రాష్ట్రంలో ఎస్సీ కుల సర్వేపై అభ్యంతరాలను డిసెంబర్ 31 వరకు స్వీకరించాలని ప్రభుత్వం అన్ని జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి కె. కన్నబాబు జీవోఎంఎస్ నెంబర్ 91 పేరుతో ఉత్తర్వులు జారీ చేశారు. జనవరి 10 తేదీన సర్వే తుది జాబితాను గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రచురిస్తారు.రాష్ట్రంలో షెడ్యూల్ కులాలకు సంబంధించి సోషల్ ఆడిట్ ఆఫ్ క్యాస్ట్ సర్వే జాబితాను ఇప్పటికే గ్రామ, వార్డు సచివాలయాల్లో పబ్లిష్ చేశారు.
ఎస్సీ కుల సర్వేపై అభ్యంతరాలు స్వీకరణ
నెల్లూరు, డిసెంబర్ 30
రాష్ట్రంలో ఎస్సీ కుల సర్వేపై అభ్యంతరాలను డిసెంబర్ 31 వరకు స్వీకరించాలని ప్రభుత్వం అన్ని జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి కె. కన్నబాబు జీవోఎంఎస్ నెంబర్ 91 పేరుతో ఉత్తర్వులు జారీ చేశారు. జనవరి 10 తేదీన సర్వే తుది జాబితాను గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రచురిస్తారు.రాష్ట్రంలో షెడ్యూల్ కులాలకు సంబంధించి సోషల్ ఆడిట్ ఆఫ్ క్యాస్ట్ సర్వే జాబితాను ఇప్పటికే గ్రామ, వార్డు సచివాలయాల్లో పబ్లిష్ చేశారు. అందులో ఎస్సీలకు సంబంధించి సామాజిక, ఆర్థిక, విద్య తదితర వివరాలను పేర్కొన్నారు. ఈ సర్వేపై ఎటువంటి అభ్యంతరాలు ఉన్నా గ్రామ, వార్డు సచివాలయాల్లో డిసెంబర్ 31 లోపు లిఖితపూర్వకంగా తెలపాల్సి ఉంటుంది. జనవరి ఆరో తేదీ వరకు ప్రజల నుంచి వచ్చిన అభ్యంతరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారు. జనవరి 10వ తేదీన అన్ని గ్రామ, వార్డు సచివాలయాల్లో తుది కులాల సర్వే డేటాను ప్రచురిస్తారు.గ్రామ, వార్డు సచివాలయంలో ప్రచురించిన డేటాలో పేరు, ఆధార్ నంబర్, పుట్టిన తేదీ, వయస్సు, ఉపకులం, మరుగుదొడ్డి సౌకర్యం, తాగునీటి సౌకర్యం, విద్యార్హత, వృత్తి, వ్యవసాయం ఇతర వివరాలు పొందుపరిచారు. ఈ డేటాపై ప్రజల నుంచి వచ్చిన అభ్యంతరాలను గ్రామ రెవెన్యూ అధికారి (వీఆర్వో), పంచాయతీ కార్యదర్శి (పీఎస్) క్షేత్రస్థాయిలో పరిశీలించి వివరాలను రెవెన్యూ ఇన్స్పెక్టర్ (ఆర్ఐ)కి నివేదిస్తారు.
వీటిని ఆర్ఐ పునఃపరిశీలించి తహశీల్దార్ (ఎంఆర్వో)కు పంపిస్తారు. ఆ తరువాత తహశీల్దార్ వీఆర్వో, ఆర్ఐల నివేదికలో వివరాలను పరిశీలించి, తుది ఆమోదం తెలిపి ఆ వివరాలను పోర్టల్‌లో పొందుపరుస్తారు.రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్‌డీవో) ఈ మొత్తం ప్రక్రియను పర్యవేక్షిస్తారు. అలాగే సాంకేతిక, ఫంక్షనల్ సపోర్టును అందిస్తారు. కుల సర్వే ఆడిట్ జరుగుతున్న సమయంలో సందర్శన కోసం టాస్క్‌ఫోర్స్‌ను నియమిస్తారు. ఈ ఆడిట్ పురోగతిపై సమీక్ష నిర్వహించి, అవసరమైన సూచనలు చేస్తారు. తుది జాబితాను గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రచురిస్తారు. దీనిపై ట్రైనింగ్, అవగాహన కల్పించేందుకు నియోజకవర్గ ప్రత్యేక అధికారిని జిల్లా కలెక్టర్ నియమిస్తారు. ఆయన సచివాలయాలను ర్యాండమ్‌గా తనిఖీ చేస్తారు.అనంతరం జిల్లా కలెక్టర్‌కు ఫీడ్‌బ్యాక్ అందిస్తారు. వివరాల్లో కచ్చితత్వాన్ని పెంపొందించేందుకు సహాయ సాంఘిక సంక్షేమ శాఖ అధికారుల (వెరిఫికేషన్ ఆఫీసర్)తో 50 మంది వివరాల్ని ర్యాండమ్‌గా తనిఖీ చేస్తారు. గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం డిపార్ట్‌మెంట్ సాఫ్ట్‌వేర్ మాడ్యూల్స్ వంటివాటిని ఏర్పాటు చేస్తుంది. డాస్‌బోర్డు, మొబైల్ యాప్, వెబ్ మాడ్యూల్ వంటి అందిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం 2024 సంవత్సరంలో జనవరి, ఫిబ్రవరి నెలల్లో నిర్వహించిన కుల సర్వే డేటా ప్రకారం సోషల్ ఆడిట్ ఆఫ్ క్యాస్ట్ సర్వే జరుగుతోంది. సర్వే నివేదిక వివరాలను పరిశీలించి నిర్ధారణ చేసుకోవాలి. అభ్యంతరాలుంటే లిఖితపూర్వకంగా తెలిపాల్సి ఉంటుంది.