Nara Lokesh:టెపా ద్వారా యూరోపియన్ మార్కెట్ కు కనెక్ట్ చేయండి

State IT and Electronics Minister Nara Lokesh met Canton of Vaud State Councilor Christella Lucier Brodard at Davos Belvedere.

కాంటన్ ఆఫ్ వాడ్ స్టేట్ కౌన్సిలర్ క్రిస్టెల్లా లూసియర్ బ్రాడర్డ్ తో రాష్ట్ర ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ దావోస్ బెల్వేడేర్ లో భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ లోని కీలక రంగాల్లో స్విస్ కంపెనీలను ఆహ్వానించండానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది.

టెపా ద్వారా యూరోపియన్ మార్కెట్ కు కనెక్ట్ చేయండి

కాంటన్ ఆఫ్ వాడ్ స్టేట్ కౌన్సిలర్ క్రిస్టెల్లా తో మంత్రి లోకేష్ భేటీ

దావోస్:
కాంటన్ ఆఫ్ వాడ్ స్టేట్ కౌన్సిలర్ క్రిస్టెల్లా లూసియర్ బ్రాడర్డ్ తో రాష్ట్ర ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ దావోస్ బెల్వేడేర్ లో భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ లోని కీలక రంగాల్లో స్విస్ కంపెనీలను ఆహ్వానించండానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. స్విస్ నుంచి సాంకేతిక వస్త్రాలు, యంత్రాల తయారీ, హార్డ్ వేర్, ఎలక్ట్రానిక్స్, రైలు, రైలు విడిభాగాల తయారీ, ఫార్యా స్యుటికల్స్, వైద్య పరికరాల తయారీలో ఆర్ అండ్ డి హబ్ లు, విశ్వవిద్యాలయాల సహకారాన్ని కోరుకుంటున్నాం. ట్రేడ్ అండ్ ఎకనమిక్ పార్టనర్ షిప్ అగ్రిమెంట్ (TEPA) ద్వారా స్థానిక తయారీదారులు యూరోపియన్ మార్కెట్ కు కనెక్ట్ చేసేలా సహకారం అందించండి. ఇంజనీరింగ్, హెల్త్ సైన్సెస్, రెన్యువబుల్ ఎనర్జీ రంగంలో పరిశోధనలకు సహకరించాలని మంత్రి లోకేష్ కోరారు. క్రిస్టెల్లా మాట్లాడుతూ.. రూ.6.2 లక్షల కోట్ల స్తూల జాతీయోత్పత్తో స్విట్జర్లాండ్ జిడిపిలో మేం 11శాతం వాటా కలిగి ఉన్నాం. నెస్లే, ఫిలిప్ మోరీస్, మెడ్ ట్రానిక్స్, లాజి టెక్ ఇంటర్నేషనల్, డెబియోపామ్ ఇంటర్నేషనల్ వంటి కంపెనీలు మా ప్రాంతంలో గ్లోబల్ ప్లేయర్లుగా ఉన్నాయి. ఎపి కీలకరంగాల్లో స్విస్ కంపెనీల పెట్టుబడులకు మా వంతు సహకారాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు.

Read:Karimnagar:సిరిసిల్ల నేతన్నలకు బంపర్ ఆఫర్

Related posts

Leave a Comment