Nalgonda DCCB Chairman Gongadi Mahendra Reddy is in Congress account | కాంగ్రెస్ ఖాతాలోకి నల్గోండ డీసీసీబీ | Eeroju news

DCCB Chairman Gongadi Mahendra Reddy

కాంగ్రెస్ ఖాతాలోకి నల్గోండ డీసీసీబీ

నల్గోండ, జూన్ 29, (న్యూస్ పల్స్)

Nalgonda DCCB Chairman Gongadi Mahendra Reddy is in Congress account

ఉమ్మడి నల్గొండ జిల్లాలో బీఆర్‌ఎస్‌కు మరో షాక్‌ తగిలింది. డీసీసీబీ ఛైర్మన్‌ గొంగడి మహేందరెడ్డిపై పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. దీంతో ఆయన పదవి కోల్పోవడంతోపాటు డీసీసీబీ చైర్మన్ వ్యవహారంపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తమ పార్టీకి చెందిన వారికి ముఖ్య పదవులను కట్టేబట్టే ఆలోచనల్లో ఆ పార్టీ నేతలు అన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 11 మంది ఎమ్మెల్యేలు గెలుచుకున్న కాంగ్రెస్.. డీసీసీబీ పీఠంపై కన్నేసింది. 2021 ఫిబ్రవరిలో జరిగిన నసహకార సంఘాల ఎన్నికల్లో గెలిచి ఉమ్మడి నల్లగొండ జిల్లా సహకార బ్యాంకు (డిసిసిబి) ఛైర్మన్ పీఠాన్ని బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. చైర్మన్‎గా గొంగిడి మహేందర్ రెడ్డి ఎన్నికయ్యారు.

డీసీసీబీలో మొత్తం 21 మంది డైరెక్టర్లు ఉండాల్సి ఉండగా, ప్రస్తుతం 19 మందే ఉన్నారు. రిజర్వేషన్ల సభ్యులు లేకపోవడంతో మరో ఇద్దరిని నామినేట్ చేయలేదు. 19 మంది డైరెక్టర్లలో 18 మంది బీఆర్ఎస్ పార్టీకి చెందిన వారే. మునుగోడు పీఏసీఎస్ చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి మాత్రమే కాంగ్రెస్ పార్టీకి చెందిన డైరెక్టర్. ఈ పదవిని తన అనుచరుడికి కట్టబెట్టాలని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భావించారు. ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక 9 మంది డిసిసిబి డైరెక్టర్లు కాంగ్రెస్ పార్టీలో చేరారు. డీసీసీబీని తన ఖాతాలో వేసుకునేందుకు కాంగ్రెస్ పావులు కదిపింది. దీంతో ఈనెల 10వ తేదీన చైర్మన్ మహేందర్ రెడ్డిపై అవిశ్వాస తీర్మానానికి 14 మంది డైరెక్టర్లు నోటీసులు ఇచ్చారు.

డీసీసీబీ చైర్మన్ పదవిని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అనుచరుడు కుంభం శ్రీనివాస్ రెడ్డి ఆశిస్తున్నారు. 19 మందిలో 15 మంది డైరెక్టర్ల మద్దతు కూడగట్టిన శ్రీనివాస్ రెడ్డి క్యాంపుకు తీసుకెళ్లారు. డీసీసీబీ ప్రధాన కార్యాలయంలో జిల్లా సహకార శాఖ అధికారి కిరణ్ కుమార్ అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ నిర్వహించారు. 14 మంది డైరెక్టర్లు క్యాంపు నుంచి నేరుగా కార్యాలయానికి వచ్చారు. అవిశ్వాస తీర్మానంపై జరిగిన ఓటింగ్‎కు చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డితో పాటు మరో ముగ్గురు బిఆర్ఎస్ డైరెక్టర్లు సమావేశానికి హాజరు కాలేదు. ఈ అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా పదిమంది కాంగ్రెస్ డైరెక్టర్లతో పాటు బీఆర్ఎస్‎కు చెందిన ఐదుగురు డైరెక్టర్లు కూడా మద్దతు ఇచ్చారు.

దీంతో చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డిపై కాంగ్రెస్ పెట్టిన అవిశ్వాసం నెగ్గింది. దీంతో ఆయన డీసీసీబీ చైర్మన్ పదవిని కోల్పోయారు. చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డిపై అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో తాత్కాలిక చైర్మన్‎గా బాధ్యతలను వైస్ చైర్మన్ ఎసిరెడ్డి దయాకర్ రెడ్డి చేపట్టారు.డీసీసీబీ నూతన చైర్మన్ ఎన్నికను జూన్ 1న నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్నట్లు సహకార శాఖ అధికారి కిరణ్ కుమార్ తెలిపారు. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అనుచరుడు కుంభం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫున చైర్మన్ రేసులో ఉన్నారు. కుంభం శ్రీనివాస్ రెడ్డి నేతృత్వంలో 15 మంది డైరెక్టర్లను 17 రోజులుగా క్యాంపు నిర్వహించి నేరుగా ఓటింగ్ పిలుచుకుని వచ్చారు. జూలై 1న జరిగే ఎన్నికలో కుంభం శ్రీనివాస్ రెడ్డి చైర్మన్‎గా ఎన్నిక లాంచనం కానున్నట్లు తెలుస్తోంది. దీంతో నల్లగొండ డీసీసీబీ కాంగ్రెస్ ఖాతాలో వేసుకోనుంది.

 

DCCB Chairman Gongadi Mahendra Reddy

 

Congress net for BRS MLCs | బిఆర్ ఎస్ ఎమ్మెల్సీలకు కాంగ్రెస్ వల | Eeroju news

Related posts

Leave a Comment