New Delhi:ఢిల్లీలో మరోసారి భూకంపం

earthquake has struck the national capital Delhi

New Delhi:ఢిల్లీలో మరోసారి భూకంపం:దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి భూకంపం సంభవించింది. సోమవారం తెల్లవారుజామున 5.36 గంటల ప్రాంతంలో ఢిల్లీ, పరిసర ప్రాంతాల్లో, గురుగ్రామ్, యూపీలోని నోయిడాలో పలుచోట్ల భూమి కంపించింది.

ఢిల్లీలో మరోసారి భూకంపం

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 17
దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి భూకంపం సంభవించింది. సోమవారం తెల్లవారుజామున 5.36 గంటల ప్రాంతంలో ఢిల్లీ, పరిసర ప్రాంతాల్లో, గురుగ్రామ్, యూపీలోని నోయిడాలో పలుచోట్ల భూమి కంపించింది. దాంతో ఢిల్లీ ప్రజలు నిద్ర నుంచి ఉలిక్కిపడి లేచారు. భూకంపాన్ని గమనించిన ప్రజలు ప్రాణ భయంతో ఇళ్ల నుంచి భయటకు పరుగులు తీశారని అధికారులు తెలిపారు. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4గా నమోదైనట్లు వెల్లడించారు. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపిన వివరాల ప్రకారం న్యూఢిల్లీ కేంద్రంగా 5 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉంది. ఢిల్లీ, రాజధాని పరిసర ప్రాంతాల్లో తెల్లవారుజామున సంభవించిన భూకంపంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఢిల్లీ సహా ఉత్తరాది రాష్ట్రాల్లో స్వల్పంగా భూమి కంపించిందని, భయాందోళనకు గురికాకుండా ప్రశాంతంగా ఉండాలని ప్రధాని సూచించారు. మరోసారి భూ ప్రకంపనలు వచ్చే అవకాశం ఉందని, ఢిల్లీ సహా పరిసర ఉత్తరాది రాష్ట్రాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.
Read more:Andhra Pradesh:ఆర్టీఐ చట్టంతో బ్లాక్ మెయిల్

Related posts

Leave a Comment