No strength to fight… No courage Vinesh Phogat | పోరాడే బలం లేదు… ధైర్యం లేదు | Eeroju news

No strength to fight... No courage Vinesh Phogat

పోరాడే  బలం లేదు… ధైర్యం లేదు

లండన్,  ఆగస్టు 8

No strength to fight… No courage Vinesh Phogat

 

100 గ్రాముల అధిక బరువుతో ఒలింపిక్‌ పతకం కోల్పోయి తీవ్ర నిర్వేదంలో ఉన్న భారత స్టార్‌ రెజ్లర్‌ వినేశ్‌ ఫొగాట్‌ సంచలన ప్రకటన చేసింది. రెజ్లింగ్‌కు రిటైర్‌మెంట్‌ ప్రకటిస్తున్నట్లు వెల్లడించింది. రిటైర్‌ మెంట్‌ ప్రకటన చేస్తూ భావోద్వేగానికి గురైంది. ఇక పోరాడే బలం లేదంటూ రెజ్లింగ్‌కు వీడ్కోలు పలికింది. ఈ మేరకు సోషల్ మీడియా ఎక్స్‌లో వినేశ్‌ పోస్ట్‌ పెట్టింది. రెజ్లింగ్‌ తనపై గెలిచిందని… తాను ఓడిపోయానని ఈ పోస్ట్‌లో వినేశ్‌ పేర్కొంది. మీ కల, తన ధైర్యం రెండు విచ్చినమైయ్యాయని… ఇక తనకు పోరాడే బలం కుడా లేదని వినేశ్‌ ఆ పోస్ట్‌ల పేర్కొంది.

ఈ ప్రకటనతో భారత రెజ్లింగ్‌లో ఓ పోరాట యోధురాలి శకం ముగిసింది. ఒలింపిక్స్‌లో పతకం గెలిచి తన కెరీర్‌కు ఘనంగా ముగింపు పలకాలని భావించిన వినేశ్‌… ఇప్పుడు తీవ్ర నిర్వేదంతో ఈ అనూహ్య నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఒలింపిక్స్‌లో 50 కేజీల మహిళల విభాగంలో ఫైనల్‌ పోరుకు ముందు 100 గ్రాముల అదనపు బరువుతో అనర్హత గురైన భారత స్టార్‌ రెజ్లర్‌ వినేశ్‌ ఫోగాట్‌ కోర్ట్‌ ఆఫ్‌ ఆర్బిట్రేషన్‌ ఫర్‌ స్పోర్ట్స్‌ (సీఏఎస్)ను ఆశ్రయించింది. సెమీస్‌ గెలిచి ఫైనల్‌కు వెళ్లిన తనకు సిల్వర్‌ మెడల్‌ ఇవ్వాలని ఫిర్యాదులో కోరింది.  దీనికి సంబంధించి సీఏఎస్‌ ఆగస్టు 8న తీర్పు ఇవ్వనుంది. సీఏఎస్‌ రూల్స్‌ వినేశ్‌కు అనుకూలంగా వస్తే భారత్‌కు మరో పతకం  క్రీడల్లో వివాదాలకు సంబంధించి ఆర్బిట్రేషన్‌ కోర్టును 1984లో ఏర్పాటు చేశారు. తను సిల్వర్‌ మెడల్‌కు అర్హురాలినని ఫిర్యాదులో వినేశ్‌ పేర్కొందని తెలుస్తోంది. ఆర్భిట్రేషన్‌ తీర్పు రావాల్సి ఉండగానే వినేశ్‌ ఈ రిటైర్‌మెంట్‌ నిర్ణయం తీసుకుని అభిమానులకు వేదనను మిగిల్చింది.

యునైటెడ్‌ ప్రపంచ రెజ్లింగ్‌ ఒలింపిక్స్‌ నిబంధనల ప్రకారం రెజ్లింగ్‌ మ్యాచ్‌ జరగనున్న రోజు ఉదయం రెజ్లర్ల బరువును కొలుస్తారు. మ్యాచ్‌ ఆరంభం తొలి రోజు వైద్య పరీక్షలకు, బరువును కొలుచుకునేందుకు రెజ్లర్లకు అరగంట సమయం ఇస్తారు. మంగళవారం వినేశ్‌ బరువు 50 కేజీల కంటే ఎక్కువ లేకపోవడంతో ఆమె రెజ్లింగ్‌లో బరిలోకి దిగి అద్భుతాలు చేసింది. అయితే బుధవారం ఉదయం వినేశ్‌ 100 గ్రాముల బరువు ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఒలింపిక్స్, ఆసియా క్రీడలు, ప్రపంచ ఛాంపియన్‌షిప్స్, ఆసియా ఛాంపియన్‌షిప్స్‌లో ఒక్క గ్రాము అధికంగా ఉన్నా అలాంటి రెజ్లర్లు బరిలోకి దిగేందుకు అర్హత లేదు. అందుకే వినేశ్‌పై అనర్హత వేటు పడింది. కనీసం రజత పతకంతో అయినా భారత్‌కు వస్తుందనుకున్న వినేశ్‌.. అనర్హురాలిగా తేలి పతకానికి దూరమవడంతో భారత అభిమానులను  తీవ్ర ఆవేదనకు గురిచేసింది. మ్యాచ్‌ రోజున ఎక్కువ బరువు ఉండే రెజ్లర్లను పోటీల నుంచి తప్పించి, చివరి స్థానం ఇస్తారు.

