Nizamabad:పది ఎకరాలు లోపే.. రైతు భరోసా

Telangana government, which hopes to provide farmer assurance from Sankranti, has focused on the formulation of procedures.

సంక్రాంతి నుంచి రైతు భరోసా ఇవ్వాలని భావిస్తున్న తెలంగాణ ప్రభుత్వం.. విధివిధానాల రూపకల్పనపై దృష్టి పెట్టింది. ఇందులో కేబినెట్ సబ్ కమిటీ సమావేశమైంది. గత ప్రభుత్వంలో లాగా నిబంధనలు లేకుండా రైతు భరోసా అందించకూడదని, సాగు చేసే రైతులకే ఇవ్వాలని సూత్రప్రాయం నిర్ణయించింది. ఇటు 10 ఎకరాల లోపు ఉన్న రైతులకే రైతు భరోసా ఇచ్చే అంశంపై క్యాబినెట్ భేటీలో చర్చించాలని నిర్ణయం తీసుకుంది.ఇటు మరోసారి వచ్చే వారం సబ్ కమిటీ భేటీ కానుంది. రైతు భరోసా పంపిణీ విధివిధానాలపై క్షుణ్ణంగా చర్చించనుంది.

పది ఎకరాలు లోపే.. రైతు భరోసా

నిజామాబాద్
సంక్రాంతి నుంచి రైతు భరోసా ఇవ్వాలని భావిస్తున్న తెలంగాణ ప్రభుత్వం.. విధివిధానాల రూపకల్పనపై దృష్టి పెట్టింది. ఇందులో కేబినెట్ సబ్ కమిటీ సమావేశమైంది. గత ప్రభుత్వంలో లాగా నిబంధనలు లేకుండా రైతు భరోసా అందించకూడదని, సాగు చేసే రైతులకే ఇవ్వాలని సూత్రప్రాయం నిర్ణయించింది. ఇటు 10 ఎకరాల లోపు ఉన్న రైతులకే రైతు భరోసా ఇచ్చే అంశంపై క్యాబినెట్ భేటీలో చర్చించాలని నిర్ణయం తీసుకుంది.ఇటు మరోసారి వచ్చే వారం సబ్ కమిటీ భేటీ కానుంది. రైతు భరోసా పంపిణీ విధివిధానాలపై క్షుణ్ణంగా చర్చించనుంది. రానున్న యాసంగి పంటకు రైతుభరోసా అందించేందుకు ఖరారు చేయాల్సిన విధివిధానాలపై సబ్ కమిటీ చర్చించింది. పథకం ప్రారంభమైన నాటి నుంచి నేటి వరకు రైతు భరోసా అందించిన తీరుపై సమీక్షించింది. అలాగే రాష్ట్రవ్యాప్తంగా సబ్ కమిటీ పర్యటించిన సమయంలో రైతుల వ్యక్తం చేసిన అభిప్రాయాలు, అధికారులు సేకరించి సమాచారంపైన మంత్రులు కసరత్తు చేశారు.సంక్రాంతి నుంచి రైతు భరోసా చెల్లించాలని ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఆ మేరకు అందుకు సంబంధించిన కసరత్తును కేబినెట్ సబ్ కమిటీ చేసింది. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అధ్యక్షతన సమావేశమైన క్యాబినెట్ సబ్ కమిటీ.. దాదాపు గంటన్నర పాటు సమావేశమైంది. గత 6 నెలలుగా రైతు భరోసా విధివిధానాలు, మార్గదర్శకాలకు సంబంధించి తెలంగాణ వ్యాప్తంగా రైతుల అభిప్రాయాలతో పాటు వివిధ రంగాల ప్రముఖుల అభిప్రాయాలను క్యాబినెట్ సబ్ కమిటీ సేకరించింది.అందులో ప్రధానంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం బేషరతుగా రైతుబంధు చెల్లించింది. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం అలా కాకుండా కొన్ని నిబంధనలు పెట్టాలని నిర్ణయించినట్లు సమాచారం.

ఎన్ని ఎకరాల వరకు రైతు భరోసాను అమలు చేయాలనే కీలక అంశం మంత్రివర్గంలో చర్చకు వచ్చింది.  గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎకరాలతో సంబంధం లేకుండా రైతు భరోసా అందించారు. ఈ విధానంపై రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమయ్యింది. వందల ఎకరాల పొలాలున్న రైతులకు పెట్టుబడి సాయం ఎందుకనే ప్రశ్నలు ఎదురయ్యాయి..  ఈ నేపథ్యంలో ఎన్ని ఎకరాలలోపు రైతులకు రైతు భరోసా అందిస్తే బాగుంటుందనే విషయంపై మంత్రివర్గం చర్చించింది.పెట్టుబడి కోసం అధిక వడ్డీలు తీసుకుని ఇబ్బందులు పడకుండా నిరోధించడం, అప్పులు చేసిన వారికే తక్కువ ధరకు పంటల్ని విక్రయించకుండా చేసేందుకు రైతు భరోసా అక్కరకు వస్తుంది.  ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకునే.. చిన్న, సన్నకారు, మధ్యస్థాయిలో రైతులకు మాత్రమే రైతు భరోసా అందించేలా నిబంధన పెడితే ఎలా ఉంటుందన్న చర్చ జరిగింది. కానీ.. ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అలాగే.. ప్రభుత్వానికి పన్ను చెల్లింపుదారులు, ప్రభుత్వ ఉద్యోగులను సైతం రైతు భరోసాకు అనర్హులుగా ప్రకటించాలనే చర్చ నడిచింది. కాగా.. ఈ విషయాలపై ఇంకా ఎలాంటి పూర్తి స్పష్టత రాలేదని మంత్రివర్గం వెల్లడించింది.అందులో ప్రధానంగా పంటలు వేసిన భూములకు మాత్రమే రైతుభరోసా చెల్లించాలని, దాంతో పాటు ఎకరాల విషయంలో కొంత కటాఫ్ పెట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. 7 నుంచి 10 ఎకరాల లోపు భూములు ఉన్న వారికే రైతుభరోసా చెల్లించాలని క్యాబినెట్ సబ్ కమిటీ ప్రాథమికంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది.

Read:Hyderabad:పోలీస్ శాఖలో ఏం జరుగుతోంది

Related posts

Leave a Comment