Parents of 33 affected students who met Harish Rao | హరీష్ రావు ను కలిసిన జీవో 33 బాధిత విద్యార్దుల పెరెంట్స్ | Eeroju news

Parents of 33 affected students who met Harish Rao

హరీష్ రావు ను కలిసిన జీవో 33 బాధిత విద్యార్దుల పెరెంట్స్

హైదరాబాద్

Parents of 33 affected students who met Harish Rao

ఎంబిబిఎస్, బిడిఎస్ ప్రవేశాలకు సంబంధించి ప్రభుత్వం విడుదల చేసిన జో.వో 33 బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు మాజీ మంత్రి హరీష్ రావును కలిసారు. ప్రభుత్వ అనాలోచితంగా తెచ్చిన జీవో వల్ల తమ పిల్లలు వైద్య విద్య చదివే అవకాశాలు కొల్పోతున్నట్లు హైదరాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాలకు చెందిన పేరెంట్స్ ఆవేదన వ్యక్తం చేసారు. నాలుగేళ్ల నిబంధన వల్ల తెలంగాణలో పుట్టిన పిల్లలు తెలంగాణలో నాన్ లోకల్ కావడం బాధగా ఉందన్నారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల స్వరాష్ట్రంలో తెలంగాణ బిడ్డలు ఎంబీబీఎస్, బిడీఎస్ చదివే అవకాశం కోల్పోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు.

న్యాయం జరిగేలా చూడాలని, ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలని హరీష్ రావును కోరారు. తెలంగాణ విద్యార్థులకు తీవ్ర నష్టం చేసే జి.వో 33 పై పోరాటం చేస్తామని మాజీ మంత్రి హరీష్ రావు హామీ ఇచ్చారు. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా న్యాయ పోరాటానికి సైతం వెనకాడబోమని స్పష్టం చేసారు. తల్లిదండ్రులు, విద్యార్థులు ఆందోళన చెందవద్దని, ఈ విషయంలో బిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి మన పిల్లలకు అడ్మిషన్ల కోసం స్థానికతను నిర్ధారించుకోడానికి కొత్త సమగ్ర విధానం రూపొందించాలన్నారు.  చీఫ్ సెక్రటరీ, ఇతర ఉన్నతాధికారులతో ఒక హై లెవెల్ కమిటీ వేసి తెలంగాణ విద్యార్థులకు అడ్మిషన్స్ విషయంలో అన్యాయం జరగకుండా చూడాలని మరొకసారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Parents of 33 affected students who met Harish Rao

 

Former Minister Harish Rao’s letter to Minister Uttam Kumar Reddy | మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కి మాజి మంత్రి హరీష్ రావు లేఖ | Eeroju news

Related posts

Leave a Comment