హాట్ టాపిక్‌గా మారింది. పవన్ కాకినాడ పర్యటన తర్వాత.. పోర్టు వ్యవహారంపై సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కాకినాడ పోర్టు నుంచి వేల కోట్ల రూపాయల దందా జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి. పవన్ పోర్టుపై ఎందుకు ఫోకస్ పెట్టాలో మంత్రి నాదెండ్ల వివరించారు.ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కాకినాడ పర్యటనతో స్మగ్లింగ్ గుట్టు బయటపడిందని.. ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యానించారు. దేశ భద్రతకు ముప్పు కలిగేలా స్మగ్లింగ్ కొనసాగుతోందన్నారు. గత ఐదేళ్లుగా అక్రమంగా బియ్యం రవాణా చేశారన్న మనోహర్, కూటమి ప్రభుత్వం వచ్చాక అక్రమ నిల్వలపై దాడులు చేశామని వివరించారు. కాకినాడ పోర్టులోకి ఎవరూ రాకుండా కుట్ర చేశారని.. గత ఐదేళ్లలో అక్కడ ఏం జరిగిందో ఎవరికీ తెలియదని వ్యాఖ్యానించారు.’గత ప్రభుత్వం బియ్యం డోర్ డెలివరీ అంటూ.. కొత్త పథకం మొదలుపెట్టింది. బియ్యం అక్రమ రవాణాకు తెరలేపారు. కాకినాడ పోర్టునుంచి కోటి 30లక్షల మెట్రిక్ టన్నుల..బియ్యాన్ని అక్రమంగా ఎగుమతి చేశారు. ఈ బియ్యం విలువ రూ.45 వేల కోట్లు ఉంటుంది. మాజీ సీఎం జగన్‌కు తెలియకుండా ఇది జరగదు’ అని నాదెండ్ల మనోహర్ ఆరోపించారు.

1.ఎందుకు కాకినాడ పోర్ట్ పైన దృష్టి సారించాం అనేది అందరూ తెలుసుకోవాలి. గత 5 సంవత్సరాల్లో ఎవ్వరినీ పోర్టు లోపలికి అనుమతించలేదు. లోపల ఎటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఎటువంటి బోట్లు వస్తున్నాయి, అధికారులు ఎవరున్నారు, ఏ విధమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి అని తెలుసుకోడానికి మీడియా వారిని కూడా అనుమతించలేదు.

2.ప్రభుత్వ ఆస్తి, మన రాష్ట్ర వనరుల్లో భాగం అయిన కాకినాడ పోర్టుకు ఎవరినీ రానీయకుండా గత ఐదేళ్లు పెద్ద కుట్ర చేశారు.

3.రాష్ట్రంలో బియ్యం సరఫరా చెయ్యడానికి 29,000 రేషన్ షాపులు ఉన్నాయి. కానీ.. వైసీపీ ప్రభుత్వం డోర్ డెలివరీ చేస్తామనే అబద్ధపు ప్రచారంతో రాష్ట్ర ఖజానాకు 1600 కోట్ల రూపాయల ఖర్చుతో 9260 వాన్లు కొని ఒక నెట్‌వర్క్ తయారు చేశారు.

4.రేషన్ దుకాణాల ద్వారా ప్రతి నెలా 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఉదయం నుంచి సాయంత్రం వరకు.. వినియోగదారులు ఎప్పుడు వచ్చినా సరుకు అందించే ఒక మంచి ప్రక్రియ ఉంది. దాన్ని పక్కదారి పట్టించి స్వలాభం కోసం ఈ నెట్‌వర్క్ ఏర్పాటు చేసుకుని బియ్యం సేకరించడం మొదలు పెట్టారు.

5.ప్రభుత్వానికి ప్రతి కిలోకి 43.40 రూపాయలు ఖర్చయ్యే ఈ బియ్యాన్ని వీళ్లు క్షేత్రస్థాయిలో 10 రూపాయలకే తీసుకున్నారు. చాలా చోట్ల సరైన సమయానికి రాలేదు కాబట్టి వ్యాను వెళ్ళిపోయిందని.. అందుకే సరుకు ఇవ్వము అని చెప్పేవారు.

6.మెడ మీద కత్తి పెట్టి ఎప్పుడైతే కాకినాడ సీ పోర్ట్స్ లిమిటెడ్ నుండి లాగేసుకుని.. వీళ్లు అరబిందోకి అప్పజెప్పారో.. ఆరోజు నుండి లెక్కలు చూస్తే ప్రతీ ఒక్కరికీ ఆశ్చర్యం కలిగుతుంది.