చాలా భాదకరం

భారత రెజ్లర్ వినేశ్ ఫొగాట్‌పై అనర్హత వేటు పడిన అంశంపై ప్యారిస్ ఒలింపిక్స్‌లో బంగారం పతకం గెలిచిన అమెరికా రెజ్లర్ సారా హిల్డర్ బ్రాంట్ స్పందించారు. బుధవారం రాత్రి జరిగిన ఫైనల్‌లో ఆమె క్యూబా రెజ్లర్ గుజ్మన్ లోపేజ్‌పై విజయం సాధించారు. లోపేజ్‌కు రజతం దక్కగా, జపాన్, చైనా రెజ్లర్లు కాంస్యాలు సాధించారు. గెలుపు అనంతరం మాట్లాడిన సారా హిల్డర్… వినేశ్ ఫొగాట్ బరువుపై స్పందించారు.వినేశ్ ఫొగాట్ బాధను తాను అర్థం చేసుకోగలనన్నారు. ఫొగాట్ గొప్ప రెజ్లర్… ఆమెపై అనర్హత వేటు పడటం బాధాకరం అన్నారు. బరువు విషయంలో తాను కూడా చాలా కష్టపడ్డానని, కాబట్టి ఆమె కష్టాన్ని తాను అర్థం చేసుకోగలనన్నారు. ఫొగాట్‌పై అనర్హత విషయం తెలిగానే ఒలింపిక్స్ విజేతను తానే అని భావించానని… కానీ గంట వ్యవధిలోనే లోపేజ్‌తో తలపడాలని తెలిసిందన్నారు. దీంతో తన ఆనందానికి బ్రేక్ పడిందన్నారు. లోపేజ్‌తో పోటీలో గెలిచి తాను పసిడిని అందుకోవడం ఆనందంగా ఉందన్నారు.తాను కూడా బరువు తగ్గాల్సిన పరిస్థితి ఏర్పడిందని, అందుకోసం ఎంతో సాధన చేశానన్నారు. వినేశ్ విషయంలో ఇలా జరుగుతుందనుకోలేదని అన్నారు. సెమీస్‌లో ఆమె అద్భుతంగా ఆడిందని, అలాంటి రెజ్లర్‌కు ఈ ఒలింపిక్స్ ఇలా ముగుస్తుందనుకోలేదన్నారు. ఆమెకు మద్దతు తెలుపుతున్నానని… రెజ్లర్‌గానే కాకుండా వ్యక్తిగతంగానూ ఆమె మంచి మనిషి అన్నారు.

విజేతకు ఇచ్చే సౌకర్యాలు

భార‌త స్టార్ రెజ్ల‌ర్ వినేశ్ ఫోగాట్ పారిస్ ఒలింపిక్స్ మ‌హిళ‌ల ఫ్రీస్టైల్ రెజ్లింగ్ 50 కిలోల విభాగంలో ఫైనల్ నుంచి అధిక బ‌రువు కార‌ణంగా నిష్క్ర‌మించిన విష‌యం తెలిసిందే. దీంతో యావ‌త్ భార‌త్ షాక్‌కు గుర‌యింది. ప‌త‌కం ఖాయం అనుకున్న స‌మ‌యంలో ఇలా అర్థాంత‌రంగా పోటీల నుంచి నిష్క్ర‌మించ‌డం అందరికి షాకిచ్చింది. ఈ క్ర‌మంలో వినేశ్‌ స్వ‌రాష్ట్రం హ‌ర్యానా ఆమెకు మ‌ద్ధ‌తుగా నిలిచింది. తాజాగా అక్క‌డి స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. వినేశ్‌కు ర‌జ‌త ప‌త‌క విజేత‌కు ద‌క్కే అన్ని స‌న్మానాలు, రివార్డులు, సౌక‌ర్యాలు అందిస్తామ‌ని ప్ర‌క‌టించింది. ఈ మేర‌కు ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి న‌యాబ్ సైనీ ఎక్స్ (ట్విట్ట‌ర్) వేదిక‌గా ప్ర‌క‌టించారు. వినేశ్‌ ఛాంపియ‌నేన‌ని ఈ సంద‌ర్భంగా ఆమెను హ‌ర్యానా ముఖ్య‌మంత్రి కొనియాడారు.  “అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న‌తో ఫైన‌ల్ వ‌ర‌కు వెళ్లింది. ఏ కార‌ణంతోనైనా ఆమె ఫైన‌ల్ ఆడ‌క‌పోవ‌చ్చు. కానీ మాకు ఆమె ఛాంపియ‌నే. ఈ నేప‌థ్యంలోనే మా స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఒలింపిక్ మెడ‌లిస్ట్ మాదిరిగానే ఆమెకు స్వాగ‌తం ప‌ల‌కాల‌ని మా ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ఒలింపిక్ ర‌జ‌త ప‌త‌క విజేత‌కు ద‌క్కే అన్ని స‌న్మానాలు, రివార్డులు, సౌక‌ర్యాలను వినేశ్‌కు అందిస్తామ‌ని” అని తెలిపారు.

