New Delhi:బడ్జెట్ కసరత్తు షురూ:ఫిబ్రవరి ఒకటోతేదీన కేంద్ర బడ్జెట్లో వేతన జీవులకు గుడ్‌న్యూస్ వస్తుందా? ఇప్పుడే ఢిల్లీ నుంచి మన గల్లీదాకా ఇదే ఇంట్రస్టింగ్ న్యూస్ ఇదే. మధ్యతరగతిపై ధరలభారాన్ని తగ్గించి, వినిమయాన్ని పెంచేందుకు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కసరత్తు చేస్తున్నారు.
బడ్జెట్ కసరత్తు షురూ..
న్యూఢిల్లీ, జనవరి 30
ఫిబ్రవరి ఒకటోతేదీన కేంద్ర బడ్జెట్లో వేతన జీవులకు గుడ్‌న్యూస్ వస్తుందా? ఇప్పుడే ఢిల్లీ నుంచి మన గల్లీదాకా ఇదే ఇంట్రస్టింగ్ న్యూస్ ఇదే. మధ్యతరగతిపై ధరలభారాన్ని తగ్గించి, వినిమయాన్ని పెంచేందుకు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కసరత్తు చేస్తున్నారు. ఏడాది మీ వేతన సంపాదన 10లక్షల వరకు ఉంటే మీరు ఇన్కమ్ ట్యాక్స్ పరిధిలోకి రాకపోవచ్చు. అదే సందర్భంలో వార్షికాదాయం 15 నుంచి 20 లక్షల రూపాయలు ఉన్నవారికి 25 శాతం ట్యాక్స్ విధించే యోచన కూడా చేస్తున్నారు. ఈ రెండు నిర్ణయాలను బడ్జెట్లో ప్రకటిస్తే, సర్కారీ ఖజానాపై 50వేల కోట్ల నుంచి నుంచి లక్ష కోట్ల రూపాయల భారం పడుతుందని లెక్కలు కూడా తీశారు. మొత్తానికి కొత్త ఇన్కమ్ ట్యాక్స్ విధానాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుతారకైతే ఏడాదికి ఏడు లక్షల రూపాయల వరకు ఆదాయం ఉన్నవారు ట్యాక్స్ పరిధిలోకి రారు. ఈ పరిమితిని 10 లక్షల రూపాయల పెంచే సాధ్యాసాధ్యాలను లెక్కలమంత్రి అన్వేషిస్తున్నారు.దేశంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఫిబ్రవరి 1న బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమర్పించనున్నారు. బడ్జెట్ సమయంలో, ప్రజలు స్టాక్ మార్కెట్‌పై కూడా నిఘా ఉంచారు. మన కేంద్రబడ్జెట్.. ఎన్నో ఆశలు.. మరెన్నో అంచనాలు.. ఇంకెన్నో సంకేతాలతో బడ్జెట్ 2025 రాబోతోంది. ఏ రంగానికి ఎంత కేటాయిస్తారో ఇప్పటికే నిపుణులు ఓ అంచనాకొస్తున్నారు. ఈ బడ్జెట్లో ప్రభుత్వం చాలా ముఖ్యమైన మార్పుల దిశగా పయనించవచ్చని తెలుస్తోంది.సంవత్సరంలో అడుగుపెట్టిన తర్వాత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు ముహుర్తం ఫిక్సైంది. రెండు విడతల్లో ఈ సమావేశాలు జరగనున్నాయి. మొదటి విడత సమావేశాలు జనవరి 31 నుంచి ఫిబ్రవరి 13 వరకు కొనసాగనున్నాయి. రెండో విడత సమావేశాలను దాదాపు నెల రోజుల విరామం తర్వాత మార్చి 10 నుంచి ఏప్రిల్ 4 వరకు నిర్వహించనున్నారు.మొదటి విడత సమావేశాల తొలిరోజు జనవరి 31న లోక్‌సభ, రాజ్యసభ ఉమ్మడి సమావేశాన్ని ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసంగిస్తారు. ఇక ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. 2025-26కు సంబంధించి కేంద్ర వార్షిక బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెడతారు. నిర్మల సీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం వరుసగా ఇది 8వసారి.