7.ఒక గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసుకుని చిత్తూరు, శ్రీకాకుళం నుంచి నేషనల్ హైవే మీద నేరుగా కాకినాడకు బియ్యం తరలించే పకడ్బందీ కుట్ర చేశారు. ఆంధ్ర ప్రదేశ్‌లో ఏ పోర్టులో లేని విధంగా కాకినాడ పోర్టులో బియ్యం ఎగుమతి జరిగింది.

8.గత మూడు ఆర్థిక సంవత్సరాల్లో.. గంగవరం పోర్టు నుండి – 2,20,289 మెట్రిక్ టన్నులు, కృష్ణపట్నం పోర్టు నుండి – 23,51,218 మెట్రిక్ టన్నులు, విశాఖపట్నం పోర్టు నుండి – 38,02,000 మెట్రిక్ టన్నుల ఎగుమతి జరిగింది.

9.కాకినాడ లెక్కలు చెప్తే ఆశ్చర్యం వేస్తుంది. కాకినాడ పోర్టులో వీళ్లు దుర్మార్గంగా ఈ మూడు సంవత్సరాల నుండి ఎగుమతి చేసింది 1,31,18,346 మెట్రిక్ టన్నులు. ఒక్క కాకినాడలో జరిగిన దీని విలువ 48,537 కోట్ల రూపాయలు.

10.ప్రజలకు సంబంధించిన ఆస్తిని పూర్తి స్థాయిలో కుట్ర చేసి దోచుకు తింటుంటే.. ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కాకినాడకు రావాల్సి వచ్చింది.

11.ఇదేమి ఒక వ్యక్తిపై కక్ష కట్టినట్టు కాదు. గత పాలనలో ముఖ్యమంత్రి జగన్‌కు తెలియకుండా జరగదు కదా ఈ దోపిడీ? అరబిందో రియాల్టీకి కాకినాడ సీపోర్ట్స్ ఎందుకు 41% వాటా ట్రాన్స్‌ఫర్ చేసింది? ఏ సందర్భంలో చేసింది? భారతదేశంలో కార్పొరేట్ చరిత్రలో ఏనాడు జరగని విధంగా కేవీ రావు, వారి కుటుంబాన్ని బెదిరించి ఏ విధంగా వీళ్లు 41 శాతం వాటా రాయించుకున్నారో కచ్చితంగా బయటకు రావాలి.

డాన్ ఎవరు…
కాకినాడ పోర్టును స్మగ్లింగ్ డెన్ గా గత వైసీపీ ప్రభుత్వం మార్చిందని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. గత మూడేళ్లలో కోటి 60 లక్షల కోట్ల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని కాకినాడ పోర్టు నుంచి ఎగుమతి చేశారన్నారు. కోవిడ్ సమయంలోనూ కేంద్ర ప్రభుత్వం ఉచితంగా ప్రజలకు పంపిణీ చేయమని ఇచ్చిన బియ్యాన్ని ఇతర దేశాలకు ఎగుమతి చేస్తూ అక్రమార్జనకు పాల్పడ్డారన్నారు. గత ఐదేళ్లలో కాకినాడ పోర్టును బియ్యం ఎగుమతులకు కేరాఫ్ అడ్రస్ గా మార్చేశారన్నారు. కాకినాడ పోర్టులో గత ప్రభుత్వ హయాంలో కేవలం ఇరవై మంది పోలీసులను మాత్రమే పెట్టారన్నారు.పవన్ కల్యాణ్ కాకినాడ పోర్టు పర్యటనతో స్మగ్లింగ్ ముఠా గుట్టురట్టయిందని నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఎందుకు జీఎంఆర్ నుంచిఎస్ఈఆర్ ను లాగేసుకోవాల్సి వచ్చిందని నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు. ఆ స్మగ్లింగ్ డెన్ కు బాస్ ఎవరని నాదెండ్ల నిలదీశారు. కాకినాడ పోర్టుపై తాము ఎందుకు దృష్టి పెట్టామోప్రజలకు తెలియాలని నాదెండ్ల అన్నారు. పేదలకు పంపిణీ చేయాల్సిన బియ్యాన్ని పక్కదారి పట్టించెదవరో అందరికీ తెలియాలన్నారు. కాకినాడ పోర్టును అడ్డాగా చేసుకుని స్మగ్లింగ్ చేసే వారందరిపేర్లను బయటకు తీసుకువస్తామని నాదెండ్ల తెలిపారు.

 

Pawan Kalyan | కాకినాడ పోర్టు లో పవన్ తనిఖీలు | Eeroju news

Related posts

Leave a Comment