New Delhi:ఢిల్లీ సీఎం ఎవరు:నెంబర్ వన్ పర్వేష్ సింగ్ వర్మ. ఢిల్లీ సీఎం రేసులో ఈయన పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఢిల్లీ మాజీ సీఎం సాహిబ్ సింగ్ వర్మ కుమారుడు పర్వేష్ వర్మ. ఆయన వరుసగా రెండు సార్లు పశ్చిమ ఢిల్లీ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. 2019 ఎన్నికల్లో ఆయన 5.78 లక్షల ఓట్ల ఆధిక్యతతో గెలిచారు.
ఢిల్లీ సీఎం ఎవరు..
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 10
నెంబర్ వన్ పర్వేష్ సింగ్ వర్మ. ఢిల్లీ సీఎం రేసులో ఈయన పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఢిల్లీ మాజీ సీఎం సాహిబ్ సింగ్ వర్మ కుమారుడు పర్వేష్ వర్మ. ఆయన వరుసగా రెండు సార్లు పశ్చిమ ఢిల్లీ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. 2019 ఎన్నికల్లో ఆయన 5.78 లక్షల ఓట్ల ఆధిక్యతతో గెలిచారు. ఇది ఢిల్లీ చరిత్రలో అతిపెద్ద విజయం. ఈసారి న్యూఢిల్లీ అసెంబ్లీ సీటులో మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను 4,099 ఓట్ల తేడాతో ఓడించి జెయింట్ కిల్లర్‌గా నిలిచారు పర్వేష్ వర్మ. ఇక పర్వేష్‌కు బాల్యం నుంచి RSSతో అనుబంధం ఉంది. ఇప్పటివరకు జరిగిన అన్ని ఎన్నికల్లోనూ ఆయన విజయం సాధించారు. జాట్ సామాజిక వర్గానికి చెందిన పర్వేష్ వర్మను ముఖ్యమంత్రిని చేయడం ద్వారా రైతు ఉద్యమాన్ని నీరుగార్చేందుకు బీజేపీ ప్రయత్నించవచ్చనే వాదన వినిపిస్తోంది. ఇక పశ్చిమ యూపీ, హర్యానా, పంజాబ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో అత్యంత బలమైన జాట్ సామాజిక వర్గానికి చెందిన నేత పర్వేష్. ఈయనను సీఎం చేస్తే…ఆయా రాష్ట్రాల్లోని జాట్ సామాజిక వర్గాన్ని బీజేపీ తనవైపునకు తిప్పుకునే చాన్స్ ఉంటుంది. ఇక గెలిచిన వెంటనే అమిత్ షాను కలిసి ఆశీస్సులు తీసుకున్నారు పర్వేష్. ఇది కూడా ఆయనకు కలిసివచ్చే అంశమే.ఢిల్లీ సీఎం రేసులో వినిపిస్తున్న రెండో పేరు సతీష్ ఉపాధ్యాయ్. ఢిల్లీ బీజేపీ ప్రెసిడెంట్‌గా చేసిన అనుభవం ఈయనకు ఉంది.
ఈయన బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన నేత. ప్రస్తుతం ఎన్డీఎంసి వైస్ చైర్మన్‌గా ఉన్నారు. పరిపాలనా అనుభవం కూడా ఉంది. పార్టీలో అనేక బాధ్యతలు నిర్వహించారు. ఆర్ఎస్ఎస్తో బలమైన అనుబంధం ఉంది. ఢిల్లీలో 12 నుంచి 14 శాతం బ్రాహ్మణులు ఉంటారు కాబట్టి…ఈయన పేరు కూడా అధిష్టానం పరిశీలనలో ఉంది.ఇక ఈ రేసులో వినిపిస్తున్న మూడో పేరు ఆశీష్ సూద్. ప్రస్తుతం ఢిల్లీలో బీజేపీకి పంజాబీ ఫేస్ ఈయన. పార్టీలో పంజాబీలకు ఈయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పార్టీ జనరల్ సెక్రటరీగా పనిచేశారు. ప్రస్తుతం గోవా ఇన్చార్జ్, జమ్మూ కాశ్మీర్ సహ-ఇన్చార్జ్గా ఉన్నారు. కేంద్ర నాయకులతో సన్నిహిత సంబంధాలున్నాయి. ఢిల్లీ యూనివర్సిటీలో విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా కూడా పనిచేశారురేసులో నెంబర్ 4…జితేంద్ర మహాజన్. వైశ్య సామాజికవర్గానికి చెందిన నేత. ఈయనకు RSSతో సత్సంబంధాలున్నాయి.ఇక ఈ రేసులో వినిపిస్తున్న ఐదో పేరు విజేందర్ గుప్తాది. వైశ్య సామాజిక వర్గానికి చెందిన ఈయన, ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ హవా ఉన్నప్పటికీ, ఈయన గెలిచారు.ఇక ఢిల్లీ సీఎం రేసులో మంజీందర్ సింగ్ సిర్సా పేరు కూడా వినిపిస్తోంది. 2013, 2017 అసెంబ్లీ ఎన్నికల్లో శిరోమణి అకాలీదళ్ టికెట్‌పై విజయం సాధించారు. తర్వాత రాజౌరి గార్డెన్ నుండి మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన 2021లో శిరోమణి అకాలీదళ్‌ను వీడి బీజేపీలో చేరారు. ఢిల్లీలోని సిక్కు సమాజానికి అండగా నిలిచారు. మంజీందర్ సింగ్ సిర్సాకు సీఎంగా అవకాశం ఇస్తే…పంజాబ్‌లో పార్టీని బలోపేతం చేసేందుకు బీజేపీకి అవకాశం దక్కుతుంది. వీరిలో ఎవరికి అవకాశం దక్కుతుందో చూడాలి.