New Delhi:22 లక్షలకే టెస్లా కార్

Tesla car for 22 lakhs...

New Delhi:22 లక్షలకే టెస్లా కార్:దేశంలోని రెండు ప్రధాన నగరాల్లో ఇప్పటికే రిటైల్ అవుట్ లెట్ల కోసం స్థలాన్ని లీజుకు తీసుకున్న టెస్లా.. అక్కడి నుంచి అమ్మకాలను జరుపనుంది. ఏప్రిల్‌ నెలలో టెస్లా కంపెనీ భారత్ లో తన మెుదటి షోరూమ్ ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. అప్పుడే దాని తొలి ఎలక్ట్రిక్ కారు భారత్ లోకి రానున్నట్లు సమాచారం. అసలు టెస్లా కారు అమెరికాలో ఎందుకు ఇంత ఫేమస్ అయిందో చూద్దాం.భారత ప్రధాని మోడీ అమెరికా పర్యటనకు వెళ్లి వచ్చారు. ఆ సమయంలో ఆయన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ లతో భేటీ అయ్యారు.

22 లక్షలకే టెస్లా కార్.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 20
దేశంలోని రెండు ప్రధాన నగరాల్లో ఇప్పటికే రిటైల్ అవుట్ లెట్ల కోసం స్థలాన్ని లీజుకు తీసుకున్న టెస్లా.. అక్కడి నుంచి అమ్మకాలను జరుపనుంది. ఏప్రిల్‌ నెలలో టెస్లా కంపెనీ భారత్ లో తన మెుదటి షోరూమ్ ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. అప్పుడే దాని తొలి ఎలక్ట్రిక్ కారు భారత్ లోకి రానున్నట్లు సమాచారం. అసలు టెస్లా కారు అమెరికాలో ఎందుకు ఇంత ఫేమస్ అయిందో చూద్దాం.భారత ప్రధాని మోడీ అమెరికా పర్యటనకు వెళ్లి వచ్చారు. ఆ సమయంలో ఆయన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ లతో భేటీ అయ్యారు. దీంతో భారత్ లోకి టెస్లా ఎంట్రీ ఖాయం అయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే దేశంలోని వివిధ విభాగాల్లో ఆ కంపెనీలో పని చేసేందుకు ఉద్యోగుల కోసం టెస్లా అన్వేషణ మొదలు పెట్టింది. అందుకు ఉద్యోగ ప్రకటనలను కూడా చేసింది. ప్రస్తుతం టెస్లా ఎప్పుడెప్పుడు భారత్ లోకి అడుగు పెడుతుందా అని చాలా మంది ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఏప్రిల్ నెల నుంచి కార్ల ప్రియులకు టెస్లా కార్లు అందుబాటులో ఉంటాయని కంపెనీ ప్రకటించింది. దేశంలోని రెండు ప్రధాన నగరాల్లో ఇప్పటికే రిటైల్ అవుట్ లెట్ల కోసం స్థలాన్ని లీజుకు తీసుకున్న టెస్లా.. అక్కడి నుంచి అమ్మకాలను జరుపనుంది. ఏప్రిల్‌ నెలలో టెస్లా కంపెనీ భారత్ లో తన మెుదటి షోరూమ్ ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. అప్పుడే దాని తొలి ఎలక్ట్రిక్ కారు భారత్ లోకి రానున్నట్లు సమాచారం. అసలు టెస్లా కారు అమెరికాలో ఎందుకు ఇంత ఫేమస్ అయిందో చూద్దాం.