New Delhi:భారత్ లో హెచ్ఎంపీవీ వైరస్ కలకలం

New Delhi, January 7 At a time when the HMPV virus is creating a stir in China, the detection of the virus in India is causing panic.

చైనాలో హెచ్ఎంపీవీ వైరస్ కలకలం సృష్టిస్తోన్న తరుణంలో భారత్ లోనూ ఆ వైరస్ ను గుర్తించడం భయాంధోళనలను కలిగిస్తోంది. ఇప్పటికే కర్ణాటకలో రెండు కేసులు నమోదైనట్టు వెల్లడించిన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్  – ICMR.. ఇప్పుడు మరికొన్ని రాష్ట్రాల్లో పాజిటివ్ కేసులు నమోదైనట్టు తెలిపింది. ఇంతకుముందు బెంగళూరులో  3, 8 నెలల వయసున్న ఇద్దరు చిన్నారులకు వైరస్ సోకినట్టు కనుగొన్నారు. తాజాగా ఓ గుజరాత్ లోని అహ్మదాబాద్ కు చెందిన చిన్నారికి వ్యాపించినట్టు గుర్తించారు. కోల్‌కతాలో ఒకరికి పాజిటివ్ నిర్ధారణ అయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ కీలక ప్రకటన చేసింది.

భారత్ లో హెచ్ఎంపీవీ వైరస్ కలకలం

న్యూఢిల్లీ, జనవరి 7
చైనాలో హెచ్ఎంపీవీ వైరస్ కలకలం సృష్టిస్తోన్న తరుణంలో భారత్ లోనూ ఆ వైరస్ ను గుర్తించడం భయాంధోళనలను కలిగిస్తోంది. ఇప్పటికే కర్ణాటకలో రెండు కేసులు నమోదైనట్టు వెల్లడించిన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్  – ICMR.. ఇప్పుడు మరికొన్ని రాష్ట్రాల్లో పాజిటివ్ కేసులు నమోదైనట్టు తెలిపింది. ఇంతకుముందు బెంగళూరులో  3, 8 నెలల వయసున్న ఇద్దరు చిన్నారులకు వైరస్ సోకినట్టు కనుగొన్నారు. తాజాగా ఓ గుజరాత్ లోని అహ్మదాబాద్ కు చెందిన చిన్నారికి వ్యాపించినట్టు గుర్తించారు. కోల్‌కతాలో ఒకరికి పాజిటివ్ నిర్ధారణ అయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ కీలక ప్రకటన చేసింది. దేశవ్యాప్తంగా శ్వాసకోస వ్యాధుల విషయంలో ఐసీఎంఆర్ సాధారణ పర్యవేక్షణలో భాగంగా రెండు కేసులు వెలుగు చూశాయని చెప్పింది.కర్ణాటకలో రెండు హెచ్ఎంపీవీ (HMPV – హ్యూమన్ మెటాప్‌న్యూమోవైరస్) కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ధృవీకరించిన గంటల వ్యవధిలోనే , గుజరాత్‌లో మరో కేసు నమోదైంది. ఇది గుజరాత్‌లో నమోదైన మొదటి హెచ్ఎంపీవీ కేసు. ఈ వైరస్ సుమారు 2 సంవత్సరాలున్న చిన్నారిలో కనుగొన్నారు. ప్రస్తుతం పేషెంట్ ను అహ్మదాబాద్‌లోని చంద్‌ఖేడా ప్రాంతంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు. గతంలో కరోనా సమయంలో మొదట ఒకట్రెండు కేసులు నమోదు కాగా, తరువాత విపరీతంగా కేసులు పెరిగి లక్షల మంది చనిపోయారు.ఇక ఇంతకుముందు కర్ణాటకలో నమోదైన రెండు కేసులల్లో ఒకరు మూడేళ్ల బాలికగా.. మరొకరు 8నెలల బాలుడు ఉన్నారు. వీరిద్దరికీ బెంగళూరులోని బాప్టిస్ట్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ ఇద్దరు చిన్నారులూ ఎలాంటి ఇంటర్నేషన్ ట్రిప్ చేయనప్పటికీ.. ఇద్దరికీ బ్రోంకోప్ న్యుమోనియా ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. ఈ ఇద్దరిలో బాలిక ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయినట్టు సమాచారం. ఇక బాలుడు కోలుకుంటున్నాడని చెబుతున్నారు.కేసులు పెరుగుతున్నప్పటికీ దేశంలో కొత్త వైరస్ విషయంలో ఎలాంటి ఆందోళన అవసరం లేదని హెల్త్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ అతుల్ గోయెల్ భరోసా ఇచ్చారు. భయపడాల్సి అవసరం లేదని చెప్పారు. దేశంలో శ్వాసకోస వ్యాధుల ఇన్ఫెక్షన్స్ కు సంబంధించిన కేసులను ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పారు. ఆస్పత్రుల్లో అవసరానికి మించి సామాగ్రి, పడకలు, ఇతర మెడికల్ సౌకర్యాలు సమకూర్చమన్నారు. హెచ్ఎంపీవీ కూడా సాధారణ శ్వాసకోస వైరస్ ల మాదిరిదేనని చెప్పారు.శీతాకాలంలో సాధారణంగా తలెత్తే శ్వాసకోస లక్షణాలే హెచ్ఎంపీవీకి ఉంటాయని అతుల్ తెలిపారు. దగ్గు, ముక్కు కారటం లేదా గాలి పీల్చుకోవడం కష్టంగా మారడం, గొంతు నొప్పి, జ్వరం వంటి లక్షణాలు ఉండొచ్చన్న ఆయన.. తీవ్రమైన సందర్భాల్లో, ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు లేదా ధీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ఎక్కువ ఇబ్బంది పడతారని చెప్పారు. సాధారణ లక్షణాలే ఉన్నప్పటికీ తీవ్రంగా అనిపిస్తే వెంటనే సమీపంలోని ఆస్పత్రిని సందర్శించాలని సూచించారు.
తీవ్రంగా ఉన్నది నిజమే.. కానీ భయపడాల్సిన అవసరం లేదు

