Mumbai:మార్చి 22 నుంచి ఐపీఎల్

IPL from March 22

Mumbai:మార్చి 22 నుంచి ఐపీఎల్:అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఐపీఎల్ 2025 షెడ్యూల్ వ‌చ్చేసింది. 2 నెలల‌కుపైగా జ‌రిగే ఈ మెగాటోర్నీ షెడ్యూల్ ను బీసీసీఐ అధికారికంగా రిలీజ్ చేసింది. మార్చి 22 నుంచి మే 25 వ‌ర‌కు ఈ టోర్నీ మ్యాచ్ లు జ‌రుగుతాయి.

మార్చి 22 నుంచి ఐపీఎల్

ముంబై, ఫిబ్రవరి 17
అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఐపీఎల్ 2025 షెడ్యూల్ వ‌చ్చేసింది. 2 నెలల‌కుపైగా జ‌రిగే ఈ మెగాటోర్నీ షెడ్యూల్ ను బీసీసీఐ అధికారికంగా రిలీజ్ చేసింది. మార్చి 22 నుంచి మే 25 వ‌ర‌కు ఈ టోర్నీ మ్యాచ్ లు జ‌రుగుతాయి. ఆరంభ మ్యాచ్ డిఫెండింగ్ చాంపియ‌న్ కోల్ కతా నైట్ రైడ‌ర్స్, రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జ‌ట్ల మ‌ధ్య జ‌రుగుతుంది. ఈసారి హైదరాబాద్ లో ఒక క్వాలిఫయర్, ఎలిమేనటర్ మ్యాచ్ జరుగుతుంది. గతేడాది జ‌రిగిన మెగా వేలంలో క‌న‌క‌వ‌ర్షం కురిపించి, త‌మ‌కు న‌చ్చిన ఆట‌గాళ్ల‌ను జ‌ట్టులోకి తీసుకున్నాయి ఫ్రాంచైజీలు. దీంతో ఈ సారి ఎలాగైనా టైటిల్ కొట్టాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నాయి. ఇప్ప‌టికే చెన్నై, గుజ‌రాత్ లాంటి జ‌ట్లు ట్రైనింగ్ సెష‌న్లు కండ‌క్ట్ చేశాయి. మ‌రికొన్ని అదే దారిలో ఉన్నాయి. ఐపీఎల్ సిస్ట‌ర్ లీగ్ డ‌బ్ల్యూపీఎల్ స్టార్టైనా క్ర‌మంలో అభిమానులు అంతా టీ20 మూడ్ లోకి వెళ్లిపోయారు. తమ అభిమాన ప్లేయ‌ర్లను ఎప్పుడెప్పుడు మైదానంలో చూస్తామా..? అని ఆరాట ప‌డుతున్నారు.తాజాగా షెడ్యూల్ కూడా విడుదల అవ‌డంతో అభిమానులు ఫుల్ యాక్టివ్ మోడ్ లోకి వ‌చ్చారు. త‌మ టీమ్ కు సంబంధించిన డేట్ల‌ను మెమ‌రైజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ఐపీఎల్ టైటిల్ ను ముంబై ఇండియ‌న్స్, చెన్నై సూప‌ర్ కింగ్స్ ఐదేసి సార్లు నెగ్గి టోర్నీలో అత్యంత విజ‌యవంత‌మైన జ‌ట్లుగా నిలిచాయి.
ఈడెన్ గార్డెన్స్ లో ఫైన‌ల్..
లీగ్ షెడ్యూల్ తో పాటు నాకౌట్ మ్యాచ్ ల‌ను కూడా ఈసారి ప్ర‌క‌టించారు. మే 20న క్వాలిఫ‌య‌ర్ -1, 21న ఎలిమినేట‌ర్ మ్యాచ్ లు హైద‌రాబాద్ లో జ‌రుగుతాయి. మే 23న క్వాలిఫ‌య‌ర్-2, మే-25న ఫైన‌ల్ మ్యాచ్ లు ఈడెన్ గార్డెన్స్ జ‌రుగుతాయి. ఇక స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబ‌ద్ జ‌ట్టు విష‌యానికొస్తే తొలి మ్యాచ్ ను మార్చి 23న రాజ‌స్థాన్ రాయ‌ల్స్ జ‌ట్టుతో ఆడ‌నుంది. సొంత‌గ‌డ్డ‌పై ఏడు, వేరే జ‌ట్ల వేదిక‌ల‌పై ఏడు మ్యాచ్ ల‌ను ఆడుతుంది. సొంత‌గ‌డ్డ‌పై రాజ‌స్థాన్ తో పాటు ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ (మార్చి 27న), గుజ‌రాత్ టైటాన్స్ (ఏప్రిల్ 6), పంజాబ్ కింగ్స్ (ఏప్రిల్ 12), ముంబై ఇండియ‌న్స్ (ఏప్రిల్ 23), ఢిల్లీ క్యాపిటల్స్ (మే 5), కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ (మే 10న‌)తో ఆడుతుంది.
పరాయి గ‌డ్డ‌పై..
ఇక స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ వేరే జ‌ట్ల‌తో అవే మ్యాచ్ ల‌ను ఆడుతుంది. ఢిల్లీ క్యాపిటల్స్ (మార్చి 30న‌), కోల్క‌తా నైట్ రైడ‌ర్స్ (ఏప్రిల్ 3), ముంబై ఇండియ‌న్స్ (ఏప్రిల్ 17), చెన్నై సూప‌ర్ కింగ్స్ (ఏప్రిల్ 25), గుజ‌రాత్ టైటాన్స్ (మే 2), రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు (మే 13న), ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ తో (మే 18న‌) ఆఖ‌రి లీగ్ మ్యాచ్ ను ఆడ‌నుంది. ఇక ఈసారి లక్నో, గుజ‌రాత్, ముంబై, ఢిల్లీ, కోల్ క‌తా జ‌ట్ల‌తో రెండేసి మ్యాచ్ ల‌ను ఆడ‌నుంది. రాజ‌స్థాన్, చెన్నై, పంజాబ్, బెంగ‌ళూరుతో ఒక్కో మ్యాచ్ ఆడ‌నుంది. ఇక గతేడాది సీజ‌న్ లో అద్భుత ఆట‌తీరుతో ఫైనల్ కి చేరిన స‌న్ రైజర్స్ ర‌న్న‌ర‌ప్ గా నిలిచింది. ఈసారి మాత్రం చాంపియ‌న్ గా నిల‌వాల‌ని అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ లోనూ మ‌రింత ప‌టిష్ట ప‌రుచుకుంది.

Read more:New Delhi:ఢిల్లీలో మరోసారి భూకంపం

Related posts

Leave a Comment