టెస్లా కంపెనీ తన కార్ల ఆవిష్కరణ, అద్భుతమైన పనితీరు, పర్యావరణానికి హాని తలపెట్టకుండా ఉండడం, అత్యాధునిక డిజైన్, ఫీచర్ల కారణంగా అమెరికాలో ప్రజాదరణ పొందింది. దాంతో పాటు అక్కడి ప్రభుత్వం అందజేస్తున్నప్రోత్సాహకాలు, విస్తృతమైన సూపర్‌ చార్జర్ నెట్‌వర్క్ ల కారణంగా టెస్లా కార్లు కొనుగోలుదారులను ఆకర్షించాయి. కంపెనీ యజమాని అయిన ఎలోన్ మస్క్ తరచూ సోషల్ మీడియా ద్వారా టెస్లా కంపెనీ కార్ల గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉంటాడు. దీంతో జనాల్లో ఎప్పుడూ ఈ కారు గురించిన చర్చలు నడుస్తూనే ఉంటాయి.వాస్తానికి కొన్నేళ్లుగా భారత్ మార్కెట్లో తమ వాహనాలను అమ్మాలని టెస్లా చూస్తుంది. ఎట్టకేలను కంపెనీ నిరీక్షణకు తెరపడింది. ఈ నేపథ్యంలోనే ఏప్రిల్ నుంచి దేశంలో టెస్లా కార్లు అందుబాటులోకి రాబోతున్నాయి. అయితే.. ప్రస్తుతానికి దేశీయంగా ఉత్పత్తి ప్లాంట్లను నిర్మించడం, ఇక్కడే ఉపాధి అవకాశాలను పెంచడం వంటి కండీషన్లను పక్కనపెట్టి.. బెర్లిన్ ప్లాంట్ నుంచి ఉత్పత్తి అయిన వాహనాలను దేశంలో కంపెనీ విక్రయించనుంది. ఇందుకోసం ప్రధాన నగరాలైన ఢిల్లీ, ముంబైలలో షోరూంలను ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. జాతీయ మీడియా కథనాల ప్రకారం.. ముంబైలోని బీకేసీ బిజినెస్ డిస్ట్రిక్ట్, ఢిల్లీలోని ఏరోసిటీలో షోరూమ్ లను ఏర్పాటు చేయనుంది టెస్లాటెస్లా తన కార్ల కోసం చాలా అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ వాడుతుంది. ఈ కార్లు ఒక్క సారి ఫుల్ చార్జీ చేస్తే ఎక్కువ దూరం ప్రయాణించగలవు. ఎలక్ట్రిక్ కార్లు కావడంతో పర్యావరణానికి కూడా హాని కలిగించవు. దీంతో పాటు కంపెనీ లాంగ్-రేంజ్ బ్యాటరీలు, సూపర్‌ చార్జర్ నెట్‌వర్క్‌లు, డ్రైవర్- ఫ్రెండ్లీ సిస్టమ్ ఏర్పాటు చేసింది. ఇవన్నీ ఉండడం వల్లే టెస్లా కార్లకు అంత క్రేజ్ ఏర్పడింది. సాధారణంగా భారత్ లో జనాభా ఎక్కువ అన్న సంగతి తెలిసిందే. అందుకే ఇతర దేశాలతో పోలిస్తే ఇక్కడ మార్కెట్ విస్త్రతంగా ఉంటుంది. పైగా ఇక్కడ మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా ఉంటారు. అలాంటి వారిని టార్గెట్ గా తీసుకుని టెస్లా తన కార్లను ఇక్కడ ప్రవేశ పెట్టాలని భావిస్తోంది. అందుకే వారందరికీ అందుబాటు ధరల్లో ఉండే విధంగా కేవలం రూ.22లక్షలకే టెస్లా కార్లను అందించాలని కంపెనీ ప్రణాళికలను రచిస్తుంది. ఇంకా అంత కంటే తక్కువ ధరకైనా ఇచ్చి మార్కెట్లో తన సత్తా చాటాలని భావిస్తుంది. అదే నిజం అయితే ప్రస్తుతం మార్కెట్ ను ఏలుతున్న కంపెనీలు తీవ్ర నష్టాలను ఎదుర్కోవాల్సిందే.

Read more:Hyderabad:తెలంగాణలో రంజాన్ రచ్చ

Related posts

Leave a Comment