Medak:గులాబీని హరీష్ రావే లీడ్ చేస్తారా

will harish rao lead a gulabi party

ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఈ ఏడాది మార్చి నుంచి ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆగస్టు నెలలో తీహాడ్‌ జైలు నుంచి విడుదలయ్యారు. జైలు నుంచి విడుదలైన తర్వాత కవిత.. ఇంటికే పరిమితమయ్యారు. అయితే కొద్దిరోజులుగా కవిత మళ్లీ రాజకీయం క్షేత్రంలోకి పునరాగమనం చేశారు. జాగృతితో పాటు పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు.అధికారం కోల్పోయిన తర్వాత చోటు చేసుకుంటున్న పరిణామాలతో బీఆర్ఎస్ సతమతవుతూ వస్తోంది.

 గులాబీని హరీష్ రావే లీడ్ చేస్తారా

మెదక్, డిసెంబర్ 30
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఈ ఏడాది మార్చి నుంచి ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆగస్టు నెలలో తీహాడ్‌ జైలు నుంచి విడుదలయ్యారు. జైలు నుంచి విడుదలైన తర్వాత కవిత.. ఇంటికే పరిమితమయ్యారు. అయితే కొద్దిరోజులుగా కవిత మళ్లీ రాజకీయం క్షేత్రంలోకి పునరాగమనం చేశారు. జాగృతితో పాటు పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు.అధికారం కోల్పోయిన తర్వాత చోటు చేసుకుంటున్న పరిణామాలతో బీఆర్ఎస్ సతమతవుతూ వస్తోంది. ఓవైపు కీలక నేతలపై కేసులు తెరపైకి వస్తున్నాయి. తాజాగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ఏసీబీ, ఈడీ కేసులు నమోదయ్యాయి. ఫార్ములా ఈరేస్ కేసలో అక్రమాలు చోటు చేసుకున్నాయని… ఇందులో కేటీఆర్ పాత్ర ఉందంటూ ఎఫ్ఐఆర్ రికార్డైంది. ఈ కేసులో దర్యాప్తు సంస్థలు… కేటీఆర్ ను ఏ1గా పేర్కొన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కవిత రీఎంట్రీ… బీఆర్ఎస్ లో కీలకంగా మారిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ఫార్ములా ఈరేస్ కేసులో జనవరి 7వ తేదీన విచారణకు రావాలని కేటీఆర్ కు ఈడీ నోటీసులు జారీ చేసింది. కేటీఆర్ తో పాటు సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్ ఎండీఏ మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్ ఎన్ రెడ్డిలను జనవరి 2, 3 తేదీల్లో హాజరుకావాలని సమన్లు జారీ చేసింది. రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద ఈడీ అధికారులు దర్యాప్తు ప్రారంభించిన సంగతి తెలిసిందేబీఆర్ఎస్ పార్టీని వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో కేటీఆర్ నడిపిస్తున్నారు. అన్ని కార్యక్రమాల్లో ఆయనే కీలకంగా ఉంటూ వస్తున్నారు. ఏడాది కాలంగా రేవంత్ పాలనపై పోరాడుతున్నారు. అయితే ఫార్ములా ఈరేస్ కేసులో కేటీఆర్ ను ఏసీబీ లేదా ఈడీ అరెస్ట్ చేస్తే.. పార్టీని ఎవరు లీడ్ చేస్తారనే చర్చ అప్పుడే మొదలైంది. ఈ క్రమంలోనే ఎమ్మెల్సీ కవిత పేరు తెరపైకి వస్తోంది. పార్టీ పగ్గాలను కవిత చేపడుతారనే టాక్ వినిపిస్తోందిఇక బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ కు పరిమితమయ్యారు. ఏడాది కాలంగా కేటీఆర్, హరీశ్ రావులు పార్టీ కార్యక్రమాలను పర్యవేక్షిస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. మూసీ సుందరీకరణ, హైడ్రా కూల్చివేతలు, లగచర్ల ఘటన, రైతుబంధు, దళితబంధు వంటి అంశాలపై ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో పోరాడుతూ వచ్చారు. పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తూ రేవంత్ సర్కార్ ను తీవ్రస్థాయిలో విమర్శనాస్త్రాలను సంధిస్తున్నారు.ఫార్ములా ఈరేస్ కేసులో కేటీఆర్ అరెస్ట్ వంటి పరిణామాలు చోటు చేసుకుంటే… పార్టీని హరీశ్ రావు లీడ్ చేసే అవకాశం ఉంటుంది. అయితే హరీశ్ రావుకు బాధ్యతలు ఇస్తారా…? లేదా..? అన్న విషయంలో కేసీఆర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.

