మున్నేరు రిటర్నింగ్ వాల్ పనులను పరిశీలించిన మంత్రి పొంగులేటి | Minister Ponguleti inspected the Munneru Returning Wall works | Eeroju news

ఖమ్మం

ఖమ్మం జిల్లా దానవాయిగూడెంలో మున్నేరు రిటర్నింగ్ వాల్ నిర్మాణ పనులను తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పరిశీలించారు.  ఈ సందర్భంగా అధికారులతో మంత్రి మాట్లాడుతూ – యుద్ధప్రాతిపదికన పనులను త్వరగా పూర్తి చేయాలని అన్నారు. ప్రతిభావంతులైన వర్కర్లను నియమించి  పనుల్లో లోపాలు తలెత్తకుండా చూడాలి.

ఇప్పటికే నాలుగు నెలల సమయం వృధా అయింది…ఫుల్ టైం నిర్మాణ పనులను చేపట్టి త్వరగా పూర్తి చేయండి.  పదిరోజుల్లో మళ్ళీ వస్తా… పనుల్లో పురోభివృద్ధి లేకపోతే బాధ్యుల పై చర్యలు…. పనుల్లో నాణ్యత లోపించిన ఊరుకునేది లేదు.  రెవెన్యూ అధికారులు మున్నేరు కు ఇరువైపులా ఉన్న ప్రభుత్వ భూములను గుర్తించి ఇరిగేషన్ అధికారులకు అప్పగించండి.

గోళ్ళపాడు సైడ్ డ్రెన్ల మాదిరిగా మున్నేరు సైడ్ డ్రైన్ లను నిర్మించండి.  స్టార్టింగ్ పాయింట్… ఎండింగ్ పాయింట్ లను గుర్తించి సైడ్ డ్రైన్ ల నిర్మాణ పనులను చేపట్టాలి… తద్వారా మురికి నీరు మున్నేరు లో చేరకుండా ఉంటుందని అన్నారు.

Related posts

Leave a Comment