25 లక్షల రివార్డు

పంజాబ్‌లోని ల‌వ్లీ ప్రొఫెష‌న‌ల్ యూనివ‌ర్సిటీ (ఎల్‌పీయూ) స్టార్ రెజ్ల‌ర్ వినేశ్ ఫొగాట్‌కు రూ. 25 ల‌క్ష‌ల నగదు బహుమతిని ప్రకటించింది. పారిస్ ఒలింపిక్స్‌లో ఫైనల్ బౌట్‌కు ముందు ఆమెపై అనర్హత వేటు పడిన తర్వాత ఈ ప్రకటన చేసింది. ఈ సంద‌ర్భంగా యూనివ‌ర్సిటీ ఛాన్స్‌ల‌ర్ అశోక్ కుమార్ మిట్టల్ మాట్లాడుతూ.. “మాకు వినేశ్‌ ఇప్పటికీ పతక విజేతే. ఆట‌పై ఆమె అంకితభావం, నైపుణ్యం చాలా గొప్ప‌వి. ఈ గుర్తింపున‌కు ఆమె అన్ని విధాల అర్హురాలు. ఆమెకు రూ. 25 లక్షల న‌గ‌దు బ‌హుమ‌తిని అందించడం మాకు గర్వకారణం” అని అన్నారు. కాగా, త‌మ విద్యార్థులు ఒలింపిక్స్‌లో స్వ‌ర్ణం గెలిస్తే రూ. 50ల‌క్ష‌లు, ర‌జ‌తం గెలిస్తే రూ. 25ల‌క్ష‌లు, కాంస్యం గెలిస్తే రూ. 10ల‌క్ష‌లు ఇస్తామ‌ని గ‌తంలో ఎల్‌పీయూ ప్ర‌క‌టించింది. అందుకే ఫైన‌ల్ వ‌ర‌కు వెళ్లిన వినేశ్‌కు ఇప్పుడు రూ. 25ల‌క్ష‌ల రివార్డు ప్ర‌క‌టించింది. ఇదిలాఉంటే.. వినేశ్‌ ఫోగాట్‌పై పారిస్ ఒలింపిక్స్ లో ఆఖ‌రి నిమిషంలో అన‌ర్హ‌త వేటు ప‌డిన విష‌యం తెలిసిందే. మ‌హిళ‌ల ఫ్రీస్టైల్ రెజ్లింగ్ 50 కిలోల విభాగంలో ఫైనల్‌ పోటీలకు ముందు నిర్వాహకులు ఆమె బరువు చెక్ చేశారు. ఆ స‌మ‌యంలో వినేశ్‌ 100 గ్రాములు అదనపు బరువుతో ఉన్నట్టు గుర్తించారు. దాంతో ఆమెపై ఒలింపిక్‌ కమిటీ, రెజ్లింగ్‌ కమిటీ అనర్హత వేటు వేశాయి. దీంతో ప‌త‌కం ఖాయం అనుకున్న వినేశ్ ఖాళీ చేతుల‌తో తిరిగి రావాల్సి వ‌చ్చింది. ఈ నేప‌థ్యంలోనే ఆమె త‌న కెరీర్‌కు ముగింపు ప‌లికారు. రెజ్లింగ్‌కు గుడ్‌బై చెబుతూ వినేశ్ ఫోగాట్ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు.

No strength to fight... No courage Vinesh Phogat

 

 

Big hopes for the Kadapa cadre | కడప కేడర్ కు భారీ ఆశలు | Eeroju news

Related posts

Leave a Comment