Movie News:రెమ్యూనరేషన్ విషయంలో నయనతార ని దాటేసిన సాయి పల్లవి:లేడీ సూపర్ స్టార్ అంటే మన అందరికీ గుర్తుకు వచ్చే పేరు నయనతార ఈమె స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా చేసి హిట్లు అందుకోవడమే కాదు, లేడీ ఓరియెంటెడ్ చిత్రాల ద్వారా కూడా సూపర్ హిట్స్ ని అందుకుంది. అందుకే నయనతార ని లేడీ సూపర్ స్టార్ అంటారు. ఆమె తర్వాత అనుష్క ని కూడా లేడీ సూపర్ స్టార్ అని పిలుస్తుంటారు. ఎందుకంటే ఈమె చేసిన లేడీ ఓరియెంటెడ్ సినిమాలు అత్యధిక శాతం సూపర్ హిట్స్ గా నిలిచాయి. అయితే అనుష్క ఇప్పుడు రెగ్యులర్ గా సినిమాలు చేయడం లేదు, కానీ నయనతార మాత్రం రెగ్యులర్ గా సినిమాలు చేస్తూనే ఉంది.
రెమ్యూనరేషన్ విషయంలో నయనతార ని దాటేసిన సాయి పల్లవి
హైదరాబాద్, మార్చి 5
లేడీ సూపర్ స్టార్ అంటే మన అందరికీ గుర్తుకు వచ్చే పేరు నయనతార ఈమె స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా చేసి హిట్లు అందుకోవడమే కాదు, లేడీ ఓరియెంటెడ్ చిత్రాల ద్వారా కూడా సూపర్ హిట్స్ ని అందుకుంది. అందుకే నయనతార ని లేడీ సూపర్ స్టార్ అంటారు. ఆమె తర్వాత అనుష్క ని కూడా లేడీ సూపర్ స్టార్ అని పిలుస్తుంటారు. ఎందుకంటే ఈమె చేసిన లేడీ ఓరియెంటెడ్ సినిమాలు అత్యధిక శాతం సూపర్ హిట్స్ గా నిలిచాయి. అయితే అనుష్క ఇప్పుడు రెగ్యులర్ గా సినిమాలు చేయడం లేదు, కానీ నయనతార మాత్రం రెగ్యులర్ గా సినిమాలు చేస్తూనే ఉంది. అయితే ఆమె ఇండియా లోనే అత్యధిక రెమ్యూనరేషన్ ని అందుకునే హీరోయిన్స్ లో ఒకరిగా నిల్చిన సంగతి అందరికీ తెలిసిందే. సౌత్ లో ఒక వెలుగు వెలిగిన ఈమె బాలీవుడ్ లో షారుఖ్ ఖాన్ తో కలిసి ‘జవాన్’ అనే చిత్రంలో నటించింది.ఈ సినిమా కమర్షియల్ గా సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిలిచి 1200 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రంలో హీరోయిన్ గా చేసినందుకు నయనతార అందుకున్న రెమ్యూనరేషన్ 12 కోట్లు. మిగిలిన సినిమాలకు కూడా ఆమె 10 కోట్ల రూపాయిల రేంజ్ లో యావరేజ్ గా రెమ్యూనరేషన్ ని అందుకుంటుంది. అయితే ఇప్పుడు నయనతార ని రెమ్యూనరేషన్ విషయం లో సాయి పల్లవి దాటేసింది అంటున్నారు బాలీవుడ్ ట్రేడ్ పండితులు. సాయి పల్లవి ప్రస్తుతం బాలీవుడ్ లో రామాయణం చిత్రం చేస్తుంది.
ఇందులో రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా, యాష్ రావణుడిగా,రకుల్ ప్రీత్ సింగ్ సూర్పనక్క గా నటిస్తున్నారు. ఈ సినిమా లో సీతగా చేయడానికి సాయి పల్లవి ఏకంగా 15 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ని అందుకుంటుంది అట.ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. అంటే రెండు భాగాలకు కలిపి 30 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ని సాయి పల్లవి అందుకోబోతుంది అన్నమాట. ఇది మామూలు విషయం కాదు. ఈ రేంజ్ రెమ్యూనరేషన్ నేటి తరం స్టార్ హీరోయిన్స్ లో ఎవ్వరూ అందుకోలేదు. ఎందుకు ఆమెకు అంత ఇస్తున్నారంటే, సౌత్ లో సాయి పల్లవి కి ఉన్న క్రేజ్ కారణంగానే అని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. సౌత్ లో కేవలం ఈమె పేరు ని చూసి థియేటర్స్ కి కదిలే ఆడియన్స్ లక్షల సంఖ్యలో ఉంటారట. అందరూ ఈమెని లేడీ పవర్ స్టార్ అని పిలుస్తుంటారు . కేవలం ఈమె డ్యాన్స్ వేయడం వల్ల సూపర్ హిట్ అయిన సినిమాలు చాలానే ఉన్నాయి. అందుకే ఈమె క్రేజ్ సినిమాకు చాలా వరకు కలిసొస్తుందని నిర్మాతలు ఆమె ఎంత డిమాండ్ చేసిన ఇవ్వడానికి సుముఖత చూపిస్తున్నారట.
Read more:New York:దిగొచ్చిన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