On 6th of this month AP CM Chandrababu Revanth Reddy met | ఈ నెల 6 న ఏపీ సీఎం చంద్రబాబు… రేవంత్ రెడ్డి భేటీ… | Eeroju news

ఈ నెల 6 న ఏపీ సీఎం చంద్రబాబు… రేవంత్ రెడ్డి భేటీ…

హైదరాబాద్

On 6th of this month AP CM Chandrababu Revanth Reddy met

తెలుగు రాష్ట్రాల ముఖ్య మంత్రుల భేటీకి రంగం సిద్ధం అయ్యింది. రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు పూర్తైనా.. ఇంకా రెండు రాష్ట్రాల మధ్య అపరిష్కృ తంగా మిగిలిన అంశాలపై చర్చించేందుకు సీఎం చంద్రబాబు చొరవ తీసుకున్నారు. ఇందులో భాగంగానే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి  ఏపీ సీఎం చంద్రబాబు లేఖ రాశారు. 6వ తేదీన మీరున్న చోటుకే వస్తానని లేఖలో ప్రస్తావించారు. చంద్రబాబు లేఖపై రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. చంద్రబాబు లేఖపై  రేవంత్ రెడ్డి లేఖ రాసే అవకాశం ఉంది. అన్ని సవ్యంగా జరిగితే ఈనెల 6వ తేదీన రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం జరగనుంది. ప్రజా‎భవన్‌లోనే ఇద్దరు భేటీ అయ్యే అవకా శం ఉంది.

విభజన అంశాలు, అపరి ష్కృత అంశాలపై చర్చించే అవకాశం ఉంది.విభజన అంశాలపై కూర్చొని మాట్లాడుకుంటే.. ఎంత ఝఠిలమైన సమస్య అయినా సమసిపోతుందని చంద్రబాబు లేఖలో ప్రస్తావించారు. మరి దశాబ్ద కాలంగా అపరి ష్కృతంగా మిగిలి ఉన్న సమస్యలు ఓ కొలిక్కి రానున్నాయా..? సీఎం హోదాలో చంద్రబాబు, రేవంత్ రెడ్డి తొలి సమా వేశం ఎలా జరగనుంది..? అనే అంశం ఇప్పుడు రెండు రాష్ట్రాల రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన జరిగి పదేళ్లు పూర్తైంది. ఆస్తుల విభజనకు సంబంధించిన అనేక అంశాలు ఇంకా పెండింగ్‌ లోనే ఉన్నాయి. ఢిల్లీలోని ఏపీ భవన్, పటౌడీ హౌజ్, నర్సింగ్‌ హాస్టల్‌ను మాత్రమే విభజిస్తూ ఈ ఏడాది మార్చి 15న కేంద్ర హోం శాఖ నిర్ణయం తీసుకొంది. దీనికి రెండు రాష్ట్రాలూ అంగీకరించాయి. కీలకమైన తొమ్మిది, పది షెడ్యూళ్లలోని ఆస్తులను విభజించాల్సి ఉంది. వాస్తవానికి ఈ రెండు అంశాలే తెలుగు రాష్ట్రాలకు ముఖ్యం కానున్నాయి. మరి రెండు రాష్ట్రాల సీఎంల భేటీలో వీటిపై ఏమేరకు క్లారిటీ వస్తుందో వేచి చూడాలి మరి.

 

Andhra Pradesh Legislature Sessions Live |ఆంధ్ర ప్రదేశ్ శాసన సభ సమావేశాలు ప్రత్యక్ష ప్రసారం

Related posts

Leave a Comment