Nizamabad | నిజామాబాద్ బస్ స్టాప్ లో ఎలక్ట్రిక్ బస్సుల ప్రారంభోత్సవ వేడుకలు | Eeroju news

నిజామాబాద్ బస్ స్టాప్ లో ఎలక్ట్రిక్ బస్సుల ప్రారంభోత్సవ వేడుకలు

నిజామాబాద్ బస్ స్టాప్ లో ఎలక్ట్రిక్ బస్సుల ప్రారంభోత్సవ వేడుకలు

ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి పొన్నం ప్రభాకర్

నిజామాబాద్

Nizamabad

నిజామాబాద్ రీజియన్ లో 13 ఎలక్ట్రిక్ బస్సులను మంత్రి పొన్నం ప్రభాకర్ శుక్రవారం జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, ధనుపాల్ సూర్య నారాయణ, భూపతి రెడ్డి, సుదర్శన్ రెడ్డి, జిల్లా కలెక్టర్, మేయర్, ఆర్టీసి ఉన్నతాధికారులు పాల్గోన్నారు. తరువాత అయన ఎమ్మెల్యేలతోపాటు బస్సులో ప్రయాణించారు.
మంత్రి పొన్నం మాట్లాడుతూ ఆర్టీసి గత 10 సంవత్సరాలుగా ఒక్క బస్సు కొనకుండా ఒక్క కొత్త ఉద్యోగం ఇవ్వకుండా ఒక రిటైర్డు ఈడి నీ పెట్టీ ఆర్టీసి ఉనికి కే ప్రమాదం తెచ్చే ప్రయత్నం చేశారు. ఆర్టీసీలో 94 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేశారు.

3500 కోట్ల విలువైన ప్రయాణం ఉచితంగా చేశారు. ఆర్టీసి తెలంగాణ ప్రజా పాలన లో మహ లక్ష్మి రూపంలో వచ్చిన అదృష్ట లక్ష్మి. నష్టాల రూపంలో ఉన్న ఆర్టీసి లాభాల రూపంలోకి తీసుకొచ్చి పీఆర్సీ బకాయిలు తీర్చింది.మహా లక్ష్మి పథకం విజయవంతం అయింది అంటే ఆర్టీసి ఉద్యోగులు నిరంతరం శ్రమించడం. రాఖి పౌర్ణమి రోజు గతంలో ఎప్పుడు లేని విధంగా మహిళలు ప్రయాణం చేశారు.

నిజామాబాద్ లో 67 ఎలక్ట్రిక్ బస్సులు కేటాయించుకున్నం. 13 బస్సులు ప్రారంభించుకున్నం. వారం రోజుల్లో మిగిలిన బస్సులు వస్తాయి. నిజామాబాద్ లో కాలుష్యాన్ని తగ్గించడానికి ఎలక్ట్రిక్ బస్సులు తీసుకొచ్చాం. కారుణ్య నియామకాలు చేపట్టి ఆర్టీసీని ముందుకు తీసుకుపోతున్నం. ఆర్టీసి కి ప్రజల సహకారం ఎంతో ఉంది. గ్రామ గ్రామానికి బస్సు సౌకర్యం కల్పిస్తున్నాం. మరిన్ని కొత్త బస్సులు కొనుగోలు చేస్తున్నాం. అందరికీ బతుకమ్మ దసరా శుభాకాంక్షలని అన్నారు.

నిజామాబాద్ బస్ స్టాప్ లో ఎలక్ట్రిక్ బస్సుల ప్రారంభోత్సవ వేడుకలు

Electric buses… | ఎలక్ట్రిక్ బస్సులు… | Eeroju news

Related posts

Leave a Comment