మరోసారి దాతృత్వం చాటుకున్న ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్
తాడేపల్లిగూడెం
MLA Bolishetti Srinivas who showed generosity once again
తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. రెండు రోజుల క్రితం తేతలి సత్యనారాయణమూర్తి జిల్లా పరిషత్ హై స్కూల్ గ్రౌండ్ మరియు వాకింగ్ ట్రాక్ నిర్మాణానికి ప్రభుత్వ నిధులు ఆరు లక్షలకు ప్రతిపాదనలు పంపిన ఆయన ప్రజా సహకారం అందించాలని కోరారు. తాను ఇదే పాఠశాలలో విద్యను విభజించానని పూర్వ విద్యార్థిగా తన వంతుగా 50వేల విరాళాన్ని ప్రకటించారు. ఈ కార్యక్రమానికి సమన్వయకర్తగా ఎన్ వి సత్యనారాయణ నియమించి పనులు వేగవంతం చేయాలని కోరారు. ఈ మేరకు శుక్రవారం తన కార్యాలయంలో ఇచ్చిన మాట ప్రకారం 50,000 ను సమన్వయకర్త ఎన్ వి సత్యనారాయణ కు అందజేశారు. పూర్వ విద్యార్థులంద రితోపాటు ప్రజలు సహకారం అందిస్తే పనులు మరింత శాశ్వతంగా జరిగే అవకాశం ఉందని దాతలు స్పందించి సహకారం అందించాలని కోరారు. మన ఊరు మన స్కూలు పేరుతో జరిగే ఈ కార్యక్రమం నియోజకవర్గానికి కాకుండా రాష్ట్రానికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు.