అమల్లోకి కొత్త ట్రాఫిక్ రూల్స్
హైదరాబాద్, ఆగస్టు 19 (న్యూస్ పల్స్)
New traffic rules come into effect
ఒకప్పుడు రవాణా సదుపాయం కోసం వాహనాలను వినియోగిస్తుంటాం. ఇప్పుడు సుఖవంతమైన ప్రయాణం కోసం, ప్రెస్జేజీ కోసం కూడా చాలా మంది వాహనాలు కొనుగోలు చేస్తున్నారు. కొందరు ఉపాధి పొందుతున్నారు. దీంతో వాహనాల సంఖ్య పెరుగుతోంది. రోడ్లపై ట్రాఫిక్ పెరుగుతోంది. దీంతో ప్రభుత్వాలు కూడా రోడ్ల విస్తరణ చేపడుతున్నాయి. అయినా రహదారి ప్రమాదాలు జరుగుతున్నాయి. దీంతో ఆస్తి, ప్రాణ నష్టాలు జరుగుతున్నాయి. దీనికి ప్రధానం కారణం వాహనదారులు అతి వేగంగా వెళ్లడం, ట్రాఫిక్ నియమాలు పాటించకపోవడం.. మద్యం సేవించి వాహనం నడపడం లాంటి కారణాలే ఎక్కువగా ఉన్నాయి. ఈమేరకు క్రైమ్ రిపోర్ట్స్ కూడా ఇదే విషయం చెబుతున్నాయి.
ప్రమాదాల బారిన పడుతన్న వారిలో ఎక్కువ మంది 30 ఏళ్లలోపు వారే ఉంటున్నారని పేర్కొంటున్నాయి. ఇక వాహనాల వాహన వేగ పరిమితులకు సంబంధించి కొత్త ట్రాఫిక్ నిబంధనలు అమలుతో రోడ్డు ప్రమాదాలను తగ్గించవచ్చని సూచించింది. ఈ నేపథ్యంలో వాహనాల వేగం తగ్గించేందుకు కేంద్రం కొత్త నిబంధన అమలులోకి తెచ్చింది. అమలులోకి వచ్చిన ఈ కొత్త ట్రాఫిక్ నిబంధనల గురించి తెలుసుకుందాం.రాష్ట్రంలోని ఏ రోడ్డుపైనా కూడా గంటకు 130 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో వాహనాన్ని నడపకూడదు. ఇలా చేస్తే జరిమానాతోపాటు.. వాహనాలకు ప్రమాదం కూడా సంభవించవచ్చు.
ఈ వేగం కంటే ఎక్కవుగా వెళ్తే రూ.2 వేల జరిమానా విధించబడుతుంది. జరిమానాతో పాటు.. ఆరు నెలల వరకు జైలు శిక్ష కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. అతి వేగంగా వెళ్లే వాహనాలను గుర్తించేందుకు ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ ఇంటర్ సెప్టర్లపైనే ఆధారపడరు. వాహనాల వేగం గుర్తించడానికి , రికార్డ్ చేయడానికి స్పాట్ , సెగ్మెంటల్ కొలతలను కూడా ఉపయోగిస్తారు. చాలా మంది వాహనదారులు కెమెరాలు కనిపించినప్పుడు మాత్రమే వేగాన్ని తగ్గించి.. మళ్లీ కొద్ది దూరం ప్రయాణించి.. తమ వాహనవేగాన్ని పెంచుతారు.
ఇలా తప్పించుకోకుండా ట్రాఫిక్ పోలీసులు ఈ వ్యూహాన్ని రచిస్తున్నారు. గంటకు 130 కిమీ కంటే ఎక్కువ వేగంతో డ్రైవింగ్ చేయడం నిర్లక్ష్యంగా పరిగణించబడుతుంది. ఈ నిబంధనను ఉల్లంఘించిన వాహన యజమానులపై ఆగస్టు 15 నుంచి ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తున్నారు.ఈ కొత్త రూల్ ప్రకారం.. దాదాపు అన్ని వాహనాలపై ఎఫ్ఐర్ నమోదయ్యే అవకాశం ఉంది. ఎక్స్ప్రెస్ వేలలో ప్రమాదాలే వేగ నియంత్రణకు ప్రధాన కారణం. మితిమీరిన వేగం నియంత్రించడమే లక్ష్యంగా పోలీసులు చర్యలు చేపట్టారు. జరిమానాలు నివారించడానికి.. రహదారి భద్రతకు సహకరించడానికి వాహనదారులు ఈ కొత్త నిబంధన గురించి తప్పకుండా తెలుసుకోవాలి.
Traffic rules are strict | ట్రాఫిక్ రూల్స్ కఠినతరం | Eeroju news