ప్రధాని నరేంద్రమోదీ సారథ్యంలో ఎన్డీయే సర్కారు మూడోసారి అధికారంలోకి వచ్చాక ప్రవేశపెడుతున్న పూర్తి స్థాయి బడ్జెట్ ఇదే కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ బడ్జెట్‌పై కేంద్రం ఇప్పటికే కసరత్తు పూర్తి చేసినట్లు తెలుస్తోంది.పార్లమెంట్ సెషన్ మధ్యలోనే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు, ఫలితాలు వెలువడనుండటంతో ఈ సమావేశాలపై మరింత ఆసక్తి నెలకొంది. ఫిబ్రవరి 5న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా, బడ్జెట్లో ఢిల్లీ కేంద్రంగా ఎలాంటి ప్రకటనలు చేయకూడదని.. ఎన్నికల సంఘం కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇక ఈ ఏడాది కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో వాటికి పెద్దపీఠ వేసే అవకాశం ఉంది. ఈ ఏడాది చివరలో బీహార్ ఎన్నికలు జరగనున్నందున, రెండు మిత్రపక్షాలు జనతాదళ్, లోక్ జనశక్తి పార్టీ రెండూ రాష్ట్రానికి కీలకమైన ప్రకటనల కోసం ఆశిస్తున్నాయి. అలాగే.. బడ్జెట్‌పై ఆశలు పెట్టుకున్న వేతన జీవులు, రైతులు, కార్మికులు.. కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెబుతుందని ఎదురుచూస్తున్నారు. ఇన్ కమ్ ట్యాక్స్ పరిమితి పరిధిని కూడా కేంద్ర ప్రభుత్వం పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.ముఖ్యంగా వ్యవసాయరంగానికి పెద్దపీట వేస్తారన్న చర్చ జరుగుతోంది. ఈ సందర్భంగా రైతుల నుంచి కొన్ని డిమాండ్లు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఎంఎస్పీపై కేంద్రం ఈదఫా బడ్జెట్లో తీపికబురు చెబుతుందన్న ఆశతో రైతాంగం ఉంది. ఈసారి కేంద్రబడ్జెట్ రైతుసంక్షేమంగా ఉండొచ్చని విశ్లేషణలు వస్తున్నాయి. ఈనేపధ్యంలో బడ్జెట్ పై ఎన్నో ఆశలు పెట్టుకుంది రైతాంగం. అన్నదాత ఆదాయాన్ని పెంచడంతో పాటు అనేక కీలకాంశాలు బడ్జెట్లో ఉండబోతున్నాయని తెలుస్తోంది.జనాభాలో 45 శాతం కంటే ఎక్కువ మంది వ్యవసాయ రంగంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. అయితే ఇది GDPకి 15 శాతానికి పైగా మాత్రమే దోహదపడుతుంది. ఇందులో వ్యవసాయ వాటా పెంపునకు సంబంధించిన ప్రధాన ప్రకటనలు వెలువడే అవకాశం ఉంది. ఇటీవల, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా రైతుల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఇందులో రైతులు తమ డిమాండ్లను ముందుకు తెచ్చారు. ఆర్థిక సర్వే 2023-24 ప్రకారం.. స్థిరమైన ధరల ఆధారంగా భారత వ్యవసాయ రంగం గత ఐదేళ్లలో ఏటా సగటున 4.18 శాతం వృద్ధిని సాధించింది.మరోవైపు దేశంలో రైతులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు.
