వీధి కుక్క దాడిపై ఎమ్మెల్యే మాధవరం స్పందన
కూకట్ పల్లి
MLA Madhavaram Krishna Rao’s response to stray dog attack
బాలానగర్ డివిజన్ పరిధిలోని పలు కాలనీలలో ట్యూషన్ కి వెళ్తున్న చిన్నారులను వీధి కుక్క దాడి చేసిన ఘటన పైన స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు స్పందించారు. డివిజన్ పరిధిలో గాయపడిన 24 మంది బాధితుల కుటుంబాలను వారి ఇంటికి వెళ్లి పరామర్శించారు. అదేవిధంగా సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి వెంటనే చర్యలు చేపట్టాలని వారిని ఆదేశించారు. రోజురోజుకు పిల్లల పైన కుక్కల దాడి పెరిగిపోతుందని వీధి కుక్కలను పట్టుకొని వెళ్లేవారు వాటిని ఏం చేస్తున్నారో తెలియడం లేదని తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడే వదిలి వెళ్లడంతో అవి ప్రజల పైన దాడికి దిగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కలిసి వచ్చి వీటిని నిర్మూలనకు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు, దీనిపైన జిహెచ్ఎంసి మేయర్ తో పాటు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రులు కూడా దృష్టి సారించి ప్రజలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ వీధి కుక్క దాడిలో గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించేందుకు అనే విధాల ఏర్పాటు చేశామని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు.
Umm.. dogs in Nizamabad | నిజామాబాద్ లో అమ్మో…కుక్కలు | Eeroju news