ఎమ్మెల్యేలకు వాస్తు భయం
కరీంనగర్, జూలై 11 (న్యూస్ పల్స్)
MLAs are afraid of Vastu
కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ఎమ్మెల్యే క్యాంపు పనులు ప్రారంభం అయ్యాయి. ఇటీవలే నిర్మించిన ఈ భవనానికి సిట్టింగ్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మరమ్మత్తులు చేయించడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ భవనానికి వాస్తు బాగా లేకపోవడం వల్లే అపశృతులు చోటు చేసుకుంటున్నాయని భావించి, వాటికి అనుకూలంగా మరమ్మత్తులు చేయిస్తున్నారన్న ప్రచారం సాగుతోంది. హుజూరాబాద్ నుండి అప్రతిహతంగా గెలుస్తున్న ఈటల రాజేందర్ ఈ క్యాంపు అందుబాటులోకి షిప్ట్ అయిన తరువాత ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్నారనే వాదన స్థానికంగా వినిపిస్తోంది.
కొత్తగా నిర్మించిన ఈ భవనంలోకి మారిన తరువాత మంత్రివర్గంలో స్థానం కోసం ఊగిసలాడడం, ఆ తర్వాత పార్టీ నుంచి బయటకు రావడం, ఉప ఎన్నికలకు వెల్లడం, జనరల్ ఎన్నికల్లో ఓటమి పాలు కావడం వంటి చర్యలు కూడా క్యాంప్ కార్యాలయానికి వాస్తు లేకపోవడమేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.క్యాంపు ఆఫీసుకు సమీపంలో విద్యుత్ సబ్ స్టేషన్ ఉండటంతో పాటు భవనంలోని డోర్లు ఏర్పాటు చేయాల్సిన చోట చేయకపోవడం వల్ల ఇందులో నివసించే వారికి భవిష్యత్తులో ఆటంకాలు ఎదురవుతాయన్న వాదనలు బలంగా వినిపించాయి.
దీంతో ఈసారి ఎన్నికల్లో గెలిచిన కౌశిక్ రెడ్డి క్యాంప్ ఆఫీసులో కార్యకలాపాలు కొనసాగేందుకు వెనక ముందు ఆలోచించారని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఈ నేపథ్యంలోనే హుజురాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు భవనంలోనే మరమ్మత్తులు ప్రారంభం కానున్నాయి.భవనాన్ని వాస్తుకు అనుగుణంగా సెట్ చేసిన తరువాత సిట్టింగ్ ఎమ్మెల్యే గృహ ప్రవేశం చేయనున్నట్టు సమాచారం. అందుకే గెలిచి ఆరు నెలలు అవుతున్న ఇప్పటి వరకు క్యాంపు ఆఫీస్ లో అడుగు పెట్టలేదట. విశాలంగా క్యాంపు ఆఫీస్ ఉన్నప్పటికీ.. ఇక్కడికి మాత్రం రావడం లేదట. వీణవంక తన స్వంత ఇంట్లోనే బస చేస్తున్నారు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. మరోవైపు మంచిగా ఉన్న క్యాంపు ఆఫీస్ కి మరమ్మతులు చేయించడంపై విమర్శలు వస్తున్నాయి. మొత్తానికి రాజకీయ పార్టీ నేతలకు వాస్తు భయం పట్టుకుంది. ఈ విషయం గురించి మాట్లాడానికి కౌశిక్ నిరాకరిస్తున్నారు..
MLA Padi Kaushik Reddy | హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పై క్రిమినల్ కేసు | Eeroju news