టీమిండియా స్టార్ పేసర జస్ప్రీత్ బుమ్రా రికార్డు సృష్టించాడు. ఆస్ట్రేలియా గడ్డపై ఐదు టెస్టుల సిరీస్‌లో అత్యధిక వికెట్టు తీసిన బౌలర్ రికార్డు నెలకొల్పాడు. 46 సంవత్సరాల రికార్డును బుమ్రా తన ఖాతాలో వేసుకున్నాడు
ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిన భారత్ బౌలర్
ముంబై, జనవరి 4
టీమిండియా స్టార్ పేసర జస్ప్రీత్ బుమ్రా రికార్డు సృష్టించాడు. ఆస్ట్రేలియా గడ్డపై ఐదు టెస్టుల సిరీస్‌లో అత్యధిక వికెట్టు తీసిన బౌలర్ రికార్డు నెలకొల్పాడు. 46 సంవత్సరాల రికార్డును బుమ్రా తన ఖాతాలో వేసుకున్నాడు. 1997-78లో ఆసీస్ గడ్డపై స్పిన్ దిగ్గజం బిషన్ సింగ్ బేడీ ఐదు టెస్టుల సిరీస్‌లో 31 వికెట్లు తీశాడు. ఐదో టెస్టులో బుమ్రా రెండు వికెట్లు తీయడంతో 32 వికెట్లకు చేరుకున్నాడు. దీంతో బిషన్ సింగ్ రికార్డును బద్దలు కొట్టాడు. 2024 వ సంవత్సరంలో 13 టెస్టుల్లో 71 వికెట్లు తీసి నంబర్ వన్ బౌలర్‌గా బుమ్రా ఉన్నాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న ఐదో టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ రెండో రోజు ఆసీస్ జట్టు 42 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 151 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది.
Read:Hyderabad:కేటీఆర్ అరెస్ట్ తప్పదా