Narsampet:పేదవాడికి అండగా కాంగ్రెస్ ప్రభుత్వం

Congress government stands by the poor

నిరుపేదలకు అండగా కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని 19 వ వార్డ్ కౌన్సిలర్ పెండెం లక్ష్మీరామానంద్ అన్నారు.

పేదవాడికి అండగా కాంగ్రెస్ ప్రభుత్వం

నర్సంపేట
నిరుపేదలకు అండగా కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని 19 వ వార్డ్ కౌన్సిలర్ పెండెం లక్ష్మీరామానంద్ అన్నారు. శుక్రవారం పట్టణంలోని 19వ వార్డులో ప్రభుత్వం అందిస్తున్న ఆత్మీయ భరోసా పథకాలపై ఏర్పాటు చేసిన సమావేశంలో లక్ష్మీరామానంద్ మాట్లాడుతూ,తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 26 నుండి ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ పథకాల లబ్ధి జరుగుతుందన్నారు.ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ప్రజా సంక్షేమ పథకాలు అందిస్తుందని, ప్రతిపక్ష నాయకులు చేస్తూన్నటువంటి అసత్య ప్రచారాలకు ఎవ్వరు అధైర్యపడద్దని ,అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందుతాయి అని అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు 2 లక్షల వరకు రుణమాఫీ, 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, మహిళల ఉచిత ఆర్టీసీ ప్రయాణం, గ్యాస్ సిలిండర్లు 500లకే అందిస్తున్నామని, త్వరలోనే ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, పథకాలను కూడా అర్హులైన ప్రతి కుటుంబానికి అందిస్తామని అన్నారు.
ఈ కార్యక్రమంలో వార్డు ఆఫీసర్ స్రవంతి,ఆర్.పీ చింతల మౌనిక, టీపీఎస్ సంధ్యారాణి, మాజీ మార్కెట్ చైర్మన్ ఎర్ర యాకుబ్ రెడ్డి, మార్కెట్ డైరెక్టర్ కొల్లూరి మధుకర్, మాజీ వార్డు సభ్యులు పేరం బాబురావు, వార్డు యూత్ అధ్యక్షులు కొండి రాజేష్, కొలువుల స్వామి, అందే రంజిత్, కొలువుల పవన్, కొలువుల శివ, తదితరులు పాల్గొన్నారు.

Read:Amaravati:జాతీయ ఓటర్ల దినోత్సవ ప్రతిజ్ణ చేయించిన ముఖ్య కార్యదర్శి ఎంకె మీనా

Related posts

Leave a Comment