ముఖ్యంగా ఎస్ఎంపీ కనీస మద్దతు ధరకోసం పంజాబ్, హర్యానా సరహిద్దుల్లో వేలాదిమంది రైతులు నిత్యం నిరసనలు జరుపుతున్న పరిస్థితి. ప్రభుత్వం కనీస మద్దతు ధరకి చట్టబద్ధమైన హామీ ఇవ్వాలని రైతులు కొంతకాలంగా డిమాండ్ చేస్తున్నారు. బడ్జెట్ నేపద్యంలో అందరి దృష్టి ఇప్పుడు MSPపైనే ఉంది. అలాగే రానున్న బడ్జెట్‌పై రైతుల్లో కూడా ఆశలు ఉన్నాయి. తక్కువ వడ్డీకే రుణాలు అందజేయాలని రైతులు కోరుతున్నారు. అంతే కాకుండా పీఎం కిసాన్ సమ్మాన్ నిధిని రెట్టింపు చేసి పన్నులు తగ్గించాలని కోరుతున్నారు. మార్కెట్ సంస్కరణల ద్వారా రైతుల స్థితిగతులను మెరుగుపరచడంపై దృష్టి పెట్టాలని… కేంద్ర బడ్జెట్లో దేశంలోని రైతులు తమ డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలని కోరుతున్నారు.రైతు డిమాండ్లపై కేంద్రం ఇప్పటికే దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది. కిసాన్ క్రెడిట్ కార్డ్ రుణ పరిమితికి సంబంధించికూడా గుడ్‌న్యూస్ కేంద్రం చెప్పనుందని టాక్. కిసాన్ క్రెడిట్ కార్డ్ ద్వారా అందించే రుణ పరిమితిని రూ.5లక్షలకు పెంచే అవకాశం ఉంది., రైతులకు ఆపన్న హస్తంగా ఉంటోంది కిసాన్ క్రెడిట్ కార్డ్ . ఈ కార్డు ద్వారా రైతులకు రుణాన్ని పలు దఫాలుగా ఇస్తారు. ప్రస్తుతం ఈ పరిమితి రూ.3 లక్షలుగా ఉంది. అయితే రాబోయే బడ్జెట్ లో ఈ లిమిట్ ను మరో 2 లక్షలు పెంచి మొత్తం 5 లక్షలుగా నిర్ణయించే ఆలోచనలు చేస్తున్నట్టు సమాచారం. ఇది రైతులకు చాలా ఉపయోగపడనుంది. మరీ ముఖ్యంగా చిన్న, సన్నకారు రైతులకు ఎంతో సహాయపడుతుంది. దీని ద్వారా గ్రామాల ఆర్థిక వ్యవస్థలోనూ అభివృద్ధి పెరుగుతుంది.వ్యవసాయరంగం అభివృద్ధికి ప్రభుత్వం గత ఏడాది కంటే 15 శాతం అధికంగా రూ.1.75 లక్షల కోట్లు కేటాయించవచ్చని అంచనా. దేశంలో వ్యవసాయోత్పత్తుల సరఫరాను పెంచడంతో పాటు ఎగుమతులపై ఎక్కువ ప్రాధాన్యతను బడ్జెట్ లో ఆలోచించవచ్చు. 2030 నాటికి కేంద్ర ప్రభుత్వం ఈ వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులను 50 బిలియన్ డాలర్ల నుంచి 80 బిలియన్ డాలర్లకు పెంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.ఇక వేతనజీవులూ.. మీకోసమే ఈ వార్త. కేంద్ర బడ్జెట్ అనగానే, మనకేమీ ఉండదని రొటీన్‌గా అనుకోకండి. ఏమో గుర్రం ఎగరావచ్చు అనుకోండి. ఎందుకంటే, ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్, ధమాకా న్యూస్ రెడీ చేస్తున్నారు. బడ్జెట్‌కు ముందే హల్వా టేస్ట్.. మనం కూడా చూడొచ్చని ఢిల్లీ నుంచి కథనాలు గుప్పుమంటున్నాయి.వాస్తవానికి ఎన్నికలు ముగిసిన తర్వాత ప్రవేశపెట్టే బడ్జెట్లలో మధ్యతరగతికి ఇన్‌కమ్‌ట్యాక్స్ విషయంలో పెద్దగా గుడ్‌న్యూస్‌లు ఉండవు. కానీ దేశంలో ప్రస్తుతం ధరలు పెరుగుతున్నాయి. మధ్యతరగతి ప్రజలు ఆదాయం కూడా పెద్దగా పెరగడం లేదు. ప్రజల్లో ఉన్న ఈ అసంతృప్తిని చల్లార్చేందుకు, మార్కెట్లో డిమాండ్‌ను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ దిశగా కసరత్తులు చేస్తున్నట్లు గట్టిగానే ప్రచారం జరుగుతోంది. అయితే ఫిబ్రవరి ఒకటి విడుదల ఎలా ఉంటుందన్నది ఇప్పుడు అసలు పాయింట్..!