Naga Chaitanya | కార్తీక్‌ దండు దర్శకత్వంలో నాగ చైతన్య హీరోగా మిథికల్ థ్రిల్లర్ డిసెంబరులో ప్రారంభం | Eeroju news

కార్తీక్‌ దండు దర్శకత్వంలో నాగ చైతన్య హీరోగా మిథికల్ థ్రిల్లర్ డిసెంబరులో ప్రారంభం

కార్తీక్‌ దండు దర్శకత్వంలో నాగ చైతన్య హీరోగా మిథికల్ థ్రిల్లర్ డిసెంబరులో ప్రారంభం

Naga Chaitanya

Naga Chaitanya new movie with Virupaksha director Karthik Dandu NC 22 officially announced on actor birthday | Naga Chaitanya: విరూపాక్ష దర్శకుడితో నాగ చైతన్య సినిమా... అఫీషియల్‌గా NC 22ను అనౌన్స్ ...సుకుమార్‌ రైటింగ్స్‌ అసోసియేషన్‌తో ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని నిర్మించనున్న ఎస్వీసీసీ సంస్థ
ప్రతిష్టాత్మక, భారీ చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్న సంస్థ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ((SVCC) సంస్థ మరో భారీ ప్రాజెక్ట్‌ను, ఆసక్తికరమైన చిత్రాన్ని నిర్మిస్తున్నట్లుగా ప్రకటించింది. ఈ చిత్రాన్ని మరో ప్రముఖ నిర్మాణ సంస్థ సుకుమార్‌ రైటింగ్స్‌ అసోసియేషన్‌తో నిర్మాణం చేస్తుంది ఎస్వీసీసీ సంస్థ. ఈ సంస్థలు సంయుక్తంగా గత ఏడాది సాయి దుర్గా తేజ్‌, సంయుక్త మీనన్‌లతో కార్తీక్‌ దండు దర్శకత్వంలో బ్లాక్‌బస్టర్‌ ‘మిస్టికల్‌ థ్రిల్లర్‌ ‘విరూపాక్ష’ చిత్రాన్ని నిర్మించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం బాక్సాఫీస్‌ దగ్గర సంచలనం సృష్టించడమే కాకుండా విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది.

ఇప్పుడు ‘విరూపాక్ష’ చిత్రంతో దర్శకుడిగా తన ప్రతిభను చాటి చెప్పిన కార్తీక్‌ దండు దర్శకత్వంలోనే ఈ తాజా చిత్రాన్ని భారీ చిత్రాల మేకర్‌ ప్రముఖ బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి బ్రిలియంట్‌ దర్శకుడు సుకుమార్‌ కూడా వన్‌ ఆఫ్‌ ద ప్రొడ్యూసర్‌గా ఉండటం ఈ సినిమాకు మరో ఆకర్షణ. కాగా ఈ చిత్రంలో వైవిధ్యమైన చిత్రాలతో ప్రామిసింగ్‌ కథానాయకుడిగా పేరున్న యువ సామ్రాట్‌ అక్కినేని నాగ చైతన్య హీరోగా నటిస్తున్నారు. శనివారం ఆయన
పుట్టినరోజు సందర్భంగా, ఆసక్తికరమైన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు.

ఈ పోస్టర్‌లో ఒక అద్భుతమైన కన్ను ప్రతీకతో పాటు, రాక్ క్లైంబింగ్ టూల్స్‌తో ఓ పర్వతంపై నిలబడి ఉన్న నాగ చైతన్య కనిపించారు. ఇది ప్రేక్షకులలో భారీ ఆసక్తిని రేకెత్తించింది. “NC24” అనే వర్కింగ్‌ టైటిల్‌తో, ఈ చిత్రం డిసెంబరులో షూటింగ్ ప్రారంభించుకోనుంది. భారీ బడ్జెట్‌తో, అత్యున్నత ప్రొడక్షన్ విలువలతో ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.

కార్తీక్ దండు ఈ ప్రాజెక్ట్ కోసం అత్యుత్తమ సాంకేతిక నిపుణులను ఎంపిక చేసుకున్నారు. ప్రత్యేకంగా, ఈ చిత్రానికి అధిక స్థాయిలో CG వర్క్ ఉండనుంది, ఇది ప్రేక్షకులకు అద్భుతమైన విజువల్‌ అనుభూతిని అందించేందుకు సహాయపడుతుంది. శ్యామ్‌ దత్‌ ISC సినిమాటోగ్రఫీ, నవీన్ నూలి ఎడిటింగ్‌కు బాధ్యతలు స్వీకరించగా, విరూపాక్ష చిత్రానికి అద్భుతమైన సెట్స్ రూపొందించిన ఆర్ట్ డైరెక్టర్ శ్రీ నాగేంద్ర కూడా ఈ చిత్రంలో భాగమవుతున్నారు. కాంతారా మరియు విరూపాక్ష సినిమాలతో ఆకట్టుకున్న అజనీష్ లోక్‌నాథ్ ఈ థ్రిల్లర్‌కు సంగీతం అందించనున్నారు.
చిత్రంలో నటీనటుల వివరాలు, ఇతర సమాచారం త్వరలో ప్రకటించనున్నారు.

కార్తీక్‌ దండు దర్శకత్వంలో నాగ చైతన్య హీరోగా మిథికల్ థ్రిల్లర్ డిసెంబరులో ప్రారంభం

‘Ka’ movie pre release event | కిరణ్ అబ్బవరం ఇన్స్ పైరింగ్ జర్నీకి నేను పెద్ద అభిమానిని – నాగచైతన్య | Eeroju news

Related posts

Leave a Comment