కేంద్ర మంత్రిగా పవన్…
తిరుపతి, డిసెంబర్ 14, (న్యూస్ పల్స్)
ఏపీ రాజకీయాల్లో ఊహించని మార్పులు జరగబోతున్నా యా? సీఎం చంద్రబాబు-డిప్యూటీ సీఎం పవన్ ఆలోచనకు మోదీ సర్కార్ ఓకే చెప్పిందా? జమిలి ఎన్నికల నేపథ్యంలో ఈ ప్లాన్ చేశారా? కేంద్రం నుంచి ఏపీకి పెద్ద మొత్తంలో నిధులు రావడం ఖాయమా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.దేశంలో జమిలి ఎన్నికలు వేడి కొనసాగుతోంది. దీనికి సంబంధించి రేపో మాపో మోదీ సర్కార్ పార్లమెంట్లో బిల్లు పెట్టబోతోంది. ఆ తర్వాత జేపీసీకి ఇవ్వాలని నిర్ణయించు కుంది. ఆ తర్వాత ఈ బిల్లుకు ఆరేడు సవరణలూ జరగనున్నాయి. కాకపోతే మోదీ సర్కార్‌ను ఒకటే వెంటాడుతోంది.ఈసారి సౌత్‌లో ఎక్కువ సీట్లు సాధించాలనే కమలనాథులు లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. అందుకు అనుగుణంగా పావులు కదుపుతోంది. రీసెంట్ జరిగిన మహారాష్ట్ర ఎన్నికల్లో జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ ఛరిష్మా కలిసొచ్చింది. దీంతో మూడింట రెండొంతుల మెజార్టీ బీజేపీ కూటమి దక్కించుకుని ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకుంది.పవన్ ఛరిష్మాను గుర్తించిన బీజేపీ పెద్దలు పవన్ కల్యాణ్ తమ పార్టీ స్టార్ క్యాంపెయినర్ గా వినియోగించుకోవాలని భావిస్తోంది. అందుకు పవన్ అంగీకరిస్తారా? అన్నది అసలు పాయింట్. నార్త్‌లో బీజేపీ బలంగా ఉన్నా, సౌత్‌లో మాత్రం బలహీనంగా కనిపిస్తోంది. సీట్లు పెరిగిన సందర్భం కనిపించలేదు.
తమిళనాడు, కేరళ, కర్ణాటక ఇలా ఏ రాష్ట్రం చూసినా బీజేపీకి పెద్ద లోటు కనిపిస్తోంది. దాన్ని భర్తీ చేసేందుకు బీజేపీ హైకమాండ్ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. పవన్ కల్యాణ్ కేంద్ర కేబినెట్లోకి తీసుకుంటే, దక్షిణాదికి సరైన స్టార్ క్యాంపెయినర్ లభించినట్లు అవుతుందన్నది కమలనాథుల ఆలోచనగా చెబుతున్నారు. దీనికితోడు జమిలి ఎన్నికలు 2028లో జరగడం ఖాయమనే ప్రచారం లేకపోలేదు.ఇక ఏపీ విషయానికొద్దాం.. రీసెంట్గా నాగబాబును మంత్రివర్గంంలోకి తీసుకున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటన చేయడంతో తెలుగు తమ్ముళ్లు కాసింత అసహనం వ్యక్తం చేశారట. తక్కువ సీట్లు గెలిచిన వారికి ఒకే కుటుంబంలో రెండు మంత్రి పదవులు ఎలా ఇస్తారంటూ నేతల మాటల చర్చ సీఎం చంద్రబాబు చెవిలో పడింది.రీసెంట్గా సీఎం చంద్రబాబు-డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమావేశమయ్యారు. ఈ క్రమంలో నాగబాబుకు మంత్రి పదవి ఇస్తే.. సీనియర్ల నుంచి ఏమైనా ఒత్తిడి రావచ్చనే చర్చ జరిగిందట. ఈ క్రమంలో నాగబాబు కేబినెట్లో చోటు కల్పించి, మోదీ కేబినెట్లోకి పవన్ వెళ్తే ఎలా వుంటుందనే చర్చ జరిగిందట.ఈ నేపథ్యంలో ఏపీ నుంచి ఓ వర్తమానం ఢిల్లీకి వెళ్లడం, అక్కడి బీజేపీ పెద్దలు అందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిపోయిందని పొలిటికల్ సమాచారం. మంత్రిగా ఉంటూనే నాగబాబు రాష్ట్ర వ్యవహారాలను చక్కబెట్టడానికి వీలవుతుందని అంటున్నారు.పవన్ కేంద్రమంత్రిగా ఉంటూ బీజేపీ పెద్దలతో నిత్యం టచ్‌లో ఉండటానికి ఇదొక మార్గంగా బాబు-పవన్ ద్వయం ఆలోచన. ప్రస్తుతం ఏపీ నుంచి ఇద్దరు కేంద్రమంత్రులున్నారు. అందులో ఒకరు రామ్మోహన్నాయడు కాగా, మరొకరు పెమ్మసాని ఉన్నారు. దీనికి పవన్ కూడా తోడైతే రాష్ట్రానికి కావల్సిన నిధులు, ప్రాజెక్టులు తీసుకొచ్చే అవకాశముందని అంటున్నారు.
Read : ఢిల్లీలో పవన్ మ్యూజిక్ పనిచేస్తుందా
[…] Pawan Kalyan : కేంద్ర మంత్రిగా పవన్… […]