NDA Government has increased the minimum support price | కనీస  మద్దతు ధర పెంచేసిన ప్రభుత్వం | Eeroju news

NDA Government has increased the minimum support price

కనీస  మద్దతు ధర పెంచేసిన ప్రభుత్వం

ఢిల్లీ,

NDA Government has increased the minimum support price :

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం 14 ఖరీఫ్ పంటలపై కనీస మద్దతు ధర ఎంఎస్‌పి ని ఆమోదించింది. కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ, 2018 బడ్జెట్‌లో, ఉత్పత్తి ఖర్చు కంటే కనీసం 1.5 రెట్లు ఎం ఎస్ పి,  ఉండాలని ప్రభుత్వం చాలా స్పష్టమైన విధాన నిర్ణయం తీసుకుంది.
ఈసారి తీసుకున్న నిర్ణయంతో పోలిస్తే ప్రతి పంటకు కనీసం 50 శాతం ఎక్కువ ఎంఎస్‌పి ఉంటుంది. అని తెలిపారు.  తీసుకున్న నిర్ణయంతో రైతులకు దాదాపు రూ. 2 లక్షల కోట్ల ఎంఎస్‌పీ లభిస్తుందని, ఇది గత సీజన్‌తో పోలిస్తే రూ. 35,000 కోట్లు ఎక్కువ అని ఆయన తెలిపారు.
ఖరీఫ్‌లో 14 రకాల పంటలకు మద్దతు ధరను పెంచుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకోగా. వరికి మద్దతు ధరను రూ.117 పెంచింది. తాజా పెరుగుదలతో క్వింటాల్ ధాన్యం ధర రూ.2,300కు చేరుకుంది. పెంచిన ధరలను ఖరీఫ్ సీజన్ నుంచి అమలు చేస్తున్నట్లు కేంద్రప్రభుత్వం తెలిపింది. పత్తి, మొక్కజొన్న, రాగి, జొన్న సహా పద్నాలుగు రకాల పంటలకు మద్దతు ధరను ప్రభుత్వం పెంచింది. వరిపై ఎమ్మెస్పీని రూ.1,533 నుంచి రూ.2,300కి పెంచగా, జొన్నపై ఎంఎస్పీ రూ.2,247 నుంచి రూ.3,371కి పెరిగింది.

NDA Government has increased the minimum support price

 

మోడీ ప్రభుత్వం మైనార్టీలో ఉందనే ప్రచారం | Propaganda that Modi government is in minority | Eeroju news

 

Related posts

Leave a Comment