ఒకవేళ హరీశ్ రావు పార్టీ కార్యక్రమాలను పర్యవేక్షిస్తే… పార్టీపై పూర్తిస్థాయిలో పట్టు సాధించే అవకాశం లేకపోలేదు.ఈ ఏడాది ఆగస్టులో జైలు నుంచి విడుదలైన కవిత చాలా రోజులుగా ఇంటికే పరిమితమయ్యారు. కానీ కొద్దిరోజులుగా పొలిటికల్ గా మళ్లీ యాక్టివ్ అయ్యారు. పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. రేవంత్ సర్కార్ పై ప్రశ్నలు గుప్పిస్తున్నారు. ఇటీవలే జరిగిన శాసన మండలి సమావేశాల్లో కూడా పార్టీ తరపున కీలకంగా వ్యవహరించారు. ఓ రకంగా పార్టీలో కవిత క్రియాశీలకంగా మారారనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.గత నెల రోజులుగా కవిత పలు వేదికలపై కనిపిస్తున్నారు. స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్ల కోటా ఖరారుపై చర్చించాలని నవంబర్ 23న ప్రత్యేక కమిషన్ ను కోరారు. బీసీ కుల గణనలో తీసుకోవాల్సిన చర్యలను కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. స్థానిక సంస్థల్లో బీసీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు దక్కేలా, విద్య, ఉద్యోగాల్లో బీసీల రిజర్వేషన్లు పెంచేలా సిఫార్సులు చేయాలని కవిత విన్నవించారు. రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రంలో బీసీలు బలమైన సామాజికవర్గాలుగా ఉన్నారు. బీసీల సమస్యలపై పోరాటం ద్వారా… ఆయా వర్గాలతో జతకట్టవచ్చనే భావన కవితలో ఉన్నట్లు పలువురు విశ్లేషకులు చెబుతున్నారు. సుమారు 40 ఓబీసీ సంఘాలతో కవిత సమావేశమయ్యారు. ఇందులో ప్రసంగించిన కవిత… బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై తీర్మానం చేసే వరకు స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. సావిత్రిబాయి ఫూలే జయంతి సందర్భంగా జనవరి 3న ఇందిరాపార్కు వద్ద బీసీ సంఘాల నుంచి మద్దతు కూడగట్టేందుకు సభ నిర్వహించనున్నట్లు ప్రకటించారు.తెలంగాణ తల్లి విగ్రహాం మార్పు విషయంలో కూడా రేవంత్ సర్కార్ పై కవిత విమర్శలు గుప్పించారు. డిసెంబర్ 16వ తేదీన తెలంగాణతల్లి విగ్రహానికి సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వులను ధిక్కరిస్తూ… జగిత్యాల పట్టణంలో విగ్రహ ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె చేసిన ప్రసంగంలో… తెలంగాణ సాంస్కృతిక అస్తిత్వంతో తనకున్న అనుబంధాన్ని, రాష్ట్ర ఆత్మగౌరవ చిహ్నాలను పరిరక్షించడంలో తన నిబద్ధతను నొక్కి చెప్పారు.కవిత పునరాగమనంపై పార్టీలోనూ, రాష్ట్ర రాజకీయవర్గాల్లోనూ కీలక చర్చ జరుగుతోంది. పార్టీని బలపేతం చేయటంలో కీలకంగా ఉండటంతో పాటు రాష్ట్రవ్యాప్తంగానూ తన పలుకుబడిని పునరుద్ధరించే యోచనలో కవిత ఉన్నట్లు ఆమె సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.న్యాయపరమైన చిక్కుల మధ్య కేటీఆర్ రాజకీయ భవిష్యత్తుపై కాస్త అనిశ్చితి నెలకొనే అవకాశం లేకపోలేదు. ఇదే టైంలో పార్టీలో కవిత పాత్ర కీలకంగా మారే అవకాశం ఉంది. కవిత పునరాగమనం….పార్టీ బలోపేతంతో పాటు పునర్నిర్మాణ ప్రయత్నాలకు తోడ్పాడుటునిస్తుందని ఓ బీఆర్ఎస్ ముఖ్య నేత చెప్పుకొచ్చారుకవిత రాకతో పార్టీకి పెద్దగా ఒరిగేదేమీ ఉండదని టాక్. మద్యం కేసులో ఆమెను అరెస్టు చేసినప్పుడు చెప్పుకోదగ్గ స్పందనలు ఏమీ లేవని గుర్తు చేశారు. సోదరి, సోదరుడిపై అవినీతి ఆరోపణలు ఉధృతం చేయడం ద్వారా బీఆర్ఎస్ పార్టీపై రేవంత్ టీమ్ నిప్పులు చెరగడం ఖాయమని అభిప్రాయపడ్డారు.

Related posts

Leave a Comment