More protection for women with new laws Commissioner of Police Dr. B. Anuradha | నూతన చట్టాలతో మహిళలకు మరింత రక్షణ.. | Eeroju news

More protection for women with new laws Commissioner of Police Dr. B. Anuradha

నూతన చట్టాలతో మహిళలకు మరింత రక్షణ..

పోలీస్ కమిషనర్ డాక్టర్ బి. అనురాధ

సిద్దిపేట

More protection for women with new laws Commissioner of Police Dr. B. Anuradha

మహిళలు మౌనం వీడితే విజయం సాధించినట్లే. మహిళలు మౌనం వీడి  ధైర్యంగా  పోలీసులకు ఫిర్యాదు చేయండి..ర్యాగింగ్, ఇవిటిజింగ్, ఏదైనా అవమానానికి గురి అయినట్లయితే వెంటనే జిల్లా షీటీమ్ వాట్సాప్ నెంబర్ 8712667434 కాల్ చేయాలి.
మౌనం వీడితే మహిళా గెలిచినట్లే మౌనంగా ఉండి కష్టాలు కోరి తెచ్చుకోవద్దు. సైబర్ నేరాల పట్ల కూడా అప్రమత్తంగా ఉండాలని పోలీసు కమిషనర్  డాక్టర్ అనురాధ అన్నారు. సిద్దిపేట జిల్లాలో షీటీమ్స్ తో  మహిళలకు, బాలికలకు భద్రత, భరోసా

జిల్లాలోని హాట్స్పాట్ వద్ద  షీటీమ్స్ తో నిరంతరం నిఘా..
ఈవెటీజర్స్ 15 మందిని పట్టుకొని కౌన్సెలింగ్  నిర్వహించడం జరిగింది.
15 ఈ పెట్టి కేసులు,  నమోదు చేయడం జరిగింది.
హాట్స్పాట్ 32
షీటీమ్స్ బృందాలు హాట్స్పాట్ 121 సార్లు సందర్శించడం జరిగింది.
షీ టీమ్స్ 25 వివిధ ప్రదేశాలలో  కాలేజీలలో అవేర్నెస్ కల్పించడం జరిగింది.
సిద్దిపేట జిల్లాలో సిద్దిపేట, గజ్వేల్, హుస్నాబాద్, డివిజన్లవారీగా షీటీమ్స్ పనిచేయడం జరుగుతుంది.
సిద్దిపేట జిల్లాలో ఉన్న షీ టీమ్స్ బృందాలు ప్రభుత్వ కళాశాలలో, ప్రభుత్వ పాఠశాలల్లో, తెలంగాణ మోడల్ స్కూళ్లలో, రెసిడెన్షియల్ స్కూల్ లలో కేజీబీవీ స్కూళ్లలో విద్యార్థిని విద్యార్థులకు  ర్యాగింగ్, ఇవిటీజింగ్, పోక్సో, షీ టీమ్స్ యాంటీ హ్యుమెన్ ట్రాఫికింగ్ సైబర్ నేరాలపై నూతన చట్టాలపై  అవగాహన కల్పించడం జరుగుతుంది.

మహిళా పోలీస్ స్టేషన్, స్నేహిత మహిళా కౌన్సిలింగ్ సెంటర్, భరోసా సెంటర్, కు  కౌన్సిలింగ్ గురించి వచ్చే మహిళల  ఉపాధి లేనివారికి ఉపాధి కలిగించడం గురించి పోలీస్ కమిషనర్ మేడం గారు  ఆసక్తిగల 52 మంది మహిళలకు సిద్దిపేట పట్టణం కోటిలింగాల టెంపుల్ ఆవరణలో ఉన్న   ఆంధ్ర బ్యాంక్ వారి యొక్క సహకారంతో నిర్వహిస్తున్న శిక్షణా కేంద్రంలో ఎంబ్రాయిడింగ్, టైలరింగ్, ఫ్యాషన్ డిజైనింగ్ తదితర వాటిపై శిక్షణ ఇప్పించడం జరుగుతుందని అన్నారు.
జూలై 1 నుండి భారత దేశ వ్యాప్తంగా నూతన చట్టాలు  అమలు చేయడం జరుగుతుంది సంబంధిత బాధితులకు మహిళలకు పిల్లలకు నూతన చట్టాలు అండగా మరియు రక్షణగా నిలుస్తాయని తెలిపారు.

నూతన చట్టాలలో నేరస్తులకు  కఠిన శిక్షలు అమలు చేయడం జరుగుతుంది. మహిళలు బాలికల రక్షణ గురించి  తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకంగా షీటీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. మహిళల, బాలబాలికల, విద్యార్థిని, విద్యార్థులకు, రక్షణగా నిలుస్తూ సేవలు అందించడం జరుగుతుంది, ఏదైనా ఫోన్ వస్తే వెంటనే సంఘటన స్థలానికి చేయుచున్నారు,  గుర్తించిన హాట్స్పాట్ వద్ద మరింత నిఘా ఉంచడం జరుగుతుంది. హాట్స్పాట్స్ ప్రదేశాలలో సీసీ కెమెరాలు పనితీరును  ఎప్పటికప్పుడు సమీక్షించాలని, పనిచేయకపోతే వెంటనే సంబంధిత పోలీస్ అధికారులకు రిపేర్ చేయాలని సూచించడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో షీ టీమ్స్ ప్రత్యేక గుర్తింపు పొందిందని  తెలిపారు. మహిళలు బాలికలు విద్యార్థినిలు షీటీమ్స్ సేవలు వినియోగించుకోవాలని సూచించారు. ఎల్లవేళలా అందుబాటులో ఉండి సేవలు అందిస్తామని తెలిపారు. మహిళలు అత్యవసర పరిస్థితుల్లో డయల్-100 కు కాల్ చేసి తక్షణ పోలీస్ సహాయం పొందాలని సూచించారు.

More protection for women with new laws Commissioner of Police Dr. B. Anuradha

 

Kadapa district will be further developed, District Collector Lotheti Sivashankar | కడప జిల్లాను మరింత అభివృద్ధి చేస్తా: జిల్లా కలెక్టర్ లోతేటి శివశంకర్ | Eeroju news

Related posts

Leave a Comment