Monsoons spread all over the country | దేశమంతా విస్తరించిన రుతుపవనాలు | Eeroju news

Monsoons spread all over the country

దేశమంతా విస్తరించిన రుతుపవనాలు

హైదరాబాద్, జూలై 3, (న్యూస్ పల్స్)

Monsoons spread all over the country

తెలంగాణ రాష్ట్రంలో కింది స్థాయి గాలులు ప్రధానంగా పశ్చిమ మరియు నైరుతి దిశల నుండి వీస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. రాష్ట్రంలో కింది స్థాయి గాలులు పశ్చిమ, నైరుతి దిశ నుండి వస్తున్నాయి.ఈ రోజు, రేపు, ఎల్లుండి తెలంగాణ రాష్ట్రంలో కొన్ని జిల్లాలలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు అక్కడక్కడ  కురిసే అవకాశం ఉంది. రాష్ట్రంలో స్థిరమైన ఈదురుగాలులు గంటకు 30 నుండి 40 కి. మీ. వేగంతో వీచే అవకాశం ఉంది.హైదరాబాద్ లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది.

తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు ఉరుములతో కూడిన జల్లులు సాయంత్రం, రాత్రి సమయాల్లో ఈదురు గాలులు (30 నుంచి 40 కిలో మీటర్లు) వీచే అవకాశం ఉంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 33 డిగ్రీలు, 25 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఉపరితల గాలులు పశ్చిమ దిశలో వీచే అవకాశం ఉంది. గాలి వేగం గంటకు 10 – 14 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 30.7 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 24.6 డిగ్రీలుగా నమోదైంది. 77 శాతంగా గాలిలో తేమ శాతం నమోదైంది.

నైరుతి రుతుపవనాలు దేశంలోని అన్ని ప్రాంతాలకు జూలై 8 నాటికి విస్తరించాల్సి ఉండగా.. ఈ ఏడాది మాత్రం భిన్నంగా జూలై 2నాటికే విస్తరించాయని అమరావతి వాతావరణ అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఏపీ, యానాం మీదుగా దిగువ ట్రోపోస్ఫిరిక్ నైరుతి, పశ్చిమ గాలులు వీస్తున్నాయని తెలిపారు.అమరావతి వాతావరణ విభాగం అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తర కోస్తాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం, లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది.

40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది.దక్షిణ కోస్తాలోనూ ఓ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈదురు గాలులు కొన్ని చోట్ల 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో కూడా వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.రాయలసీమలోనూ ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురు గాలులు గంటకు 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.

Monsoons spread all over the country

 

తెలంగాణ వ్యాప్తంగా రానున్న మూడు రోజులపాటు వర్షాలు | Rains for the next three days across Telangana | Eeroju news

Related posts

Leave a Comment