Pawan Kalyan | ఏపీలో సోషల్ మీడియా వణుకు… | Eeroju news

ఏపీలో సోషల్ మీడియా వణుకు...

ఏపీలో సోషల్ మీడియా వణుకు…

తిరుపతి, నవంబర్ 15, (న్యూస్ పల్స్)

Pawan Kalyan

సోషల్ మీడియా.. ఓ వజ్రాయుధం. హద్దుల్లో ఉంటూ అవసరం మేరకు ఉపయోగిస్తే అద్భుతాలు చేయొచ్చు. అదే గీత దాటితే వాతలు తప్పవు. ఇప్పుడు సోషల్ మీడియా పేరు ఎత్తితే చాలు ఏపీ హడలెత్తిపోతోందిసోషల్ మీడియా అంటేనే ఏపీలో చాలామందికి వెన్నులో వణుకు పుడుతోంది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఫైర్ అయిన క్షణం నుంచి ఏపీ రాజకీయాల్లో కొత్త మార్పు కనిపిస్తోంది. వాళ్లు వీళ్లు అని కాదు.. హద్దులు దాటి చెత్త రాతలు రాసిన ఎవరినీ పోలీసులు వదలడం లేదు. డైరెక్టర్ రాంగోపాల్ వర్మకు కూడా ఈ రచ్చ అంటుకుంది. ఏపీ పోలీసులు వర్మకు నోటీసులు ఇచ్చారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని ఆర్జీవీ ఇంటికి వెళ్లిన ప్రకాశం జిల్లా పోలీసులు నోటీసులు అందించారు.

ఏపీ ఎన్నికలకు ముందు వ్యూహం సినిమా ప్రమోషన్ సమయంలో చంద్రబాబు ఆయన కుటుంబసభ్యులతో పాటు పవన్ కల్యాణ్ వ్యక్తిత్వాలను కించపరిచేలా ఆర్జీవీ ట్విట్టర్ లో పోస్టు పెట్టారని ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. గుంటూరు జిల్లా తుళ్లూరులోనూ మరో కేసు ఫైల్ అయ్యింది. దీంతో విచారణకు రావాలని పోలీసులు నోటీసులిచ్చారు. పోస్టు ఎప్పుడు పెట్టారన్నది కాదు.. తప్పుగా పెట్టారా లేదా అన్నట్లుగా వెతికి పట్టుకుంటున్నారు పోలీసులు. వర్మకు జస్ట్ నోటీసులు మాత్రమే. సోషల్ మీడియాలో హద్దులు దాటిన చాలామంది ఇప్పుడు జైలు ఊచలు లెక్కిస్తున్నారు.ఏపీలో ఇప్పుడు హాట్ టాపిక్ ఏదైనా ఉందా అంటే.. అది అసభ్యకర పోస్టులే.

సోషల్ మీడియాలో అసభ్యకర, అభ్యంతకరమైన పోస్టులు పెట్టే వారిపై ఏపీ పోలీసులు వారం రోజులుగా చర్యలు తీసుకుంటున్నారు. కేసులు నమోదు చేస్తూ అరెస్టులు కొనసాగిస్తున్నారు. మరికొందరికి విచారణ నోటీసులు జారీ చేస్తున్నారు. అయితే, ఇందులో ఎక్కువ మంది వైసీపీ సానుభూతిపరులు ఉన్నారు. వైసీపీ సోషల్ మీడియా ఇంచార్జ్ లపైనా కేసులు నమోదయ్యాయి.డైరెక్టర్ ఆర్జీవీ, పోసాని కృష్ణమురళి వంటి వారిపైనా కేసులు బుక్ చేశారు పోలీసులు. సోషల్ మీడియా కార్యకర్తలపై కక్షపూరితంగా కేసులు పెడుతున్నారని కోర్టులో ఓ పిల్ వేయగా..హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. అందులో తప్పేముందని ప్రశ్నించడమే కాదు.. కేసులు పెట్టొద్దని పోలీసులను ఆదేశించలేము అని దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది.

సోషల్ మీడియా పైశాచికత్వం ఏ స్థాయికి వెళ్లిందో చెప్పడానికి హైకోర్టు ఘాటు వ్యాఖ్యలే నిదర్శనం అంటూ పలువురు అభిప్రాయపడుతున్నారు.చేసే ప్రతి పోస్టు, రాసే ప్రతి మాటను గమనించే త్రినేత్రం ఒకటి ఉంటుంది. సోషల్ మీడియా యూజర్లు ప్రతీ ఒక్కరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఇదే. హద్దుల్లో లేకపోతే ప్రమాదంలోకి అడుగు పెట్టినట్లే. విమర్శలు చేయడంలో తప్పు లేదు. హద్దులు దాటి ఓవరాక్షన్ చేస్తేనే అసలు సమస్య. ఇంతకీ సోషల్ మీడియా ఘోరాలపై ఎలాంటి చట్టాలు ఉన్నాయి? ఆ కేసుల్లో ఇరుక్కుంటే జీవితం నాశనమేనా?

ఏపీలో సోషల్ మీడియా వణుకు...

Amit Shah Warning To Pawan Kalyan..? | పవన్ కళ్యాణ్ కు అమిత్ షా వార్నింగ్ ? నిజమెంత..! | FBTV NEWS

Related posts

Leave a Comment