బీజింగ్, జనవరి 7
కరోనా మిగిల్చిన విషాదం, నష్టాన్ని మర్చిపోకముందే.. చైనాలో మరో వైరస్ వెలుగులోకి రావడం కలకలం రేపుతోంది, ఇతర దేశాలకూ ఈ వైరస్ వ్యాప్తికి సంబంధించిన నివేదికల మధ్య, చలికాలంలో సంభవించే శ్వాసకోశ వ్యాధుల కేసులు గతేడాది కంటే ఈ సంవత్సరం తక్కువగా ఉన్నాయని చైనా తెలిపింది. విదేశీయులు బీజింగ్‌కు వెళ్లొచ్చని, ఎలాంటి ప్రమాదమూ, రిస్క్ లేదని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. “ఉత్తరార్ధగోళంలో శీతాకాలంలో సాధారణంగా శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు గరిష్ట స్థాయిలో ఉంటాయి. కానీ అంతకుముందు సంవత్సరంతో పోల్చితే ఈ ఏడాది చైనాలో ఇన్ఫ్లుఎంజా A, ఇతర శ్వాసకోశ సంబంధిత వ్యాధులు తక్కువ స్థాయిలో వ్యాప్తి చెందాయి” అని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మావో నింగ్ చెప్పారు. “చైనాలోని పౌరులు, విదేశీయుల ఆరోగ్యం గురించి చైనా ప్రభుత్వం శ్రద్ధ వహిస్తుందని నేను మీకు హామీ ఇస్తున్నాను. చైనాలో ప్రయాణించడం సురక్షితమే” అని తెలిపారు.రీసెంట్ గా చైనాలో వెలుగులోకి వచ్చిన హ్యూమన్ మెటాప్ న్యూమో వైరస్ అనే వైరస్.. ఇప్పుడు ఇతర దేశాలనూ వణికిస్తోంది. సోషల్ మీడియాలోనూ ఈ వైరస్ కు సంబంధించిన పోస్టులు, వైరల్ అయ్యాయి. అనేక వీడియోల్లో ఆస్పత్రులు పేషెంట్స్ తో కిక్కిరిసినట్టు కనిపించాయి. ముఖానికి మాస్క్ లతో జనాలు కుప్పలు కుప్పలుగా కనిపించాయి. ఇవి నెటిజన్లతో పాటు ఇతరులకూ భయాందోళనలకు గురిచేశాయి, ఆల్రెడీ కొవిడ్ తో నానా అవస్థలు పడిన జనం… మళ్లీ ఆ రోజులు వస్తాయా అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరోనాతో కోల్పోయిన తమ బంధువులు, స్నేహితులను తలచుకుని.. లాక్ డౌన్ వంటి పరిస్థితుల్ని తలచుకుని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇక శీతాకాలంలో శ్వాసకోశ వ్యాధుల నివారణ,  నియంత్రణకు సంబంధించి నేషనల్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ చైనా జారీ చేసిన మార్గదర్శకాలను కూడా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రస్తావించింది. చైనాలో మెటాప్న్యూమోవైరస్ వ్యాప్తి గురించి ఆరోగ్య సేవల డైరెక్టర్ జనరల్  డాక్టర్ అతుల్ గోయల్ సమాచారాన్ని అందించారు. ఇది తీవ్రంగా ఉన్నప్పటికీ, భయపడాల్సిన అవసరం లేదని అన్నారు. “ఇది పెద్ద ఆందోళనకు కారణమని మేం నమ్మం. ఎందుకంటే ఇది జలుబు వంటి లక్షణాలను కలిగించే సాధారణ శ్వాసకోశ వైరస్. కొన్ని సందర్భాల్లో, ఫ్లూ లాంటి లక్షణాలను కలిగిస్తుంది. ముఖ్యంగా వృద్ధులు, ఒక సంవత్సరం కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలలో ఈ లక్షణాలు కనిపించవచ్చు” అని డాక్టర్ గోయల్ వివరించారు. “కానీ అందరూ అనుకుంటున్నట్టు ఇది అంత అత్యంత తీవ్రమైన వ్యాధి, అనారోగ్యం కాదు. ఎవరూ దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. చలికాలంలో సాధారణంగానే శ్వాసకోశ వైరస్ ఇన్ఫెక్షన్లు పెరుగుతాయి. ఆస్పత్రుల్లో ఇప్పటికే ఇందుకు కావల్సిన పడకలు, సౌకర్యాలు చేశాం. దీనికి నిర్దిష్ట యాంటీవైరల్ మందులు అవసరం లేదు. ఈ వైరస్‌కు నిర్దిష్ట మందులు కూడా లేవు” అని అతుల్ చెప్పారు.
Read:Dil Raju:దిల్ రాజు.. సయోధ్య యత్నాలు

Related posts

Leave a Comment