New Delhi:న్యూఢిల్లీ అంబేద్కర్ ఆడిటోరియం లో జరిగిన బిసి మేధావుల సదస్సు:జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు రాజ్యసభ ఎంపీ ఆర్. కృష్ణయ్య, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు గవ్వల భరత్ కుమార్, ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టాలి బీసీలకు 50 శాతం రాజకీయ రిజర్వేషన్లు మరియు పార్లమెంట్లో మహిళా బిల్లు పెట్టాలి, బీసీ మహిళలకు సబ్ కోటా కల్పించాలి జన గణ లో బీసీ కులగన జరిపించాలి కేంద్రంలో ఓబీసీలకు మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి
న్యూఢిల్లీ అంబేద్కర్ ఆడిటోరియం లో జరిగిన బిసి మేధావుల సదస్సు
జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు రాజ్యసభ ఎంపీ ఆర్. కృష్ణయ్య, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు గవ్వల భరత్ కుమార్, ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టాలి బీసీలకు 50 శాతం రాజకీయ రిజర్వేషన్లు మరియు పార్లమెంట్లో మహిళా బిల్లు పెట్టాలి, బీసీ మహిళలకు సబ్ కోటా కల్పించాలి జన గణ లో బీసీ కులగన జరిపించాలి కేంద్రంలో ఓబీసీలకు మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లు రిజర్వేషన్ కల్పించాలి, బీసీ మేధావుల సదస్సుకు ముఖ్య అతిథులు పాల్గొన్న రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య. బీద మస్తాన్ రావు, కర్నూల్ పార్లమెంట్ సభ్యుడు నాగరాజు, రాజ్యసభ సభ్యుడు వద్ది రవిచంద్ర, విజయనగరం ఎంపీ అప్పలనాయుడు పాల్గొన్నారు.
67. 10 వ తరగతిలో మంచి ఫలితాలు సాధించాలి:విద్యార్థులు శ్రద్ధతో చదివి పదవ తరగతిలో మంచి ఫలితాలు సాధించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి విద్యార్థులకు సూచించారు.
కలెక్టర్ పమేలా సత్పతి
కరీంనగర్ :అల్పాహారం పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
విద్యార్థులు శ్రద్ధతో చదివి పదవ తరగతిలో మంచి ఫలితాలు సాధించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి విద్యార్థులకు సూచించారు.
బాలాజీ అన్నపూర్ణ సేవా సమితి ఆధ్వర్యంలో సప్తగిరి కాలనీలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదివే పదవ తరగతి విద్యార్థులకు అల్పాహార పంపిణీ కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ. బాలాజీ సేవాసమితి ఆధ్వర్యంలో కరీంనగర్ లోని 20 ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 700 మంది పదవ తరగతి విద్యార్థులకు అల్పాహారం పంపిణీ చేస్తున్నారని తెలిపారు. ఈ సంస్థ సేవలు అభినందనీయమని అన్నారు. సమయాభావం వల్ల పదో తరగతి విద్యార్థులు ఇంటి నుండి ఏమీ తినకుండా పాఠశాలకు వస్తారని, ఈ అల్పాహారం తీసుకోవడం వల్ల వారు చదువుపై ఎక్కువ శ్రద్ధ పెట్టే అవకాశం ఉందని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇలాంటి వినూత్న కార్యక్రమాలు చేపట్టడం వల్ల తల్లిదండ్రులకు నమ్మకం పెరిగిందని తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరంలోనూ ఈ సేవలు విస్తరింప చేయాలని సేవాసమితి సభ్యులను కోరారు. అనంతరం విద్యార్థులతో కలిసి కలెక్టర్ అల్పాహారం తిన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి జనార్దన్ రావు, క్వాలిటీ కోఆర్డినేటర్ అశోక్ రెడ్డి, ప్రధానోపాధ్యాయులు రాజేందర్, బాలాజీ సేవా సమితి అధ్యక్షులు ప్రసాద్ పాల్గొన్నారు.
Read more:Hyderabad:బడ్జెట్ లో విద్యారంగానికి 15% నిధులు కేటాయించాలి