Ongoing loan waiver challenges | కొనసాగుతున్న రుణమాఫీ సవాళ్లు… | Eeroju news

Ongoing loan waiver challenges

కొనసాగుతున్న రుణమాఫీ  సవాళ్లు…

హైదరాబాద్, జూలై 19, (న్యూస్ పల్స్)

Ongoing loan waiver challenges

తెలంగాణలో రైతు రుణమాఫీ మొదలైంది. గురువారమే  మొదటి విడతగా రూ.లక్షలోపు రైతు రుణాలను ప్రభుత్వం మాఫీ చేయడం కోసం నిధులను విడుదల చేసింది. ఆగస్టు నెలాఖరులోపు రూ.2 లక్షల రుణాలను కూడా మాఫీ చేస్తామని రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా ప్రకటించారు. అయితే, ఈ సందర్భంగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే గతంలో చేసిన సవాలు తెరపైకి వచ్చింది.రైతు రుణమాఫీ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. హరీశ్ రావుపై పరోక్షంగా రేవంత్ రెడ్డి సెటైర్లు వేశారు.

‘‘ఆ రోజు సవాల్ విసిరిన వారికి ఒకటే చెప్తున్నా.. మిమ్మల్ని మేం రాజీనామా చేయాలని కోరబోం. ఎందుకంటే మీరు ఎలాగూ పారిపోతారు. కానీ ఇకనైనా కాంగ్రెస్ మాటిస్తే నిలబెట్టుకుంటుందని ఒప్పుకోండి. రాజకీయ ప్రయోజనాల కోసం మీలాంటి మోసపూరిత మాటలు గాంధీ కుటుంబం చెప్పదని మీరు గుర్తు పెట్టుకోవాలి’’ అని రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఇక దీనిపై మాజీ మంత్రి హరీశ్ రావు స్పందించారు.

‘‘సీఎం రేవంత్ రెడ్డి గారూ! తెలంగాణ ఉద్యమ సమయంలో పదవికి రాజీనామా చేయకుండా వెన్నుచూపి పారిపోయింది తమరు. కొడంగల్ లో ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానని ప్రకటించి, వెన్నుచూపి పారిపోయింది తమరు. రేవంత్ రెడ్డి గారు, నిరంతరంగా పారిపోయిన చరిత్ర నీది, అనునిత్యం ప్రజల పక్షాన నిలిచిన చరిత్ర నాది. పదవుల కోసం మీరు పెదవులు మూసుకొని కూర్చుంటే, మంత్రి, ఎమ్మెల్యే పదవులను సైతం తృణ ప్రాయంగా భావించి రాజీనామా చేసిన చరిత్ర నాది.

నాకు పదవులు కొత్త కాదు, రాజీనామాలు కొత్త కాదు. ప్రజలకు, రైతులకు, పేదలకు, అణగారిన వర్గాలకు నా వల్ల మంచి జరుగుతుంది అంటే నేను ఎన్నిసార్లు పదవులకు రాజీనామా చేయడానికైనా వెనుకాడను.మరోసారి చెబుతున్నా, ఆగష్టు 15 వరకు రాష్ట్రంలోని రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ, ఆరు గ్యారెంటీలు (అందులోని 13 హామీలు) సంపూర్ణంగా అమలు చేసి చూపించు. నేను రాజీనామాకు సిద్ధం. చేయని పక్షంలో నువ్వు సిద్ధమా..?’’ అని హరీశ్ రావు సవాలు విసిరారు.

 

Ongoing loan waiver challenges

 

Raithu Bharosa | మారుతున్న రైతు భరోసా రూల్స్… | Eeroju news

Related posts

Leave a Comment