హైదరాబాద్ నగరంలో ట్రాఫిర్ రద్దీ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. కొన్ని ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద గంటలకొద్దీ వేచి చూడాల్సిన పరిస్థితి. అత్యవసర సమయాల్లో నగరంలోని ఓ ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి చేరుకోవటం చాలా కష్టమైన పని.
హ్యాట్సాఫ్ హైదరాబాద్ మెట్రో..
హైదరాబాద్, జనవరి 18
హైదరాబాద్ నగరంలో ట్రాఫిర్ రద్దీ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. కొన్ని ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద గంటలకొద్దీ వేచి చూడాల్సిన పరిస్థితి. అత్యవసర సమయాల్లో నగరంలోని ఓ ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి చేరుకోవటం చాలా కష్టమైన పని. అంబులెన్స్ వంటి ఎమర్జెన్సీ వాహనాలు సైతం వేగంగా వెళ్లలేని పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో హైదరాబాద్ మెట్రో ఓ వ్యక్తికి ప్రాణం పోసింది. గ్రీన్ ఛానెల్ ద్వారా మెట్రోలో గుండెను తరలించటంతో వ్యక్తి ప్రాణం నిలిచింది. ఎల్బీనగర్ నుంచి లక్డీకపూల్ వరకు గ్రీన్ ఛానెల్ ఏర్పాటు చేసి సకాలంలో గుండె మార్పిడి చేయటంతో వ్యక్తికి పునర్జన్మను ప్రసాదించినట్లయింది.వివరాల్లోకి వెళితే.. జనవరి 17న రాత్రి 8-9 గంటల సమయంలో LB నగర్‌లోని కామినేని హాస్పిటల్‌లో ఓ వ్యక్తి బ్రెయిన్ డెడ్ కావటంతో అతడి అవయవదానానికి కుటుంబ సభ్యులు ముందుకు వచ్చారు. లక్డీకపుల్‌లోని గ్లెనీగల్స్ గ్లోబల్ హాస్పిటల్‌లో ఓ వ్యక్తి హృదయ సంబంధిత సమస్యలతో బాధపడుతుండటంతో అతడికి దాత గుండెను అమర్చాలని డాక్టర్లు భావించారు. అయితే ఎల్బీనగర్ నుంచి గ్లెనీగల్స్ ఆసుపత్రికి గుండెను తరలించటం సవాల్‌గా మారింది. ఈ దారిలో ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. సకాలంలో గుండెను తరలించకపోతే ఉపయోగం ఉండదు. దీంతో హాస్పిటల్ సిబ్బంది ఎల్బీనగర్ మెట్రోను ఆశ్రయించారు. వ్యక్తి ప్రాణం కాపాడేందుకు సహకరించాలని కోరారు.దీంతో వేగంగా స్పందించిన మెట్రో అధికారులు.. రాత్రి 9.30 గంటల ప్రాంతంలో ఎల్బీనగర్ నుంచి లక్డీకపూల్ వరకు గ్రీన్ ఛానెల్ ఏర్పాటు చేశారు. మెుత్తం ఎల్బీనగర్ నుంచి 13 స్టేషన్లు.. 13 కిలోమీటర్లు.. 13 నిమిషాల్లో లక్డీకపూల్ హాస్పిటల్‌కు గుండెను చేర్చారు. వ్యక్తి ప్రాణాలను రక్షించే క్రమంలో క్లిష్టమైన సమయాన్ని ఆదా చేశారు. ఈ మేరకు హైదరాబాద్ మెట్రో అధికారులు ప్రకటన విడుదల చేశారు. అత్యవసర సేవలకు మద్దతు ఇవ్వడానికి L&T మెట్రో రైల్ (హైదరాబాద్) లిమిటెడ్ కట్టుబడి ఉందని తెలిపారు. ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను ఉపయోగించుకోవడం ద్వారా హైదరాబాద్ మెట్రో సమాజ సంక్షేమానికి దోహదపడుతుందన్నారు.హైదరాబాద్ మెట్రో ప్రతినిత్యం లక్షల మందిని గమ్యస్థానాలకు చేరుస్తోంది. ట్రాఫిక్ రద్దీ లేకుండా నగరం ఓ మూల నుంచి మరో మూలకు చేరుకునేందుకు చాలా మంది మెట్రోను ఆశ్రయిస్తుంటారు. ప్రతి నిత్యం ఎల్బీనగర్-మియాపూర్, ఎంజీబీఎస్-జేబీఎస్, నాగోల్-రాయదుర్గం మూడు కారిడార్లలో దాదాపు 5 లక్షల మంది ప్రయాణాలు సాగిస్తున్నారు. మెట్రోకు ఉన్న ఆదరణ దృష్ట్యా ఫేజ్-లో మరిన్ని ప్రాంతాలకు విస్తరించేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమైంది.
Read:Hyderabad:హైదరాబాద్ లో బీదర్ గ్యాంగ్