NEET Counseling arrangements | నీట్ కౌన్సిలింగ్ ఏర్పాట్లు | Eeroju news

NEET Counseling arrangements

నీట్ కౌన్సిలింగ్ ఏర్పాట్లు

న్యూఢిల్లీ, జూలై 11 (న్యూస్ పల్స్)

NEET Counseling arrangements

నీట్ యూజీ కౌన్సిలింగ్ జులై మూడో వారంలో నిర్వహిస్తామని, తిరిగి పరీక్షను నిర్వహించలేమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు సుప్రీంకోర్టులో బుధవారం అఫిడ్‌విట్ దాఖలు చేసింది. నీట్‌లో అక్రమాలు, అవకతకలు జరిగినట్టు దాఖలైన పిటిషన్లపై సర్వోన్నత న్యాయస్థానం విచారణ చేపట్టిన మర్నాడే కేంద్రం తన నిర్ణయం వెల్లడించడం గమనార్హం. నీట్ యూజీ ప్రశ్నాపత్రం లీక్ అయిన విషయం వాస్తవమేనని, పరీక్ష సమగ్రతను దెబ్బతీశారని నిర్దారణ అయినా లేదా నేరం చేసిన వారిని గుర్తించలేకపోయినా తిరిగి తాము పరీక్ష నిర్వహణకు ఆదేశిస్తామని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

ఫలితాల సమగ్ర విశ్లేషణలో పెద్ద ఎత్తున అవకతవకలు జరగలేదని లేదా స్థానిక అభ్యర్థులు లబ్ధిపొందినట్లు ఆధారాలు లేవని కోర్టుకు సమర్పించిన అఫిడ్‌విట్‌లో కేంద్రం పేర్కొంది. మళ్లీ పరీక్ష నిర్వహించే ఉద్దేశం లేదని కూడా తన వైఖరిని పునరుద్ఘాటించింది. నిరాధారమైన అనుమానాల ఆధారంగా పరీక్షను రద్దుచేస్తే మే 5న పరీక్షకు హాజరైన దాదాపు 24 లక్షల మంది విద్యార్థులపై భారం పడుతుందని అభిప్రాయపడింది. నీట్-యూజీ కౌన్సెలింగ్ ప్రక్రియను జూలై మూడో వారం నుంచి నాలుగు దశల్లో ప్రారంభించాలని భావిస్తున్నట్లు కేంద్రం తెలిపింది.

ఏ అభ్యర్ధి అయినా అవకతవకలకు పాల్పడినట్లు తేలితే, వారి ప్రవేశాన్ని రద్దుచేస్తామని వివరించింది. అవకతవకలు, పేపర్ లీకేజీని దృష్టిలో ఉంచుకుని పరీక్షను మళ్లీ నిర్వహించాలని కొందరు పిటిషనర్లు డిమాండ్ చేయగా, మరికొందరు పరీక్షను రద్దుచేయవద్దని పిటిషన్ వేశారు. నీటీ యూజీ డేటాపై ఐఐటీ మద్రాస్ నిపుణులు సాంకేతిక విశ్లేషణను నిర్వహించారని, సామూహిక మాల్‌ప్రాక్టీస్ లేదా పెద్ద సంఖ్యలో అభ్యర్థులకు ప్రయోజనం చేకూర్చే సూచనలు కనిపించలేదని కేంద్రం తన అఫిడవిట్‌లో పేర్కొంది. విద్యార్థులు పొందిన మార్కులలో ప్రత్యేకంగా 550 నుంచి 720 వరకు పెరుగుదల ఉందని డేటా వెల్లడించింది. ఈ పెరుగుదలకు సిలబస్‌లో 25% తగ్గింపు కారణమని కేంద్రం వెల్లడించింది.

ఎక్కువ స్కోర్‌లు చేసినవారు మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడే అవకాశం చాలా తక్కువ ఉందనే సూచనలు ఉన్నాయని వివరించింది.నీట్‌లో అక్రమాలు జరిగాయా? లేదా? అనేది సాంకేతికత విశ్లేషణ ద్వారా తేల్చాలని ఐఐటీ మద్రాస్‌కు కోరినట్టు కేంద్రం తెలిపింది. కాగా, గతంలో సమర్పించిన అఫిడ్‌విట్‌లోనూ ఇదే అంశాలను కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. మరోవైపు, ఈ అంశంపై సీబీఐ విచారణ కూడా కొనసాగుతున్నట్టు అఫిడ్‌విట్‌లో తెలియజేసింది. మరోవైపు, లీక్ అయిన పేపర్‌ ఎంతమందికి చేరింది? ఎలా చేరింది? లీకేజీతో లబ్ధిపొందిన విద్యార్థులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ఎందరి ఫలితాలను విత్ హోల్డ్‌లో ఉంచారు? వీటికీ సమాధానాలు కావాలని.. వీటన్నింటిపైనా సమగ్ర దర్యాప్తు జరగాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

 

NEET Counseling arrangements

 

NEET PG online test on 11th August | ఆగస్టు 11న నీట్ పీజీ ఆన్ లైన్ టెస్ట్ | Eeroju news

Related posts

Leave a Comment