Nellore:పక్క దారి పడుతున్న కందిపప్పు

Nellore

పేదలకు అందాల్సిన కందిపప్పు పక్కదారి పడుతోంది. చాలా ప్రాంతాల్లో కందిపప్పు సరఫరా తక్కువ అవుతోంది. దీంతో డీలర్లు కొంతమందికే ఇచ్చి.. మిగతా పప్పును వ్యాపారులకు విక్రయిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దాదాపు 40 శాతం వరకు లబ్ధిదారులకు కందిపప్పు అందడం లేదని తెలుస్తోంది.సంక్రాంతి పండగ వేళ పేదలు కందిపప్పు కోసం ఎదురుచూస్తున్నారు. రాష్ట్రంలో ప్రతి నెలా కార్డుదారులకు ఇచ్చే సరఫరాలో కోత విధిస్తున్నారు.

పక్క దారి పడుతున్న కందిపప్పు

నెల్లూరు, జనవరి 8
పేదలకు అందాల్సిన కందిపప్పు పక్కదారి పడుతోంది. చాలా ప్రాంతాల్లో కందిపప్పు సరఫరా తక్కువ అవుతోంది. దీంతో డీలర్లు కొంతమందికే ఇచ్చి.. మిగతా పప్పును వ్యాపారులకు విక్రయిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దాదాపు 40 శాతం వరకు లబ్ధిదారులకు కందిపప్పు అందడం లేదని తెలుస్తోంది.సంక్రాంతి పండగ వేళ పేదలు కందిపప్పు కోసం ఎదురుచూస్తున్నారు. రాష్ట్రంలో ప్రతి నెలా కార్డుదారులకు ఇచ్చే సరఫరాలో కోత విధిస్తున్నారు. డిసెంబర్‌ నెలలో కూడా అరకొరగా పంపిణీ చేశారు. ఈ నెలలో అయినా అందరికీ ఇస్తారని అనుకున్నారు. కానీ పూర్తి స్థాయిలో కిందిపప్పు రాలేదు. కార్డుదారులకు ప్రతినెలా బియ్యంతో పాటు అరకిలో పంచదార, కిలో కందిపప్పు ఇవ్వాల్సి ఉంది. కానీ.. రేషన్ షాపుల ద్వారా అవి సక్రమంగా అందడం లేదు.బియ్యం, పంచదార అందరికీ ఇస్తున్నా.. 50 నుంచి 60 శాతం మందికి మాత్రమే కంది పప్పు అందిస్తున్నారు. దీంతో 40 శాతానికిపై లబ్ధిదారులకు కందిపప్పు దక్కడం లేదు. రేషన్‌ దుకాణాలు ద్వారా రాయితీపోనూ రూ.67కే కందిపప్పు వస్తుంది. దీంతో పేదలు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే నిత్యావసరాల ధరలు భారీగా పెరగడంతో.. కందిపప్పు ఇవ్వకపోతే ఎలా అని పేదలు ప్రశ్నిస్తున్నారు.రేషన్ షాపుల నిర్వాహకులు బియ్యంతోపాటు పంచదార, కందిపప్పు ఇవ్వాలి. కానీ చాల చోట్ల బియ్యం, చెక్కర మాత్రమే అందిస్తున్నారు. కొంత మందికి మాత్రమే కందిపప్పు అందించి.. ఇక పప్పు అయిపోయిందని చెబుతున్నారు. అలా నొక్కేసిన పప్పును బ్లాక్‌ మార్కెట్‌కు తరలించి సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలున్నాయిపేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆహార భద్రత కల్పించడానికి ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని రేషన్ షాపుల ద్వారా అనేక రకాల అవసరమైన సరుకులు అందజేస్తున్నారు. తెల్ల బియ్యం, గోధుమలు, ప్రోటీన్లు అధికంగా ఉండే కందిపప్పు, పంచదార, వంట నూనెను కూడా అందిస్తున్నారు. అప్పుడప్పుడు అవసరాలను బట్టి ఉప్పు, మిరపకాయలను పంపిణీ చేస్తున్నారు.అయితే.. కొన్ని చోట్ల కందిపప్పు సక్రమంగా పంపిణీ చేయడం లేదని, ఫిర్యాదులు వస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. అలాంటి వారిపై ప్రత్యేక నిఘా ఉంచామని స్పష్టం చేస్తున్నారు. షాపుల్లో తనిఖీలు చేసి చర్యలు తీసుకోవాలని లబ్ధిదారులు కోరుతున్నారు.
Read:Tirumala:రేపటి నుంచి వైకుంఠ ద్వారా దర్శనాలు

Related posts

Leave a Comment