Nellore:సింహపురిలో కాకాణి వర్సెస్ సోమిరెడ్డి

Simhapuri Kakani vs. Somireddy

మాజీ మంత్రులు కాకాణి గోవర్ధన్ రెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి మధ్య పొలిటికల్‌ ఫైట్‌ ప్రతీ రోజు క్లైమాక్స్‌ రేంజ్‌లోనే ఉంటోంది. ఒక ఇష్యూ పోతే మరో ఇష్యూ. ఏదో ఒక టాపిక్‌తో రాజకీయ రగడను రాజేస్తూనే ఉన్నారు.

సింహపురిలో
కాకాణి వర్సెస్ సోమిరెడ్డి

నెల్లూరు, డిసెంబర్ 31
మాజీ మంత్రులు కాకాణి గోవర్ధన్ రెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి మధ్య పొలిటికల్‌ ఫైట్‌ ప్రతీ రోజు క్లైమాక్స్‌ రేంజ్‌లోనే ఉంటోంది. ఒక ఇష్యూ పోతే మరో ఇష్యూ. ఏదో ఒక టాపిక్‌తో రాజకీయ రగడను రాజేస్తూనే ఉన్నారు. సబ్జెక్ట్..నియోజకవర్గానికి చెందిందా..రాష్ట్రస్థాయి అంశమా..ఇద్దరి పర్సనల్ టాపిక్సా..అంశమేదైనా డైలాగ్ వార్ మాత్రం తప్పదు. ఇద్దరి నాయకుల్లో ఎవరో ఒకరు మీడియా ముందుకు వచ్చేస్తారు. డైలాగ్‌లు పేల్చి వెళ్లిపోతారుకాకాణి కన్నా ముందుగా సోమిరెడ్డి మీడియా ముందుకు వస్తే..వెంటనే నేనున్నానంటూ కాకాణి సీన్‌లోకి ఎంటర్ అయిపోతారు. అదే కాకాణి గోవర్ధన్ రెడ్డి ముందుగా మీడియా ముందుకు వస్తే..మై హూనా అంటూ గట్టిగానే కౌంటర్ ఇచ్చేస్తారు సోమిరెడ్డి. వీరిద్దరి మాటల్లో వాస్తవం ఉందా.? లేదా.? అనేది పక్కన పెడితే మాటల యుద్ధం మాత్రం ఓ రేంజ్‌లో కంటిన్యూ అవుతూనే ఉంది. ఇలా దశాబ్దానికిపైగా వీరి మధ్య పొలిటికల్ వార్ కొనసాగుతోంది.గతంలో వీరిద్దరి మధ్య లిక్కర్, నకిలీ డాక్యుమెంట్స్, కోర్టు కేసులపై వివాదాలు, కృష్ణపట్నం పోర్టు కంటైనర్ టెర్మినల్, బెంగళూరు రేవ్ పార్టీ వంటి టాపిక్స్ పై మాటల యుద్ధం జరగ్గా..లేటెస్ట్‌గా ఎమ్మెల్యే సోమిరెడ్డిపై కాకాణి చేసిన అవినీతి ఆరోపణలు కాక రేపుతున్నాయి. అంతేకాదు రెండు రోజుల క్రితం కరెంటు చార్జీలపై వైసీపీ చేపట్టిన ఆందోళనలు..ఇద్దరి నేతల మధ్య మాటల యుద్ధానికి తెరతీశాయి.ఇరిగేషన్, మట్టి పనులు, ఉద్యోగుల బదిలీలలో ఎమ్మెల్యే సోమిరెడ్డి..ఎన్నో అవినీతి, అక్రమాలు చేశారని..ఓ ప్రముఖుడు సీఎం అపాయింట్మెంట్ ఇప్పించమని అడిగితే అతడ్ని గోల్డ్ లంచం అడిగాడని కాకాణి ఆరోపించారు.

సోమిరెడ్డి వాట్సాప్ కాల్ లిస్ట్ బయటపెడితే విషయాలన్నీ బయటకు వస్తాయంటున్నారు. అంతటితో ఆగని కాకాణి..అవినీతి అక్రమాలకు పాల్పడలేదని కాణిపాకంలో ప్రమాణం చేయాలని సోమిరెడ్డికి సవాల్ చేశారుకాణిపాకంలో ప్రమాణం చేయాలంటూ కాకాణి గోవర్ధన్‌రెడ్డి డిమాండ్ చేసి రెండు వారాలైనా సోమిరెడ్డి స్పందించలేదు. దీంతో సీఎం చంద్రబాబు అయినా సోమిరెడ్డి చేత కాణిపాకంలో ప్రమాణం చేయించాలని కాకాణి మరోసారి డిమాండ్ చేశారు. దీంతోపాటు పెరిగిన కరెంటు చార్జీలపై వైసీపీ శ్రేణులు చేసిన పోరుబాట సక్సెస్ అయిందని..చంద్రబాబు లాగా జగన్ అబద్ధాలు చెప్పి ఉంటే..జగన్‌ జీవితాంతం సీఎం ఛైర్‌లో ఉండేవారన్నారు కాకాణి.దీంతో వెంటనే ఎమ్మెల్యే సోమిరెడ్డి.. మీడియా ముందుకు వచ్చి కౌంటర్ చేశారు. కాకాణి తనపై చేసిన అవినీతి అక్రమాల ఆరోపణలపై పెద్దగా స్పందించని సోమిరెడ్డి..కరెంట్ చార్జీలపై వైసీపీ చేసిన నిరసనలకు ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. ఐదేళ్లలో జగన్ పదిసార్లు కరెంటు చార్జీలు పెంచారని మండిపడ్డారు. ఇక కాకాణి కామెంట్స్‌పై ప్రశ్నిస్తే..ఆయన ఆరోపణలు ఎప్పుడూ ఉండేవే కదా అన్నట్లుగా కొట్టి పారేశారు సోమిరెడ్డి.ఇలా సుదీర్ఘకాలంగా వీరి మధ్య జరుగుతున్న ఈ మాటల యుద్ధం, పొలిటికల్ వార్ చూస్తుంటే..ఈ ఇద్దరు నేతలు రాజకీయాల్లో ఉన్నంత వరకు ఫైట్‌ కొనసాగుతూనే ఉంటుందన్న టాక్ వినిపిస్తోంది. ఈ ఇద్దరి డైలాగ్‌ వార్‌తో సర్వేపల్లి రాజకీయం కూడా ఎప్పుడూ లైమ్‌ లైట్‌లో ఉంటూ వస్తోంది.

Read:Vijayawada:ఎమ్మెల్సీ అయ్యాకే నాగబాబుకు మంత్రి పదవి

Related posts

Leave a Comment